‘ఆగమం’ లో హిందూవులు మాత్రమే గుడికి రావాలని ఉందా?
x

‘ఆగమం’ లో హిందూవులు మాత్రమే గుడికి రావాలని ఉందా?

దేవాలయాల్లోకి హైందవేతరులు రావద్దని ఆగమశాస్త్రం చెప్పిందా? రాజ్యాంగం హిందూవులు అంటే ఏమంది. మద్రాస్ హైకోర్టు, మధురై బెంచ్ ఇచ్చిన తీర్పు ఏ మార్పు తీసుకురానుంది.

 &

హైందవ దేవాలయాల్లోకి ప్రవేశించే హైందవేతరుల వివరాలను నమోదు చేయాలని, ఒకవేళ ఆలయంలోకి అన్యమతస్తులు ప్రవేశించాలనుకుంటే తాము ఆ దేవత పట్ల విశ్వాసం, నమ్మకం కలిగి ఉన్నానని ప్రమాణపత్రం దాఖలు చేయాల్సి ఉంటుందని మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆదేశించింది.

ఎవరైన హైందవేతరులు ఆలయ ధ్వజ స్తంభాన్ని దాటి ముందుకు పోరాదని, హిందూవులకు కూడా తమ మత ఆచారాలను స్వేచ్ఛగా పాటించుకునే ప్రాథమిక హక్కు కలిగి ఉన్నారని మధురై బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి అన్నారు. కొంతమంది హిందూయేతరులు ఈ మధ్య కొన్ని ఆలయాల్లోకి ప్రవేశించి మాంసం తినడం, వారి మత గ్రంథాలను చదివేందుకు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా న్యాయస్థానం ప్రస్తావించింది.

హిందూ దేవాలయాలను నిర్మించి, నిర్వహించడానికి ఆగమ శాస్త్రాన్ని పాటిస్తారని, ఇక రాష్ట్రంలోని ప్రతి ఆలయం ముందు హిందూవులకు మాత్రమే ప్రవేశం అన్న బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. "ఆలయాలు ఏం పిక్నిక్ స్పాట్, టూరిస్ట్ ప్లేస్ కాదు. ఆగమ శాస్త్రాన్ని, సాంప్రదాయాన్ని గౌరవించాలి " అని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు.

‘పళని దండాయుధపాణి స్వామి’ ఆలయంలోకి హిందూవులు కానివారిని అనుమతించవద్దని, పళినికి చెందిన ‘పళని హిల్ టెంపుల్ డివోటీస్ ఆర్గనైజేషన్ ఆర్గనైజర్’ డి సెంథిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు దండాయుధ పాణి స్వామి ఆలయంలోకి హిందూవులు కానీ వారికి ప్రవేశం నిషిద్దం అనే బోర్డు ఉండేదని, కానీ ఆలయ పునరుద్దరణ తరువాత ఈ బోర్డును అధికారులు ఏర్పాటు చేయలేదని పిటిషన్ లో సెంథిల్ ఆరోపించారు. దయచేసి ఇప్పుడు ఆ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.

పిటిషన్ ఎందుకు వేసారంటే..

పళని దండాయుధ స్వామి ఆలయంలోకి షాహూల్ అనే పండ్ల దుకాణం వ్యాపారి బురఖాలు ధరించిన తన బంధువులను పళని ఆలయానికి తీసుకువచ్చాడని పిటిషన్ దారుడు సెంథిల్ కుమార్ ఆరోపించారు. ఆలయం ఉన్న కొండపైకి వెళ్లేందుకు టికెట్లు కొనుగోలు చేశాడు. అయితే బురఖాలో వస్తున్న వారిని చూసి సెక్యూరిటీ సిబ్బంది వారిని ఆపి, టిక్కెట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే షాహూల్ వారితో వాగ్వాదానికి దిగాడు. ఆలయం టూరిస్ట్ ప్లేస్ అని, ఇక్కడ హిందూవులు కానీ వారు రావద్దు అని ఏమైనా బోర్డులు ఉన్నాయా అంటూ వీరంగం సృష్టించాడు. తన కుటుంబసభ్యులు కొండపైకి వెళ్లి ఫొటోలు తీసుకోవాలని అనుకుంటున్నారని, పైకి వెళ్లాల్సిందే అని గొడవపడ్డాడు. అందుకే హిందూయేతరులకు దేవాలయాల్లోని అనుమతించరాదని సూచించే బోర్డులను పునరుద్దరించాలని కోరుతూ 2023 జూన్ లో సెంథిల్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ తీర్పుపై మంత్రి పీకే శేఖర్ ఫెడరల్ తో మాట్లాడారు. " హైకోర్టు నుంచి మాకు ఫిజికల్ కాపీ రాలేదు. రాగానే న్యాయనిఫుణులు, ఆగమపండితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉన్నాం. ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసే విషయం పై ఇప్పుడే ఏం చెప్పలేము, మాకు కొంత సమయం కావాలి " అని అన్నారు.

ఈ విషయంపై దేవాదాయ శాఖ అధికారులను కలిసి అడినప్పుడు "హిందూవులు కానీ వారికి ఆలయ ప్రవేశం లేదనే బోర్డుల ఏర్పాటు పై మాకు ఎలాంటి సమాచారం అందలేదు" అని సమాచారం ఇచ్చారు. "రాష్ట్రంలోని కొన్ని ప్రముఖ దేవాలయాల్లో ఇలాంటి బోర్డులు ఉన్నాయి. మరికొన్ని ఆలయాల్లో మాత్రం లేవు, కొన్ని దేవాలయాల్లోకి విదేశీయులు, ఇతర మతాల వారిని గర్భగృహంలోకి అనుమతించరు" అని దేవాదాయ శాఖకు చెందిన ఓ ప్రముఖ అధికారి ఫెడరల్ కు చెప్పారు.

ఆగమపండితుడు ఏమన్నారంటే

దేవాదాయ శాఖకు సలహదారుగా ఉన్న సత్యవేల్ మురుగనార్ తో ఫెడరల్ మాట్లాడింది. ఆయన సమాధానం ప్రకారం " ఏ ఆగమ గ్రంథంలో హిందూవులు కానివారిని రావద్దు అని ప్రత్యక్ష ప్రస్తావన లేదు. వేదాలను మాత్రమే నమ్మి, విగ్రహరాధనను వ్యతిరేకించే స్మార్త బ్రాహ్మణులు లేదా శైవులను మాత్రమే ఆలయంలోకి రాకుండా నిషేధించబడ్డారు. వారిని కేవలం ధ్వజస్తంభం వరకు మాత్రమే అనుమతిస్తారు, ఒకవేళ నియమాలు ఉల్లఘించి గర్బగుడిలోకి ప్రవేశిస్తే ఆలయాన్ని శుభ్రం చేయాలని మాత్రమే ఆగమంలో ఉంది" అని ఆయన వివరించారు.

రాజ్యాంగం హిందూవులు అంటే ఎవరిని గుర్తించింది.

హిందూవులు అంటే రాజ్యాంగంలో విస్త్రృత అర్థం ఉంది. బౌద్దులు, జైనులు, పార్శీలు, శైవులు, వైష్ణవులు, సనాతన, సక్తం, గణపత్యం, గౌమారం అనేక వారందరిని కలిపి హిందూవులుగా పరిగణించిందని మురుగనార్ అన్నారు. ఆచరణలో హిందూ అనే పదం రావడానికంటే ముందే ఆగమాలు రాయబడ్డాయి. అయితే అందులో నాస్తికులకు వ్యతిరేకంగా ఏం రాయబడలేదని ఆయన వివరించారు. ఆగమన ప్రస్తావన, కొటేషన్లు కోర్టు ఆర్డర్ లో ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు.

Read More
Next Story