కేరళకు  మరొక జలగండం హెచ్చరిక
x

కేరళకు మరొక జలగండం హెచ్చరిక

భారత వాతావరణ విభాగం కేరళను మరోసారి అలర్ట్ చేసింది. 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. వాయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.


భారత వాతావరణ విభాగం (IMD) కేరళను మరోసారి అలర్ట్ చేసింది. 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. వాయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూర్‌లలో ఒకటి లేదా రెండు చోట్ల, కోజికోడ్, వాయనాడ్‌లలో భారీ వర్షాలు (24 గంటల్లో 7 సెం.మీ నుంచి 11 సెం.మీ.) అతి భారీ (24 గంటల్లో 12 సెం.మీ. నుంచి 20 సెం.మీ) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

లక్షద్వీప్‌కు 'రెడ్' అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు (24 గంటల్లో 20 సెం.మీ కంటే ఎక్కువ) కురుస్తాయని హెచ్చరించింది.

జూలై 30వ తేదీ కురిసిన భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడి 230 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. అయితే భారీ వర్షపాతాన్ని అంచనా వేయడంలో IMD విఫలమైందని కేరళ ప్రభుత్వం ఆరోపించింది. దీనికి IMD చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర కౌంటర్ ఇచ్చారు. జూలై 30 తెల్లవారుజామున కేరళకు రెడ్ అలర్ట్ జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. ఆరెంజ్ వార్నింగ్ అంటేనే అప్రమత్తం చేయడమని, రెడ్ వార్నింగ్‌ కోసం వేచి ఉండకూడదని IMD చీఫ్ చెప్పారు.

Read More
Next Story