జననాయగన్: వాయిదాతో నిర్మాతకు రూ. 20 కోట్ల నష్టం
x
కథానాయకుడు విజయ్

జననాయగన్: వాయిదాతో నిర్మాతకు రూ. 20 కోట్ల నష్టం

ఓ వర్గాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటున్న సీబీఎఫ్సీ


కిరుబాకరన్ పురుషోత్తమన్

దళపతి, టీవీకే(TVK) అధినేత విజయ్(Vijay) నటించిన చివరి చిత్రం జననాయగన్(Jana Nayagan) జనవరి 9 న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే సినిమా సర్టిఫికేషన్ రావడంలో ఆలస్యం కావడంతో విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది.

సీబీఎఫ్సీ(CBFC) ఫిల్మ్ సర్టిఫికేషన్ వెంటనే చేయాలని కోరుతూ నిర్మాతల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తీర్పు రిజర్వ్ కావడంతో సినిమా విడుదలపై అనిశ్చితి నెలకొంది. రేపు తీర్పు వస్తుందని తెలియడంతో నిర్మాతలు సినిమా విడుదల నిలిచిపోయిందని అధికారికంగా ప్రకటించారు.

పిటిషన్ దేని గురించి..
‘జన నాయగన్’ సినిమా విడుదలకు ముందే సమర్పించినప్పటికీ దానికి సీబీఎఫ్సీ సర్టిఫికెట్ రాకపోవడంతో వివాదం కోర్టు మెట్లెక్కింది. నిర్మాతలు డిసెంబర్ 18 నే సర్టిఫికేషన్ కోసం సమర్పించారు.
అంటే విడుదలకు చాలారోజుల ముందే అధికారులు చిత్రాన్ని వీక్షించారు. అయితే యూఏ సర్టిఫికెట్ రావాలంటే కోతలు ఉంటాయని సూచించినట్లు సమాచారం.
అందుకు అనుగుణంగా డిసెంబర్ 24న హింసతో కూడిన దృశ్యాలను తొలగించి మరోసారి సమర్ఫించారు. ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ ఇస్తామని సీబీఎఫ్సీ చెప్పినట్లు నిర్మాతలు తెలిపారు. అయిత. అయితే జనవరి 5న సినిమాను సమీక్ష కమిటీకి సమర్ఫిస్తున్నట్లు సీబీఎఫ్సీ తెలియజేసింది.
క్లియరెన్స్ ఎందుకు రావట్లేదు..
విచారణ సందర్భంగా సర్టిఫికేషన్ ఆలస్యం కావడానికి కారణాలు తెలియజేయాలని హైకోర్టు కోరింది. ఫిర్యాదులు, క్లియరెన్స్ నిలిపివేయబడిన విషయాలను రికార్డులో పేర్కోనాలని సీబీఎఫ్సీని ఆదేశించింది.
ఈ చిత్రం మతపరమైన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని సీబీఎఫ్సీ పేర్కొంది. అది కూడా ఎలాంటిదో ప్రత్యేకంగా పేర్కొనాలని సూచించింది. విడుదల తేదీని ప్రకటించినందున వారికి అనుగుణంగా సీబీఎఫ్సీ బోర్డు నిర్ణయం తీసుకోదని, బోర్డు నిర్ణయాలకు అనుగుణంగా ఉండాలని దాని తరఫున లాయర్లు వాదించారు.
దీనితో కోర్టు తీర్పును జనవరి 9 కి వాయిదా వేసింది. అదే రోజు సినిమా విడుదల కూడా కావడంతో నిర్మాతలు వాయిదా వేయక తప్పింది కాదు. దేశంలో ఏదైన చిత్రం ప్రదర్శితం అవ్వాలంటే కచ్చితంగా సీబీఎఫ్సీ సర్టిఫికెట్ ఉండాల్సిందే. లేకపోతే భారత్ లో సినిమా విడుదల చేయలేము.
భారీ నష్టాలు ఖాయం..
చిత్రం ఆలస్యంగా విడుదల అయితే నిర్మాతలకు దాదాపుగా రూ. 20 కోట్ల నష్టం వాటిల్లుతుందని ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాలా అంచనా వేశాడు. ‘‘సినిమా జనవరి 9న విడుదల కావట్లేదు. కాబట్టి రూ. 20 కోట్ల నష్టం జరుగుతుంది’’ అని బాలా అన్నారు.
సినిమాకు ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్ పూర్తయిందని, ఇప్పుడు ఆ షోలన్నీ రద్దు చేస్తారని, దానికి తోడు తమిళం, తెలుగు ఇతర సినిమాలు తమ స్లాట్ ను బుక్ చేసుకున్నందున ఈ సినిమాకు వచ్చే స్క్రీన్ ల సంఖ్య తగ్గిపోతుందని అన్నారు. దీనివల్ల నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు.
Read More
Next Story