
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
కర్ణాటక ముఖ్యమంత్రిని కాంగ్రెస్ మార్చబోతుందా?
అవసరమైనప్పుడూ నిర్ణయం తీసుకుంటామన్నా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్
కర్ణాటక ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సిద్ధరామయ్యను కాంగ్రెస్ పార్టీ మార్చబోవడం లేదని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. అయితే రాష్ట్ర నాయకత్వాన్ని సంబంధించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆయన చెప్పారు.
బెంగళూర్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన ‘‘ మా పార్టీలో ఏం జరగాలో నిర్ణయించే సామర్థ్యం మాకు ఉంది. దయచేసి మా నిర్ణయాలను మాకే వదిలేయండి. మీరు బాధపడకండి. ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడూ నిర్ణయం తీసుకుంటాం, ఆ సామర్థ్యం మాకు ఉంది’’ అని అన్నారు.
నాయకత్వ మార్పు ఏం లేదు..
ముఖ్యమంత్రి మార్పుపై వరుసగా వస్తున్న ఊహగానాలను ఆయన తోసిపుచ్చారు. ‘‘నేను ఇక్కడకు వచ్చినప్పుడల్లా మీకు ఒకే ఒక ఎజెండా ఉన్నట్లు ఉంది. ఈ ఐదు సంవత్సరాలు అనే ప్రశ్న మాత్రమే.. అని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలో సీఎం మార్పు గురించి నిరంతరం ఊహగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కునిగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ డీ రంగనాథ్, మాండ్య మాజీ ఎంపీ ఎల్ ఆర్ శివరామే గౌడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో మరోసారి ముఖ్యమంత్రి మార్పుపై ఊహగానాలు చెలరేగాయి.
భాగస్వామ్య ఒప్పందం..
ఈ ఏడాది చివరలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవిలో డీకే ను కూర్చుండ బెట్టే అవకాశం ఉందని రాష్ట్ర రాజకీయా వర్గాలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీసీసీ చీఫ్ గా పనిచేసిన డీకే బాగా కష్టపడ్డారు.
కానీ అప్పటి రాజకీయ సమీకరణాలతో మొదటి రెండున్న సంవత్సరాలు సిద్ధరామయ్య, చివరి రెండున్నర సంవత్సరాలు డీకే శివకుమార్ కు సీఎం పీఠంపై కూర్చునేలా ఒప్పందం కుదిరిందని అప్పట్లో వార్తలు బయటకు వచ్చాయి. అయితే వీటిని ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.
ఆర్థికంగా బలవంతుడైన డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నసమయంలో ఆదుకున్నారు. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థలు అనేక కేసులు పెట్టాయి. కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో ట్రబుల్ షూటర్ గా వ్యవహరించారు.
Next Story