రాహుల్ ఓట్ చోరి వాస్తవమా? లేక కల్పితమా?
x
ది ఫెడరల్ చీఫ్ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్

రాహుల్ ఓట్ చోరి వాస్తవమా? లేక కల్పితమా?

ది ఫెడరల్ చీఫ్ ఎడిటర్ ఎస్. శ్రీనివాసన్ విశ్లేషణ


హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అనధికారిక అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటర్ల లో మోసం జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు.

అంతకుముందు ఆయన ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చేసేవారు. అయితే 2024 ఎన్నికల తరువాత హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించి ఎన్నికల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్నారు.

హర్యానా ఎన్నికలలో అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయని, కానీ చివరికి ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచిందని ఆయన ఆరోపించారు. హర్యానాలో దాదాపు 25 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారని, ఒకే వ్యక్తి ఫోటో 22 సార్లు ఓటర్ జాబితాలో ఉందని ఆరోపించారు.

టాకింగ్ సెన్స్ శ్రీని కార్యక్రమంలో ది ఫెడరల్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వాదనలు నిజమే అని అనుమానం వ్యక్తం చేశారు. ‘‘ఇది ఒకటి లేదా రెండు నియోజకవర్గాలకే పరిమితం కాదు’’ అని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
‘‘రాహుల్ గాంధీ మొత్తం హర్యానా ఎన్నికలను తారుమారుని సూచిస్తున్నారు. ఇలాంటివి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో కూడా ప్రభావితం చేశాయా’’ అని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితాలో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుందని, అయితే కమిషన్ విధానాల ప్రకారం.. పెద్ద ఎత్తున అవకతవలకు జరిగేందుకు ఆస్కారం ఉండదన్నారు.
‘‘ఓటర్ ఐడీ నమోదులో అనేక ప్రక్రియలు ఉంటాయి. రాహుల్ ఆరోపించేది కేంద్రీకృత ఆటోమేటేడ్ వ్యవస్థ ఓటర్ రికార్డులను తారుమారు చేస్తుంది’’ అని అన్నారు.
ఈసీ స్పందన ముఖ్యమైనది..
ఓటర్ల అవకతవలకపై ఎందుకు ముందుగా రాహుల్ గాంధీ ప్రశ్నించలేదని ఎన్నికల కమిషన్ ప్రశ్నించింది. రాహుల్ గాంధీని అధికారికంగా ఓ ఫిర్యాదు, అఫిడవిట్ ను ఇవ్వమని కోరింది.కానీ ఆయన ఇంత వరకూ ఆ పని చేయలేదు.
ఈసీకి వీటిపై దర్యాప్తు చేయడానికి అధికారం ఉంది. ‘‘స్వేచ్ఛగా, నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడటం వారి ఆదేశం, వారు దర్యాప్తు చేయవచ్చు. కానీ ప్రస్తుత విధానం అడ్డంకిగా ఉంది’’ అని ఆయన అన్నారు.
బీహార్ ఎన్నికల ముందు గాంధీ వాదనలపై గురించి కూడా ఆయన విశ్లేషించారు. ‘‘ఇది ఒక సంక్షిష్ట మిశ్రమం. రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ముందు సమస్యలను పెంచడం సర్వసాధారణం. కానీ ఆయన(రాహుల్) ఎత్తి చూపిన అవకతవకలను కూడా పరిగణలోకి తీసుకోవాలి’’ అని శ్రీని అభిప్రాయం వ్యక్తం చేశారు.
విస్తృత ప్రభావాలు..
ఓటర్ల జాబితా దిద్దుబాట్లు, తొలగింపులు గట్టిపోటీ ఉన్న నియోజకవర్గాలలో ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఉదాహారణకు బీహార్ లో ఇటీవల సమీక్షలో 47 లక్షల మంది ఓటర్లను తొలగించారు. అంటే ఒక్కో అసెంబ్లీ స్థానానికి దాదాపుగా 19 వేల మంది.
రాహుల్ గాంధీ ఈ విషయాన్ని చట్టపరంగా కాక, రాజకీయంగా పోరాడాలని అనుకుంటున్నారు. ఎన్నికల సంఘం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సర్ ను ప్రారంభించబోతోంది. దీనితో ప్రతిపక్ష పార్టీలు రాబోయే ఎన్నికలకు ముందు ఓటర్ల నమోదు పరిశీలన ముమ్మరం చేస్తున్నాయి. ‘‘రాహుల్ గాంధీ ఈ ఊపును కొనసాగించగలరా? దీనిని ముందుకు తీసుకెళ్తారా? అనేది ముందు ముందు తెలుస్తుంది’’ అని శ్రీనివాసన్ అభిప్రాయపడ్డారు.
Read More
Next Story