
జననాయగన్ సినిమాలో విజయ్
‘జననాయగన్’ సినిమా డీఎంకే లక్ష్యంగా తీశారా?
‘‘నేను వస్తున్నాను. మీ చాఫ్టర్ క్లోజ్ చేస్తాను’’ అనే డైలాగ్ లు ఎవరిని ఉద్దేశించినవి?
కోలీవుడ్ స్టార్, టీవీకే అధినేత, దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా ట్రైలర్ జనవరి 3న విడుదలైంది. ఇందులో హై ఓల్టేజ్ యాక్షన్ కు తోడుగా, రాజకీయాలపై పదునైన విమర్శలు ఉన్నాయి.
విజయ్ స్థాపించిన టీవీకే ఈ ఏడాది జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తోంది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, కేవీఎన్ ప్రొడక్షన్ పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.
‘జన నాయగన్’ తన చివరి సినిమా అని విజయ్ ఇప్పటికే ప్రకటించాడు. తరువాత పూర్తిగా రాజకీయాలు సిద్ధమవుతానని ఆయన ఈ సినిమా ఆడియో లాంఛ్ సందర్భంగా ప్రకటించారు.
ఈ ట్రైలర్ వినోదం కంటే టీవీకే మ్యానిఫెస్టో అనే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది. రెండు నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ లో అనేక హత్యలతో కూడిన కిల్లర్ గురించి తెలిసిన ఫోన్ కాల్ తో ప్రారంభం అవుతుంది. ఇది విజయ్ పాత్ర ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది పరోక్షంగా ఆయన పార్టీ పేరు ఉండేలా తీర్చిదిద్దారు.
అవినీతి వ్యతిరేక వైఖరి..
విజయ్ ఒక్కడే బెటాలియన్లను కూల్చివేయడం వంటి భారీ యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఈ పుటేజ్ కుటుంబ రాజకీయాలు, జాతీయవాద భావాలతో ఉంది. ఒక యువతి పులిలా పతనమవుతున్న తరుణంలో ఓ వ్యక్తి వచ్చి దాన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఇది దేశం పతనం అంచున ఉంటే.. విజయ్ వచ్చి ఉద్దరిస్తాడనే నేపథ్యంగా ఉంది.
‘‘నేను సాధారణ మనిషిని, కానీ నేను ఏం చేసినా అది సూపర్’’ అని విజయ్ పలికే డైలాగ్ వినిపిస్తుంది. ‘‘నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి ప్రవేశించే బదులు, మీరు అమాయకుల జీవితాలను దోచుకోవడానికి, చంపడానికి రాజకీయాల్లోకి వస్తారు. దుండగులందరితో చేయి కలిపారు. వారు గెలవకూడదు’’ అనేవి మరికొన్ని డైలాగ్ లు.
టీవీకే జెండాలోని జంట ఏనుగులు, వాగై పువ్వుకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. రీలో హీరోయిజాన్ని వాస్తవ ప్రపంచంతో అనుసంధానం చేస్తూ సింబాలిక్ అనేక డైలాగ్ లు, సీన్ లు ఈ సినిమాలో ఉండే అవకాశాలు ఫుష్కలంగా కనిపిస్తున్నాయి.
ట్రైలర్ లో రావణుడు, యముడు వంటి పురాణ పాత్రల ప్రస్తావన, విజయ్ పాత్ర చెడుతో పోరాడుతున్న వ్యక్తిగా చూపించే ప్రయత్నం జరిగినట్లు కనిపిస్తోంది. అభిమానులు, విమర్శలకు దీనిని అవినీతి వ్యతిరేక వైఖరికి అనుగుణంగా పార్టీలపై చేసిన విమర్శలుగా చూస్తారు.
నేను మీ అధ్యాయాన్ని మూసివేస్తాను..
జననాయగన్ సినిమాలో ముఖ్యమైన డైలాగ్ ఒకటి ఉంది. అదే ‘‘నేను మీ చాప్టర్ ను మూసివేస్తాను. ఇలాంటి బెదిరింపులు ఎవరూ చేసినా నేను మిమ్మల్ని అవమానిస్తాను. నాకు వెనక్కి వెళ్లే ఉద్దేశం లేదు. నేను వస్తున్నాను’’ అనే డైలాగ్ విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన సందర్భానికి అనుగుణంగా ఉంది.
తన అభిమానులకు తన అజేయయమైన సంకల్పం, భరోసా ఇస్తూనే, తీవ్రమైన ఒత్తిడి, బెదిరింపులు తన ప్రయాణాన్ని ముందుకు సాగకుండా ఆపలేవని అతని రాజకీయ ప్రత్యర్థులకు చేసిన హెచ్చరికలా కనిపిస్తోంది.
విజయ్ రాజకీయా అంశాలతో సినిమా తీయడం ఇదే మొదటిసారి కాదు. సర్కార్(2018) వంటి సినిమాల ఇతివృత్తం ఇదే. అతనికి రాజకీయా ఆసక్తులు ఉన్నాయని ఇంతకుముందే సూచించాయి.
ఇప్పుడు టీవీకే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుండగా, రాజకీయ యాక్షన్ డ్రామాగా జననాయగన్ ను తీర్చిదిద్దినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ పాత్ర అధికారం చేపట్టిన తరువాత ఆదర్శాలు, ప్రమాదాలు, సమాజ అంచనాలు ఇవన్నీ ఇందులో వివరించారు.
ఇటీవల మలేషియాలో జరిగిన ఆడియో లాంచ్ లో రాజకీయ చిహ్నాల కారణంగా టీవీకే నినాదాలు ఆపమని ఆయన అభిమానులకు సంజ్ఞ చేశాడు. ఇది అతని నిజ జీవిత పాత్రతో సినిమా ఉంటుందనే పుకార్లకు ఆజ్యం పోసింది.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకిని ఎదుర్కొంటోంది. కొన్ని ప్రదర్శనల తరువాత దీనికి యూఏ సర్టిఫికెట్ సిఫార్సు చేసినప్పటికీ, అధికారిక సర్టిఫికెట్ మాత్రం పెండింగ్ లో ఉంది. ఈ సినిమాకు ఏదైన బాహ్య ఒత్తిడులు ఎదుర్కొంటుందా? అనే ప్రశ్నలను ముందుకు తెస్తుంది.
టీవీకే జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం విజయ్ కు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమదే విజయం అని చెప్పారు.
‘‘అభిమానుల నుంచి వచ్చిన సమాధానాలు డీఎంకే, బీజేపీ వంటి ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేశాయని, ఆలస్యాన్ని రాజకీయంగా ఒక ఘర్షణగా మారుస్తున్నారు’’ అని ఆరోపించారు.
జననాయగన్ వర్సెస్ పరాశక్తి
జననాయగన్ సినిమా శివకార్తికేయన్ పరాశక్తి సినిమా మధ్య పోటీ ఉండబోతోంది. సుధ కొంగర ఈ సినిమా కు దర్శకత్వం వహించారు. ఇది 1980 ల నాటి హిందీ వ్యతిరేక నిరసనల ఇతివృత్తంగా ఉండబోతోంది.
ఇది డీఎంకే అధికారంలోకి రావడాన్ని వ్యతిరేకించింది. ఇది అధికార పార్టీ భావజాలానికి దగ్గరగా ఉందని భావిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14న విడుల కావాల్సి ఉండగా, ఉద్దేశపూర్వకంగా జనవరి 9 కి విడుదల మార్చుకుందని పుకార్లు ఉన్నాయి. ఇది బాక్సాపీస్ 2026 ఎన్నికలకు నాందిగా మారనుంది.
విశ్లేషకులు ఈ రెండు సినిమాలను తెరపై డీఎంకే వర్సెస్ టీవీకే గా చూస్తున్నాయి. పరాశక్తి 1952 లో శివాజీ గణేషన్ నటించిన క్లాసిక్ వారసత్వాన్ని డీఎంకే ప్రచార మైలురాయిని గుర్తు చేసింది. నిర్మాత ఆకాశ్ భాస్కరణ్ ఈ ప్రచారాలను తోసిపుచ్చారు. టీవీకేకు, శివకార్తికేయన్ కు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని చెప్పారు.
సంక్రాంతి సమీపిస్తున్న సందర్భంగా తమిళ సినిమా థియేటర్లు సినిమా స్టెమినా కంటే ఎక్కువగా రాజకీయాలను ఎక్కువగా చూడవచ్చు. జన నాయగన్ ట్రైలర్ రాజకీయ వేడితో రాజేసిందని మాత్రం చెప్పవచ్చు. విజయ్ సినిమాలకు వీడ్కోలు చెప్పడం రాజకీయాల్లోకి రావడం సాహసోపేతమైన నిర్ణయం కావచ్చు. ఇది ఓట్లుగా మారుతుందో లేదో చూడాలి.
Next Story

