రాహుల్ గాంధీ ఓట్ చోరి ఓటర్ల ను ఆకట్టుకుంటోందా?
x

రాహుల్ గాంధీ ఓట్ చోరి ఓటర్ల ను ఆకట్టుకుంటోందా?

టాకింగ్ సెన్స్ విత్ శ్రీనిలో మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ చక్రవర్తి


విజయ్ శ్రీనివాసన్

దేశంలో అణగారిన వర్గాల ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించిందని కాంగ్రెస్ అనధికార అధ్యక్షుడు రాహుల్ గాంధీ చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. వీటిని ఎన్నికల సంఘం తోసిపుచ్చుతూ వస్తోంది. అయితే ఇది దేశ ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతపై కొత్త చర్చకు దారితీసింది.
కాంగ్రెస్ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి టాకింగ్ సెన్స్ విత్ శ్రీ ని కార్యక్రమంలో రాహుల్ వాదనలు వివరించారు. ఓటర్లను క్రమబద్దంగా అణచివేస్తున్నారని ఆరోపించారు.
ఆరు నెలలు విశ్లేషించాం..
కర్ణాటక తో పాటు ఇతర రాష్ట్రాలలో ఓటర్ల జాబితాలోని తప్పులను విశ్లేషించడానికి తన బృందం ఆరు నెలలు గడిపిందని చక్రవరి చెప్పారు. ఈ ప్రక్రియ సాధారణ జాబితాను వడపోత పోసే ప్రక్రియగా తోసిపుచ్చలేని నమూనాలను వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు.
‘‘కర్ణాటకలోని అలంద్ వంటి ప్రదేశాలలో ఎక్కువగా అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఓటర్లను తొలగించారు. ఇవి చెదురుమదురు తప్పులు కావు. అధికారుల దిద్దుబాట్లు కావు. ఇవి పేదలు, వలసదారులు, మైనారిటీలను అసమానంగా ప్రభావితం చేశాయి’’ అని ఆయన వాదించారు.
తొలగింపులపై ప్రశ్నలు..
నకిలీలు, మరణించిన ఓటర్లు లేదా ఇతర నియోజకవర్గాలకు మార్చబడిన పేర్లను తొలగించే ప్రామాణిక ప్రక్రియలో భాగంగా ఈసీ చాలాకాలంగా తొలగింపులను సమర్థిస్తోందని శ్రీనివాసన్ గుర్తుచేసుకున్నారు.
అయినప్పటికీ రాహుల్ చెప్పిన ఉదాహారణలు తొలంగింపుల స్థాయి, తరుచుగా వలస జనాభా ఎక్కువగా ఉన్న పట్టణ నియోజకవర్గాలలో లక్షల్లో ఉంటుంది. ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
‘‘తగిన ప్రక్రియ, రక్షణ చర్యలను పాటించకపోతే ఇది ఎన్నికల విశ్వసనీయతను దెబ్బతీస్తుంది’’ అని శ్రీనివాసన్ చర్చ సందర్భంగా గమనించారు.
చక్రవర్తి ఆరోపణల కేవలం స్థాయి గురించి కాదు. ఉద్దేశ్యానికి సంబంధించింది. వెరిఫికేషన్ డ్రైవ్ లు రాజకీయ సంబంధాలు కలిగిన ప్రైవేట్ ఏజెన్సీలకు అవుట్ సోర్స్ చేసినట్లు సూచించే ఆధారాలను ఆయన ఎత్తి చూపారు.
‘‘పక్షపాత ప్రయోజనాలు కలిగిన ప్రయివేట్ ఆటగాళ్లు వెరిఫికేషన్ నిర్వహించడానికి ఈసీ అనుమతించినప్పుడూ, సంస్థాగత స్వాతంత్య్రం రాజీపడుతోంది’’ అని ఆయన అన్నారు.
తొలగింపులు ఎందుకు సమస్యాత్మకం..
తొలగింపులు రాజకీయంగా తటస్థంగా లేవని ఆయన వాదించారు. ‘‘వలస కార్మికులు, మురికి వాడల నివాసితులు లేదా మైనారిటీ పరిసరాల జాబితాల నుంచి పేర్లను అసమానంగా తొలగించినప్పుడూ రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఇప్పటికే వెనకబడిన వారి ఖర్చుతో అధికార పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుంది’’ అని చక్రవర్తి అన్నారు.
తాజా ఆరోపణలను నిరాధారమైనవి, తప్పు అని ఎన్నికల సంఘం పేర్కొంది. మునుపటి సందర్భాలలో కూడా ఎన్నికల సంఘం ఇలాంటి ఫిర్యాదులను ప్రజలను తప్పుదారి పట్టించేవని ఎదురుదాడికి దిగింది.
ఓటర్ల జాబితా పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరుగుతుందని తేల్చి చెప్పింది. అయినప్పటికీ రాజకీయ ఆరోపణలు ఈసీ పై దృష్టిని కేంద్రీకరించేలా చేశాయి.
లక్షలాది ఓటర్లు, ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందినవారి ఓట్లను ఎన్నికల జాబితా నుంచి తొలగిస్తున్నారా అనే ప్రశ్నలు.. దేశ ప్రజాస్వామ్య ప్రక్రియకు సంరక్షకుడిగా ఉన్న ఎన్నికల సంఘంపై ప్రజలకు ఉన్న విశ్వాసం దెబ్బతీసే అవకాశం కనిపిస్తుందా?
శ్రీనివాసన్ ఈ అంశంపై మాట్లాడుతూ.. పార్టీలు, కమిషన్ మధ్య జరిగే ఆరోపణల గురించి కాదని, ఇది ఎన్నికల విశ్వసనీయతకు సంబంధించిందని చెప్పారు. ‘‘ఓటర్లను తొలగింపు ద్వారా ఆటస్థలం ఏకపక్షంగా మారిందని పౌరులు నమ్మడం ప్రారంభిస్తే అది ఈసీపైనే కాకుండా మొత్తం ప్రజాస్వామ్యం ప్రక్రియపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది’’ అని ఆయన హెచ్చరించారు.
Read More
Next Story