
తమిళనాడు వారసత్వాన్ని స్టాలిన్ కొనసాగించబోతున్నారా?
చెన్నై కేంద్రంగా నేడు వివిధ పార్టీల నేతలతో సమావేశం
మహాలింగం పొన్నుస్వామి
లోక్ సభ నియోజవర్గాల పునర్ వ్యవస్థీకరణను వ్యతిరేకిస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన నిర్వహించనున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశాలకు చెన్నై నగరం సమాయాత్తం అయింది.
స్టాలిన్ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన ఉన్న పంజాబ్ సర్కార్ కు, తూర్పున ఉన్న ఒడిశా నాయకులకు సైతం ఆహ్వానం పంపారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయత్నాలను రాజకీయ విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు.
తమిళనాడును దాటిన..
ప్రస్తుతం కేంద్రంతో కొన్ని అంశాలపై స్టాలిన్ ప్రభుత్వానికి పొసగడం లేదు. ముఖ్యంగా త్రిభాషా విధానం, తమకు సరిగా నిధులు విడుదల చేయడం లేదంటూ ఆ పార్టీ నాయకులు, నేతలు వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో నిజమైన సమాఖ్యవాదం తీసుకురావాలని డీఎంకే వాంఛ. రాష్ట్ర స్వయంప్రతిపత్తి, ద్రవిడవాదం గుర్తింపు కోసం డీఎంకే ఇంతకుముందు నిర్వహించిన కార్యక్రమాలకు భిన్నంగా ఈ సమావేశం కనిపిస్తోంది.
ఇది కేవలం ఎన్నికల ప్రయోజనం కోసం ఒక వ్యూహం రూపొందించడం కాదు.. కేంద్రం విధానాల వల్ల ఎదురయ్యే ముప్పుకు సమష్టిగా ఎదుర్కొనే బలాన్ని పుంజుకోవడంలాంటిది.
సౌత్ లో సంకీర్ణం సాధ్యమేనా..
1970 వ దశకంలో జరిగిన రాజ్యాంగ సవరణ, ఆ తరువాత వాజ్ పేయ్ హాయాంలో తీసుకొచ్చిన మరో సవరణ ప్రకారం.. దేశంలో లోక్ సభ నియోజకవర్గాలను 2026 జనాభా లెక్కల ప్రకారం మాత్రమే పెంచాలి.
కానీ ఈ డీలిమిటేషన్ జనాభా ఆధారంగా చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆందోళనలు ఉన్నాయి. ప్రస్తుతం సమావేశంలో సమానమైన ‘సమాఖ్య ప్రాతినిధ్యం’కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు ఇవన్నీ స్టాలిన్ ఏర్పాటు చేసిన జేఏసీ దార్శనికతపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం స్టాలిన్ ఈ కూటమిలో పంజాబ్ తో పాటు ఒడిశా రాష్ట్రాలను ఆయన ఈ సంకీర్ణంలో కలిపేశారు. ఈ చర్యతో ఇది జాతీయ స్థాయి అంశంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రులకు పంపిన లేఖలు, సీనియర్ డీఎంకే నాయకులు జారీ చేసిన వ్యక్తిగత ఆహ్వానాలు అతని చురుకైన దౌత్యాన్ని హైలైట్ చేశాయి.
ప్రతిపక్షాలను ఏకం చేయడంలో..
డీలిమిటేషన్ అంశంపై స్టాలిన్ చేస్తున్న ప్రయత్నాలు జాతీయస్థాయిలో మెల్లగా ప్రభావం చూపడం ప్రారంభం అయింది. డీలిమిటేషన్ సమాఖ్యవాదంపై దాడిగా ఆయన అభివర్ణిస్తూ చేసిన ప్రసంగాలు, క్రియాశీలత్వం, ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ ప్రయోజనం అని వివరించి చెప్పడంతో అనేక మంది ప్రాంతీయ నాయకులను చెన్నై వైపు చూసేలా చేసింది.
కేరళ సీఎం పినరయి విజయన్ తో మొదలు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వరకు వివిధ నాయకులను ఏకం చేయగల సామర్థ్యం అజెండాను ప్రభావితం చేసింది. 2026 జనాభా లెక్కలకు బదులుగా 1971 లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ ను కొనసాగించాలనే ఆయన వాదనలపై చర్చ మొదలైందని చెప్పవచ్చు.
ఈ వ్యూహాలు జేఏసీ గొంతును బలంగా ప్రజల ముందుకు తీసుకెళ్లడంతో పాటు, అనైక్యంగా ఉన్న ప్రతిపక్షంలో స్టాలిన్ ఒక సంఘటిత శక్తిగా మారే అవకాశం కనిపిస్తోంది.
డీఎంకే వారసత్వం..
దేశంలో సమాఖ్య వ్యవస్థలోని లోపాలపై చాలాకాలంగా డీఎంకే పోరాడుతోంది. దానికి ఈ విషయంలో చాలా అనుభవం సంపాదించింది. 1960 అన్నాదురై హిందీ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. తరువాత వచ్చిన కరుణానిధి ఈ వారసత్వాన్ని కొనసాగించారు. వీటి ద్వారానే రాష్ట్రం తన హక్కులను కాపాడుకుంది.
1988 సెప్టెంబర్ 18న కరుణానిధి చెన్నైలో ఏడు పార్టీలతో కూడిన నేషనల్ ఫ్రంట్ ను అధికారికంగా ప్రారంభించినప్పుడూ ఒక కీలకమైన సంఘటన జరిగింది. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి ఎన్డీ రామారావు అప్పటి జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్, జనమోర్చాకు చెందిన వీపీసింగ్ వంటి విభిన్న నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ ఆధిపత్యాన్నిసవాల్ చేశారు.
చెన్నైలోని మెరీనా బీచ్ లో జరిగిన ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. దీనికి అనుగుణంగా తరువాత బంద్ కు పిలుపునిచ్చారు. ఇది ప్రాంతీయ ప్రభావాన్ని జాతీయ స్థాయిలతో తీసుకెళ్లగల సామర్థ్యం తనకుందని డీఎంకే నిరూపించుకున్నట్లు అయింది.
సంకీర్ణాల చరిత్ర తమిళనాడుదే..
దేశంలో సంకీర్ణాలను నిర్మించిన చరిత్రలో తమిళనాడు ది కీలకపాత్ర. మాజీ ముఖ్యమంత్రి జే. జయలలిత జూన్ 18, 2007 లో చెన్నైలో థర్డ్ ఫ్రంట్ నాయకులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా తిరిగి ఎన్నిక కావడానికి మద్దతు కూడగట్టే లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అన్నాడీఎంకే అధినేత కాంగ్రెస్, బీజేపీకి సంబంధం లేని ప్రముఖ వ్యక్తులను ఆహ్వానించారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి ములాయం, టీడీపీ నుంచి చంద్రబాబునాయుడు, ఐఎన్ఎల్డీ నుంచి ఓం ప్రకాశ్ చౌతాలా వంటి వారు చెన్నైలోని పోయేస్ గార్డెన్ కు వచ్చారు.
ఈ నాయకులు దాదాపు రెండు గంటలపాటు చర్చించుకున్నారు. అప్పట్లో ప్రతిభా పాటిల్ అభ్యర్థిత్వాన్ని వీరు వ్యతిరేకించారు. యూపీఏ మరోసారి కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టాలని కోరారు.
ఈ సమావేశం తన లక్ష్యాన్ని చేరుకోనప్పటికీ ప్రతిపక్షాల ఐక్యతలో చెన్నై ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. ఇప్పుడు స్టాలిన్ ఒక జేఏసీని ఏర్పాటు చేయడం ద్వారా మరో అడుగు ముందుకు వేశారు.
కింగ్ మేకర్ గా కరుణానిధి..
1996 లో మే నెలలో హెచ్ డీ దేవేగౌడ ప్రధానమంత్రి పదవిని అధిష్టించారు.దీని వెనక తమిళ నాయకులు జికే మూపనార్, కరుణానిధి కీలక పాత్ర పోషించారు. ఆ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పీవీ నరసింహరావు నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది.
తరువాత ప్రాంతీయ పార్టీలతో కూడిన యునైటేడ్ ఫ్రంట్ అని పిలువబడే ప్రాంతీయ, వామపక్షాల పార్టీల సంకీర్ణానికి మద్దతు ఇచ్చింది.
అప్పటి డీఎంకే నాయకుడైన కరుణానిధి, ఇటీవల కాంగ్రెస్ నుంచి విడిపోయిన తమిళ మానిల కాంగ్రెస్ ని స్ఠాపించిన మూపనార్ ఈ కూటమి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించిన డీఎంకే- టీఎంసీ సంకీర్ణం, యునైటెడ్ ఫ్రంట్ కు అవసరమైన పార్లమెంటరీ మద్దతును 39 ఎంపీలకు అందించింది.
ఇది జ్యోతి బసు వంటి నేతలను సైడ్ చేయడానికి ఉపయోగపడింది. తరువాత ఈ ఇద్దరు నాయకులు తమ ప్రయత్నాలను కొనసాగించారు. డీఎంకే నాయకత్వం సమాఖ్యవాదంపై తన దృష్టిని కేంద్రీకరించగా, మూపనార్ తెరవెనక ప్రయత్నాలపై దృష్టిసారించారు.
స్టాలిన్ జేఏసీ భిన్నంగా ఉందా?
స్టాలిన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ చారిత్రక చొరవల నుంచి నిష్రమణను సూచిస్తుంది. సీనియర్ జర్నలిస్ట్ టీ రామకృష్ణన్ వ్యత్యాసాన్ని హైలెట్ చేశారు. ‘‘గతంలో చాలా సమావేశాలు అధికార కూటములను ఏర్పరచడంపై దృష్టి సారించాయి. ఈసారి ఇది కేంద్ర చొరవకు ప్రతిఘటనను సూచిస్తుంది’’.
సమాఖ్య వ్యవహారాలలో డీఎంకే సత్తా స్పష్టంగా ఉంది. చెన్నైలో బీజేపీయేతర నాయకులను ఏకం చేయడానికి స్టాలిన్ ఇటీవల చేసిన ప్రయత్నాలు ఈ వారసత్వాన్ని బలోపేతం చేస్తున్నాయి.
అయినప్పటికీ డీలిమిటేషన్ అంశం తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా డీఎంకే కథనాన్ని పెంచినప్పటికీ, కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తున్న పార్టీ ఏకాభిప్రాయం విస్తృతంగా ఉన్నందున దాని ఎన్నికల ప్రభావం అనిశ్చితంగానే ఉందని రామకృష్ణన్ చెబుతున్న మాట.
Next Story