విజయ్ కోసం బీజేపీ రాజకీయ ఎత్తులు వేస్తోందా?
x
విజయ్

విజయ్ కోసం బీజేపీ రాజకీయ ఎత్తులు వేస్తోందా?

సీబీఐ విచారణ కోసం ఢిల్లీకి రప్పించడంపై కారణమేంటీ?


తమిళగ వెట్రి కజగం అధినేత, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే వారి ఆశలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ నీళ్లు చల్లింది.

జననాయగన్ సినిమా విడుదలలో చాలాకాలంగా జాప్యం జరగడంపై విజయ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కరూర్ తొక్కిసలాట దర్యాప్తుకు సంబంధించి జనవరి 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ఆయన హజరుకావడంపై చర్చలు జరుగుతున్నాయి.
ఇదే సమయంలో సీబీఎఫ్సీ సర్టిఫికెట్ వ్యవహరం జరగడంతో వివాదం అందరి దృష్టిని ఆకర్షించింది. సీబీఐ అధికారులు విజయ్ వాహన డ్రైవర్ ను ప్రశ్నించడంతో ఆయన రాజకీయంగా లక్ష్యంగా మారారనే ఊహగానాలు చెలరేగాయి.
రాజకీయ పొత్తులు..
జననాయగన్ సినిమా దాదాపు రూ.500 కోట్లతో తెరకెక్కింది. విడుదల తేదీ ప్రకటించినప్పటికీ సినిమా సెన్సార్ వ్యవహరంలో జరిగిన జాప్యంతో అనివార్య పరిస్థితుల్లో ఆగిపోయింది.
తరువాత కోర్టు ఆదేశంతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టు విచారణకు ఈ నెల 21కి వాయిదా వేసింది. ఇవన్నీ కూడా విజయ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి పెరుగుతున్న ఒత్తిడిని తెలియజేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
టీవీకేతో సహ అనేక రాజకీయ పార్టీలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సినిమాను ఆలస్యం చేయడానికి సెన్సార్ బోర్డును అడ్డంపెట్టుకుందని ఆరోపించాయి. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రభావం క్రమంగా పెరుగుతుండటంతో, సినిమాను ఆలస్యం చేసి రాజకీయ ప్రయోజనాలను వాడుకుంటుందని ఆరోపిస్తున్నారు.
‘‘ఇది కళాత్మక వ్యక్తీకరణను పరిమితం చేయడానికి, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి అధికారాన్ని దుర్వినియోగం చేయడమని స్పష్టంగా కనిపిస్తుంది’’ అని టీవీకే వ్యక్తి ఒకరు పేర్కొంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ కూటమి లెక్కలు చర్చకు కేంద్రంగా ఉన్నాయి. విజయ్ పై ఒత్తిడి తేవడం వల్ల డీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇచ్చే మైనారిటీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని, భవిష్యత్ లో ఎన్నికల్లో ఎన్డీఏకు ఇది సహాయపడుతుందని ఒక అభిప్రాయం వినిపిస్తోంది. విజయ్ ను క్లిష్ట పరిస్థితుల్లో నెట్టడం ద్వారా డీఎంకే కూటమిని బలహీనపరిచి, దాని మిత్రులకు లాభం కల్పించాలని బీజేపీ ప్రయత్నిస్తుండవచ్చు.
కూటమి ఉద్రిక్తతలు
నివేదికల ప్రకారం కాంగ్రెస్ నాయకులు టీవీకేను డీఎంకే కూటమిలోని బేరసారాల స్థానాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక మార్గంగా చూస్తున్నారు. ఎక్కువ సీట్లు, ఎక్కువ ప్రభావాన్ని సాధించాలని ఒత్తిడి చేస్తున్నారు.
ఇది డీఎంకే అసంతృప్తికి కారణమైందని, జన నాయగన్ సమస్యపై ప్రవీణ్ చక్రవర్తి, మాణిక్యం ఠాగూర్ వంటి కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీట్ల పంపకాలపై డిమాండ్లపై ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ 60 నియోజకవర్గాల వరకూ పోటీ చేయాలని కోరుతున్నట్లు రాష్ట్ర నాయకులు చేసిన ప్రకటనలపై ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీతో సహ ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకత్వంతో ఈ విషయాన్ని లేవనెత్తాలని పార్టీ పరిశీలిస్తోందని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో కరూర్ తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా, బీజేపీ అనేక ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తోంది. పొత్తుల ద్వారా విజయ్ ను దగ్గరకు చేరుకునే మార్గాలను కూడా ఇందులో ఉన్నాయి. బీజేపీ విజయ్ నేతృత్వంలోని టీవీకేను డీఎంకే సమ ఉజ్జీగా చూస్తోంది. అలాంటి పునర్ వ్యవస్థీకరణ జరిగితే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారవచ్చు. డీఎంకేను పక్కనపెట్టవచ్చు.
ఏజెన్సీ చర్యపై ప్రశ్నలు..
మైలదుత్తురై ఎంపీ సుధ మాట్లాడుతూ.. టీవీకే పొత్తులపై కాంగ్రెస్ ఎంపీలు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం కాంగ్రెస్ ఎంపీలు, కార్యకర్తలకు ఉన్న ప్రజాస్వామ్య హక్కు అన్నారు. రాజకీయ పరిస్థితులపై ఆధారంగా రాహుల్ గాంధీ తుది నిర్ణయం తీసుకుంటాడని కూడా ఆమె అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ఆర్. కే రాధాకృష్ణన్ సీబీఐ తన విచారణ నిర్వహించిన విధానాన్ని ప్రశ్నించారు. ‘‘టీవీకే అధికారులందరిని కలిసి ఎందుకు పిలిపించాలి? చెన్నైలో విజయ్ ను ఎందుకు ప్రశ్నించకూడదు. అతన్ని ఢిల్లీకి పిలిపించాల్సిన అవసరం ఏముంది?’’ అని ఆయన ప్రశ్నించారు.
దర్యాప్తు, రాజకీయ పరిణామాలు..
సీనియర్ జర్నలిస్ట్ కుపేంద్రన్ కూడా ఇదే ఆందోళనలను వ్యక్తం చేశారు. విజయ్ ఇక్కడే ఉంటే పెద్ద ఎత్తున ప్రజా సమావేశాలు జరుగుతాయనే భయంతో సీబీఐ ఢిల్లీని ఎంచుకుని ఉండవచ్చని సూచించారు.
‘‘విజయ్ ను చెన్నైలో ప్రశ్నిస్తే అక్కడ భారీ జనసమూహం ఉండవచ్చు. అందుకే వారు ఢిల్లీకి పిలిపించుకున్నారు’’ అని ఆయన అన్నారు. మరో జర్నలిస్ట్ మణి మాట్లాడుతూ.. విజయ్ శిబిరం ఇప్పుడు ఎదుర్కొంటున్న సవాళ్ల స్థాయిని ఊహించి ఉండకపోవచ్చని పేర్కొన్నారు.
‘‘పార్టీకి లేదా సినిమాకు ఎటువంటి తీవ్రమైన అడ్డంకులు ఉండవని వారు విశ్వసించారు. ఇప్పుడు వారు ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి వారు సైద్దాంతికంగా వారికి వ్యతిరేకంగా భావిస్తారు’’ అని ఆయన అన్నారు.
కరూర్ దుర్ఘటన తరువాత వేలుసామిపురంలో జరిగిన టీవీకే బహిరంగ సభ జరిగింది. అక్కడ రద్దీ జాప్యం కారణంగా తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన పలు సమావేశాల్లో టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ ఆధవ అర్జున, ఇతర పార్టీ కార్యకర్తలతో సహ 200 మందికి పైగా వ్యక్తులను సీబీఐ ప్రశ్నించింది.
కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా విజయ్ ప్రచార వాహనాన్ని కూడా సీజ్ చేసి దాని డ్రైవర్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
Read More
Next Story