ఇండోర్ తరహ ఘటన బెంగళూర్ లో జరగబోతుందా?
x
కలుషితమైన త్రాగునీరు

ఇండోర్ తరహ ఘటన బెంగళూర్ లో జరగబోతుందా?

లింగరాజపురంలో కలుషితమైన త్రాగునీరు


విజయ్ జోన్నహళ్లి

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సహ అనేక నగరాల్లో ప్రాణాంతకమైన నీటి కాలుష్యం ప్రబలి వారం రోజులే అయింది. ఇదే తరహ వాతావరణం బెంగళూర్ లో జరగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. నగరంలోని లింగరాజపరంలోని కేఎస్ఎఫ్సీ ప్రాంతంలో తాగునీటిని తీసుకెళ్లే పైపులోకి మురుగునీరు చేరుతోంది. దీని స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

దశాబ్ధాల క్రితం ఏర్పాటు చేసిన పైపుల నుంచి మురికి నీరు తరుచుగా రావడం ఈ మధ్య సాధారణంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. దీనితో వారు ప్రత్యామ్నాయంగా నీటి ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు.
కొంతమంది స్థానికులు ఇప్పటికే అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే స్థానికంగా ఉండే వాట్సాప్ గ్రూపులలో నీటికి సంబంధించిన సమాచారం పంచుకోవడంతో ఇండోర్ తరహ లాంటి పరిస్థితిని నివారించుకున్నారు.
ఫెడరల్ కర్ణాటక బృందం నగరంలోని పలు ప్రాంతాలతో పాటు లింగరాజపురంను సందర్శించింది. కొంతమంది స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించింది.

పిల్లలకు కలుషిత నీరు..
లింగరాజపురం నివాసి ఇద్దరు పిల్లల అమ్మ అయిన రోజా మాట్లాడారు. పిల్లలకు రోజు బెంగళూర్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డ్ చేసే నీటిని తాగించేవాళ్లమని చెప్పారు. ఇప్పుడు నీరు కలుషితమవుతుందని, మేము అనారోగ్య ముప్పును ఎదుర్కొంటున్నామని చెప్పారు.
గత పదిహేను రోజులుగా కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతున్నానని చికిత్స తరువాత కోలుకున్నామని చెప్పారు. ఇండోర్ లో జరిగిన విషాదం తరువాత తాము తీవ్ర ఆందోళన చెందినట్లు చెప్పారు. వాటర్ బోర్డు సప్లయ్ చేసిన నీటిని ఆమె వాటర్ బాటిల్ లో పట్టి చూపించారు.
పాత పైపులను మార్చడం లేదు
మరో నివాసి మోసెస్ మాట్లాడుతూ.. మూడు దశాబ్ధాలుగా వాటర్ బోర్డు అధికారులు పాత పైపులను మార్చలేదని చెప్పారు. ‘‘తాగునీటి పైపుల్లో మురుగు నీరు వస్తోంది. నా కోడలు గర్భవతి. ప్రతిరోజు విరేచనాలతో బాధపడుతోంది.
నా కూతురికి కూడా కడుపు నొప్పి వచ్చింది. కాలనీ వారు వాట్సాప్ గ్రూపుల్లో నీటి కాలుష్యం గురించి చెప్పిన తరువాతే విషయం తెలిసింది’’ అని ఆయన ది ఫెడరల్ తో అన్నారు.
మురుగు నీరు సమీపంలో కావేరి నీటిని తీసుకుకెళ్లే పైప్ లైన్ లో కలుస్తోందని ఆరోపించారు. మరో నివాసి మాట్లాడుతూ.. నీరు వాసన రావడంతో తాను ట్యాంక్ నీటికి మారినట్లు చెప్పారు.
వాట్సాప్ ద్వారా అప్రమత్తం..
పదిహేను రోజుల నుంచి ఈ ప్రాంత నివాసితులు వాట్సాప్ ద్వారా ఒకరికొకరు ఏదో సమస్య ఉందని ట్యాప్ వాటర్ నీరు శుభ్రంగా లేదని సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారు. కొన్ని రోజుల తరువాత వాటర్ బోర్డ్ కు ఫిర్యాదు చేశారు.
తరువాత వాటర్ బోర్డు కూడా ప్రభావిత ప్రాంతాలకు సరఫరా నిలిపివేసింది. కాలుష్యం జరిగిన ప్రదేశాలను అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీతో గుర్తించారు. ఆ తరువాత మరమ్మతు పనులు ప్రారంభించారు.
ఈ విషయం పరిష్కారం అయ్యే వరకూ నీటిని వాడటం మానేయాలని, బదులుగా ట్యాంకర్ సరఫరాకు మారాలని సూచించింది. ఆ విధంగా నివాసితుల అవగాహాన లింగరాజపురం మరొక భగీరథపురంగా మారకుండా సాయపడింది.
ఇండోర్ లో అనేక మరణాలు, అనారోగ్యంతో అల్లకల్లోలంగా మారింది. ఏమైన జాగ్రత్త లోపాలు ఉంటే ఇక్కడ కూడా మరణాలు సంభవించి ఉండేవని ఆమోస్ అన్నారు.
ట్యాంకర్ నీరు ఖరీదు ఎక్కువ..
నీటి కోసం ప్రయివేట్ ట్యాంకర్లపై ఆధారపడటం వల్ల నివాసితులకు కష్టంగా మారింది. ట్యాంకర్ యజమానులు తమ పరిస్థితిని ఆసరాగా తీసుకుని నీటి రేట్లను పెంచినట్లు స్థానికులు ఆరోపించారు.
జలమండలి అధికారులు సమస్యను పరిశీలించి శుక్రవారం నాటికి సమస్యను పరిష్కారిస్తామనే హమీ ఇచ్చారని రోజా చెప్పారు. పైపులైన్ల మరమ్మతులు జరుగుతుండగా కొరతను నివారించడానికి ప్రభుత్వం నిర్వహించే సంచారీ కావేరి మొబైల్ ట్యాంకర్ల ద్వారా ప్రభావిత ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
Read More
Next Story