జిల్లా పేరును మార్చబోతున్న సర్కార్.. మండిపడుతున్న విపక్షాలు
x

జిల్లా పేరును మార్చబోతున్న సర్కార్.. మండిపడుతున్న విపక్షాలు

కర్నాటక సర్కార్ ప్రస్తుతం ఉనికిలో ఉన్న ‘రామనగర’ జిల్లా పేరును మార్చడానికి సిద్ధం అవుతోంది. కొత్త జిల్లాకు పేరును కూడా సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు.


కర్నాటకలో బీజేపీ- జేడీ(ఎస్) హయాంలో ఏర్పాటు చేసిన రామనగర జిల్లా పేరును మార్చడానికి సిద్ధరామయ్య సర్కార్ ఓకే చెప్పింది. శుక్రవారం (జులై 26) ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చాలని నిర్ణయించుకున్నామని... అక్కడి ప్రజల డిమాండ్‌ మేరకు రెవెన్యూ శాఖ ఈ ప్రక్రియను ప్రారంభిస్తుందని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా పేరు మాత్రమే మారుతుందని, మిగిలినవన్నీ అలాగే ఉంటాయన్నారు.
తాజా నిర్ణయం
రామనగర, మాగాడి, కనకపుర, చన్నపట్న, హారోహళ్లి తాలూకాలతో కూడిన ఉన్న రామనగర జిల్లా పేరును 'బెంగళూరు సౌత్'గా మార్చాలనే ప్రతిపాదన ఇటీవల తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించింది. అయితే రామనగర జిల్లా పేరును మార్చడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీ, జేడీఎస్ లు దుయ్యబట్టాయి.
బిజెపి నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక మాట్లాడుతూ.. "రామనగరలో "రామ" అనే పేరును వారు (కాంగ్రెస్) ద్వేషిస్తున్నట్లు కనిపిస్తోంది, ఈ ప్రతిపాదనను చేపట్టడానికి వారిని రాముడి పేరే ప్రేరేపించింది. వారి అసలు ఉద్దేశాలు ఈ పేరు మార్పుతో స్పష్టమైంది"
రియల్ ఎస్టేట్ లింక్?
జిల్లాను బెంగళూరుకు అనుసంధానం చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ విలువ పరంగా రాష్ట్ర ప్రభుత్వం బహుశా ఈ చర్యను పరిశీలిస్తోందని అశోక అన్నారు. 'బ్రాండ్ బెంగళూరు' పేరుతో బెంగళూరు ప్రజలను ఇప్పటికే మోసం చేశారని, ఇప్పుడు రామనగర పేరు మార్చడంతో ఆ జిల్లా ప్రజలను కూడా మోసం చేస్తున్నారని అన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి కాంగ్రెస్‌ పార్టీ రెండు పార్టీలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందని ఆయన అన్నారు.
"ముడా (మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ)" ద్వారా భూమిని లాక్కొన్న తర్వాత, వారు "రామనగర జిల్లా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు" అని ఆయన విమర్శించారు.
'అన్ని రాజకీయాలు'
రామనగరను కాంగ్రెస్‌ నిర్లక్ష్యం చేసిందని బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సీఎన్‌ అశ్వత్‌ నారాయణ్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రాతినిథ్యం కోసమే జిల్లాను ఉపయోగించుకున్నారు తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే జిల్లా పేరు మార్చాలని చూస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జేడీఎస్ యూత్ అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను నీచ స్థాయికి తీసుకెళ్లిందని ఆరోపించారు. " ఈ పేరు దానికి సూటైంది. కానీ ఎందుకు పేరు మారుస్తున్నారు. కొన్ని వర్గాలను మభ్య పెట్టేందుకు ఏదో రహస్య ఎజెండాను అమలు చేస్తున్నారు.’’ అని పేర్కొన్నారు.
ఆగస్ట్ 2007లో రామనగర జిల్లా ఏర్పాటైనప్పుడు JD(S)-BJP సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేంద్ర మంత్రి హెచ్‌డి కుమారస్వామి ఈ విషయం గురించి ప్రత్యేకంగా వాగ్దానం చేశారు. అశోక్ లాగే కుమారస్వామి కూడా దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ‘రియల్ ఎస్టేట్ ఎత్తుగడ’ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పేరు మారుస్తామని చెప్పారు.
దీనికి సిద్ధరామయ్య బదులిస్తూ.. "పేరు మార్చడానికి లేదా తొలగించడానికి బిజెపి మళ్లీ అధికారంలోకి రాదు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు; వారు అధికారంలోకి వస్తారని వారు చెప్పలేరు. హెచ్‌డి కుమారస్వామి లేదా బిజెపి ప్రజల ఆశీస్సులు పొందారా? " అని వ్యాఖ్యానించారు.
'భవిష్యత్తు అభివృద్ధి'
మంగళవారం ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ భవిష్యత్‌ అభివృద్ధి కోసం రామనగర జిల్లాకు బెంగళూరు సౌత్‌గా పేరు మార్చాలని జిల్లా నేతలు ప్రతిపాదించారు. ఈ ప్రాంతం మొదట బెంగళూరు జిల్లాకు చెందినదని, తరువాత పరిపాలనా ప్రయోజనాల కోసం బెంగళూరు సిటీ, బెంగళూరు రూరల్, రామనగరగా విభజించబడిందని ఆయన సూచించారు.
Read More
Next Story