‘మిస్టర్ నరేంద్ర మోదీ’ అంటూ కర్ణాటక సీఎం విమర్శలు..
x

‘మిస్టర్ నరేంద్ర మోదీ’ అంటూ కర్ణాటక సీఎం విమర్శలు..

కాంగ్రెస్ రాష్ట్రాల యూనిట్లు బడ్జెట్ చూసుకుని హామీలు ఇవ్వాలని ఖర్గే సూచనలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు.


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పై విమర్శలు చేసే ముందు సొంతపార్టీ నాయకత్వ శైలిని సైతం పరిశీలించాలని చురకలంటిచారు. బీజేపీ కర్ణాటక యూనిట్ చేస్తున్న వినాశకరమైన వారసత్వన్ని కూడా చూడాలని అన్నారు.

పార్టీ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఎన్నికల హమీలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పై వ్యాఖ్యలు చేసిన తరువాత బీజేపీ- కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇందులో ప్రస్తుతం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జాయిన్ అయ్యారు.
"మిస్టర్ @నరేంద్రమోదీ, కాంగ్రెస్‌పై వేళ్లు చూపించే ముందు, కర్ణాటకలో @BJP4Karnataka చేస్తున్న విధ్వంసకర వారసత్వాన్ని గట్టిగా పరిశీలించండి! ప్రజలకు ఇచ్చిన ఐదు హమీల కోసం మేము రూ. 52 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. అదనంగా మరో 52,903 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. కర్ణాటక భవిష్యత్ ను భద్రంగా నిర్మించబోతున్నాం’’ అని సిద్ధరామయ్య ‘ఎక్స్‌’పై ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. 40 శాతం కమీషన్ అవినీతితో కర్నాటకను బీజేపీ వదిలేసిందని, జీవితాలను మార్చగలిగే వనరులను హరించుకుపోయిందని ఆరోపించారు.
" మేము అదే 40 శాతాన్ని ఉపయోగించుకుంటున్నాము కాకపోతే ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి దాన్ని దారి మళ్లిస్తున్నాము. ఇక్కడ మీరు సాధించిన 'విజయం' ఏమిటి? అవినీతి చర్యలకు అధికారం ఇవ్వడం, కర్ణాటక అప్పుల ఊబిలో కూరుకుపోవడం, మీ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ప్రచారాన్ని ఉపయోగించడం?" అని ముఖ్యమంత్రి విమర్శలు గుప్పించారు. మోదీ పాలనను సైతం అవినీతి కప్పివేసిందని అన్నారు.
"మనం ఓ సంఘటన మరచిపోకూడదు. మీ పర్యవేక్షణలో, భారత్ రుణం FY25 నాటికి రూ. 185.27 ట్రిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది'" GDPలో ఇది 56.8 % చేరుకుంటుంది. ఇది చెడ్డ పాలన మాత్రమే కాదు. ఇది ప్రతి భారతీయుడిపై మీరు మోపుతున్న భారం’’ అని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
కేంద్ర ఖజానాకు కర్నాటక గణనీయమైన సహకారం అందించగా, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హామీ పథకాలను అమలు చేయకుండా రాష్ట్రానికి సరైన నిధులు అందకుండా అడ్డుకుంటోందని విమర్శలు చేశారు. కర్ణాటక ఇచ్చే ప్రతి రూపాయికి కేవలం 13 పైసలు మాత్రమే తిరిగి ఇస్తోంది. ఇది 'సహకార సమాఖ్య' కాదు; ఇది పూర్తిగా దోపిడీ అని ముఖ్యమంత్రి ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్‌ అధికారం చేజిక్కించుకోగా, దేశవ్యాప్తంగా భారతీయులపై బీజేపీ విఫల పాలన చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఎన్నికల్లో హమీలు ఇచ్చేముందు ఆర్థిక పరిమితులు ఆలోచించాలని సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లకు ఖర్గే గురువారం హితబోధ చేశారు. "ఐదు, ఆరు, 10, 20 అని హామీలు చెప్పకుండా.. మీ రాష్ట్ర బడ్జెట్ ప్రకారం హామీలు ఇవ్వండి. మీ బడ్జెట్ కు మించి హామీలు ఇస్తే దివాళా తీస్తారు. రోడ్డుకు మట్టి కూడా దొరకదు." "ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు, ఈ ప్రభుత్వం విఫలమైతే, తరువాతి తరానికి ఏమీ ఉండదు, మీకు చెడ్డ పేరు వస్తుంది" అని చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్లు సరైన బడ్జెట్‌తో వాగ్దానాలు చేయాలని ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మోదీ ప్రతిస్పందిస్తూ ప్రతిపక్ష పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
" అవాస్తవ వాగ్దానాలు చేయడం చాలా సులభం, కానీ వాటిని సరిగ్గా అమలు చేయడం కఠినమైనది లేదా అసాధ్యం అనే కఠినమైన మార్గాన్ని కాంగ్రెస్ గ్రహించింది. ప్రచారం తర్వాత వారు ప్రజలకు వాగ్దానం చేస్తారు, వారు ఎప్పటికీ అమలు చేయలేరు అని కూడా తెలుసు. ఇప్పుడు, వారు నిజాన్ని గ్రహిస్తున్నారు. ఇదే వాదాన్ని కాంగ్రెస్ ప్రజల ముందు బట్టబయలు చేసింది’’ అని ప్రధాని విమర్శలు గుప్పించారు.


Read More
Next Story