కర్ణాటకలో బీజేపీ చీఫ్ విజయేంద్రపై అసమ్మతి పెరుగుతోందా?
x

కర్ణాటకలో బీజేపీ చీఫ్ విజయేంద్రపై అసమ్మతి పెరుగుతోందా?

కర్ణాటకలో బీజేపీ చీఫ్ విజయేంద్రపై అసమ్మతి పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఎక్కువ మంది పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు.


పరిస్థితులను బట్టి చూస్తే కర్ణాటకలో బీజేపీ చీఫ్ విజయేంద్రపై అసమ్మతి పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్రంలోని ఎక్కువ మంది పార్టీ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు. ఆయన తండ్రి, బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప వ్యవహరం ఒక కారణం కాగా.. అధికార పార్టీ కాంగ్రెస్‌పై అనుకున్నంత స్థాయిలో దూకుడు ప్రదర్శించలేకపోవడం మరో కారణం.

మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఫిర్యాదు అందడంతో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది.

విజయేంద్రపై తిరుగుబాటు మొదలైందా?

బెంగళూరుకు 500 కిలోమీటర్ల దూరంలోని బెలగావిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న నేతల జాబితాను పరిశీలిస్తే.. న్యూఢిల్లీలోని పార్టీ నాయకత్వం జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని కొందరు నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు సీనియర్ నేత బసనగౌడ పాటిల్ యత్నాల్ ఒక్కరే విజయేంద్ర నాయకత్వాన్ని బహిరంగంగా సవాలు చేసేవారు. తాజాగా రమేశ్ జార్కిహోళి ఆయనతో జతకట్టారు. బెలగావి సమావేశంలో అరవింద్ లింబావలి, సిద్దేశ్వర్, అన్నా సాహెబ్ జోల్లె, కుమార్ బంగారప్ప, ప్రతాప్ సింహా, GM సిద్దేశ్వరతో సహా డజను మంది నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, సస్పెండ్ అయిన కెఎస్ ఈశ్వరప్పతో సహా కొంతమంది బిజెపి నాయకులు బయటపడకుండా.. అసమ్మతివాదులకు మద్దతు ఇచ్చారని సమావేశానికి హాజరైన ఒక సీనియర్ నాయకుడు ఫెడరల్‌తో అన్నారు.

విజయేంద్రపై అసమ్మతికి కారణాలేంటి?

అక్రమ భూకేటాయింపులకు సంబంధించిన ముడా కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాత్రకు నిరసనగా రాష్ట్ర బీజేపీ నేతలు చేపట్టిన మైసూరు 'పాదయాత్ర' తర్వాత బీజేపీలో తిరుగుబాటు తీవ్రమైంది. రాష్ట్ర అధ్యక్షుడైన విజయేంద్ర తమను విస్మరిస్తున్నారని, కేవలం తన సన్నిహితులతో సంప్రదించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని బీజేపీలోని అసమ్మతి వాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయేంద్రపై వ్యతిరేకతకు కారణం ఆయన తండ్రి వ్యవహరమేనని తెలుస్తుంది. యడ్యూరప్పపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో కాంగ్రెస్ నేతలు ఆయనపై బహిరంగంగానే దాడి చేస్తుండగా..బీజేపీ అసంతృప్తవాదులు విజయేంద్రను టార్గెట్ చేసేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు.

అసంతృప్తవాదుల సమావేశం..

బీజేపీ అసంతృప్త నేతలు రెండు వారాల క్రితం బెంగళూరులోని ఎమ్మెల్యే కుమార్ బంగారప్ప నివాసంలో తొలిసారి సమావేశమయ్యారు. వాల్మీకి కార్పోరేషన్ కుంభకోణంపై పార్టీ నాయకులు యత్నాల్, జార్కిహోళి.. కూడలసంగమ నుంచి బళ్లారి వరకు ప్రత్యామ్నాయ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. యడియూరప్ప కుటుంబానికి మాజీ సన్నిహితుడు, ఇప్పుడు జనతాదళ్ (సెక్యులర్)తో ఉన్న ఎన్ఆర్ సంతోష్ కూడా విజయేంద్ర, యడియూరప్ప నిరంకుశ వైఖరి వల్ల కలిగే ఇబ్బందులను సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం విజయేంద్రను అధ్యక్ష హోదా నుంచి తప్పించాకే సెప్టెంబర్‌లో కూడల సంగమ నుంచి బళ్లారి వరకు పాదయాత్ర చేపట్టాలని బీజేపీ రెబల్స్ యోచిస్తున్నారు. అయితే విజయేంద్రను ఇబ్బంది పెట్టే ఈ నిరసనకు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు.

విజయేంద్ర అసెంబ్లీకి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని గతంలో యడియూరప్పకు సన్నిహితుడిగా ఉన్న ఎమ్మెల్యే బీపీ హరీశ్ సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీ “సర్దుబాటు రాజకీయాల” వల్లే విజయేంద్ర ఎమ్మెల్యే అయ్యాడన్నది ఆయన ఆరోపణ.

బీజేపీ బలహీనపడుతోందా?

చన్నపట్న ఉపఎన్నికకు ఎన్‌డిఎ టికెట్ నిరాకరిస్తే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని గతంలో యడ్యూరప్పతో సన్నిహితంగా ఉన్న సీపీ యోగేశ్వర్ ప్రకటించారు. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచిన యోగేశ్వర్ .. తనకు మద్దతివ్వకపోవడంతో విజయేంద్రపై ఇప్పుడు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ను బలహీనపరిచేందుకు ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ప్రయత్నాలు.. చివరకు బీజేపీనే బలహీనపరిచేలా ఉన్నారన్న చర్చ సాగుతోంది.

టార్గెట్ యడ్యూరప్ప..

ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై వచ్చిన అవినీతి ఆరోపణలకు వ్యతిరేకంగా బిజెపి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన సందర్భంలో.. పాదయాత్రను "అవినీతిపై అవినీతిపరులు చేపడుతున్న పాదయాత్ర" అని యత్నాల్ పేర్కొనడం పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చింది. విజయేంద్ర, ఆయన తండ్రి యడియూరప్ప కలిసి సిద్ధరామయ్యను గద్దె దించేందుకు చేస్తున్న "నకిలీ పోరాటమని", వాళిద్దరూ ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌తో కుమ్మక్కయ్యారని యత్నాల్ ఆరోపించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న యడియూరప్ప బీజేపీ వేదికలపైకి రాకపోవడమే మంచిదని కూడా యత్నాల్ పేర్కొన్నారు.

చీలికలతో బీజేపీ బలం తగ్గుతోందా?

మహర్షి వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం, మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో సిద్ధరామయ్య, శివకుమార్ ప్రమేయం ఉందని వారిపై బీజేపీ, జేడీ(ఎస్)లు దాడికి యత్నిస్తున్నాయి. అయితే బీజేపీ శ్రేణుల్లో చీలికలు కాంగ్రెస్ నేతలపై ఒత్తిడిని తగ్గిస్తున్నాయి. JD(S) నాయకుడు, కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి బిజెపి ముందస్తు పాదయాత్రను బహిరంగంగా వ్యతిరేకించారు. పాదయాత్రకు సంబంధించి మాండ్య-మైసూరు ప్రాంతంలోని తమ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరపలేదని ఆయన పేర్కొన్నారు. పాదయాత్రలో కాంగ్రెస్ దుశ్చర్యలను తెలిపే బ్యానర్ల స్థానంలో బిజెపి, జెడి(ఎస్) నాయకుల ఫోటోలను ప్రదర్శించడంపై పార్టీ క్యాడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Read More
Next Story