కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ నోట ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతం.
x

కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ నోట ఆర్ఎస్ఎస్ ప్రార్థన గీతం.

ఆశ్చర్యపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీజేపీ ఎమ్మెల్యేలతో మార్మోగిన అసెంబ్లీ..


Click the Play button to hear this message in audio format

కర్ణాటక(Karnataka) అసెంబ్లీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఉపముఖ్యమంత్రి(Deputy CM) డీకే శివకుమార్ (DK Shivakumar) "నమస్తే సదా వత్సలే మాతృభూమి" అని అన్నారు. ఆర్ఎస్ఎస్(RSS) ప్రార్థనా గీతంలోని ఈ పదాలను విన్న శాసనసభ్యులు ఒక్కసారిగా ఆశ్చరానికి గురయ్యారు.


ఇంతకు ఏం జరిగిందంటే..

కర్ణాటక అసెంబ్లీలో శుక్రవారం (ఆగస్టు 22న) చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాట(Stampede) ఘటనపై చర్చ మొదలైంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.


‘తొక్కిసలాటకు బాధ్యత ఎవరు వహిస్తారు?’

బీజేపీ ఎమ్మెల్యే శివకుమార్ తొక్కిసలాటకు డీకే శివకుమారే కారణమని ఆరోపించారు. ‘‘బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీంను ఆయనే రిసీవ్ చేసుకున్నారు. చిన్నస్వామి స్టేడియం వరకు కొనసాగే విక్టరీ పరేడ్‌కు ఆయనే జెండా ఊపారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని డిమాండ్ చేశారు.

శివకుమార్ వ్యాఖ్యలకు "నమస్తే సదా వత్సలే మాతృభూమి" అనే ఆర్ఎస్ఎస్ గీతంలోని కొన్ని పదాలను ఉచ్చరిస్తూ డీకే కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. వెంటనే ప్రతిపక్ష బీజేపీ శాసనసభ్యుల నుంచి చప్పట్లు వినిపించాయి. కాంగ్రెస్(Congress) ఎమ్మెల్యేలను నిశ్శబ్దం ఆవరించింది.


‘అవును నేనే వెళ్లాను..’

"నేను కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA) సభ్యుడ్ని. KSCA కార్యదర్శితో సహా అక్కడి వారంతా నా స్నేహితులు. నేను బెంగళూరు ఇన్-ఛార్జ్ మంత్రిని. విమానాశ్రయం, స్టేడియానికి (జూన్ 4న) వెళ్ళాను. కర్ణాటక జెండాను కూడా పట్టుకున్నాను. వారికి (RCB) శుభాకాంక్షలు తెలిపాను. ట్రోఫీని కూడా ముద్దాడాను. నేను నా పని పూర్తి చేసాను." అని సమాధానమిచ్చారు.

"తొక్కిసలాట ఘటన తర్వాత ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకుందని మీరు గుర్తించాలి. పోలీసు అధికారులు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చర్య తీసుకోవడం పట్ల మీరు గర్వపడాలి" అని అన్నారు డీకే

ఇంకా ఇలా మాట్లాడారు. "ప్రమాదం జరిగింది. ఇలాంటివి ఇతర రాష్ట్రాలలో కూడా జరిగాయి. కావాలంటే ఆ ఘటనల జాబితాను చదివి వినిపిస్తా. నేను కూడా మీ గురించి చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

విపక్ష నేత ఆర్. అశోక కలగజేసుకుని.. "ఆర్ఎస్ఎస్ చడ్డీ" కూడా ధరించానని డీకే ఓ సారి చెప్పారని గుర్తు చేశారు. "ఈ పంక్తులను రికార్డుల నుంచి తొలగించబడవని ఆశిస్తున్నాను" అని బీజేపీ మరో ఎమ్మెల్యే వి సునీల్ కుమార్ అని చమత్కరించారు.

Read More
Next Story