కర్ణాటక: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
x
కార్వార్ శాసన సభ్యుడు సతీష్ కృష్ణ సైల్

కర్ణాటక: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

ఇనుప ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేసిన సతీష్ కృష్ణ


ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ కృష్ణ సైల్ కు చెందిన రూ. 21 కోట్ల విలువైన ఆస్తులను జప్తు అటాచ్ చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శనివారం తెలిపింది.

నవంబర్ 6న మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద తాత్కాలిక ఉత్తర్వూ జారీ చేసింది. అటాచ్ చేయబడిన ఆస్తులు సైల్ అక్రమంగా సంపాదించాడని తెలియజేసింది.

సతీష్ ఈ ఆస్తులను గోవాకు చెందిన శ్రీ మల్లికార్జున్ షిప్పింగ్ ప్రయివేట్ లిమిటెడ్(ఎస్ఎస్పీఎల్) అనే కంపెనీ ద్వారా సమకూర్చుకున్నాడని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఉత్తర కన్నడలోని కార్వార్ శాసనసభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనను సెప్టెంబర్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. తరువాత వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు అయింది.

దీనిని శుక్రవారం ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు రద్దు చేసిందని ఈడీ తెలిపింది. అటాచ్ చేయబడిన ఆస్తులలో గోవాలోని మోర్ముగావ్ లోని చికలిమ్ గ్రామంలో 12,500 చదరపు మీటర్ల స్థలం, మోర్ముగావ్ తాలుకా లో పెడ్రో గల్లే కొట్టా అనేబడే 16,850 చదరపు మీటర్ల వ్యవసాయ ఆస్తి, గోవాలోని వాస్కోడిగామా వద్ద ఉన్న ఒక వాణిజ్య భవనం బహుళ అంతస్తులు ఉన్నాయి. దీని ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 64 కోట్లు అని తెలిపింది. ఈ ఆస్తుల పుస్తక విలువ మాత్రం రూ. 21 కోట్లు అని ఈడీ పేర్కొంది.

శాసనసభ్యుడితో సంబంధం ఉన్న ఒక కంపెనీ ఇనుప ఖనిజాన్ని అక్రమంగా ఎగుమతి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. 2010 లో కర్ణాటక లోకాయుక్త బళ్లారి నుంచి బెలెకరీ ఓడరేవుకు అక్రమంగా రవాణా చేయబడిన ఎనిమిది లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని కనుగొన్న కేసు నుంచి ఈడీ దర్యాప్తు ప్రారంభమైంది.
ఈ కేసులో ఆగష్టు 13-14 తేదీలలో కార్వార్, గోవా, ముంబై ,ఢిల్లీలో సోదాలు నిర్వహించింది. బెలేకరీ పోర్టులో స్వాధీనం చేసుకున్న ఇనుప ఖనిజం పై ఎస్ఎంఎస్పీఎల్ ఎండీ ఎమ్మెల్యే సతీశ్ కొనుగోలు చేశారని ఏజెన్సీ ఆరోపించింది.
తదనంతరం సతీష్, పోర్ట్ కన్జర్వేటర్ తో కలిసి అక్రమంగా సేకరించిన ఇనుప ఖనిజాన్ని ఎంవీ కొలంబియా, ఎంవీ మాండరిన్ హార్వెస్ట్ వంటి నౌకల ద్వారా చైనాకు ఎగుమతి చేశాడు. హాంకాంగ్ లో మరో కంపెనీ ప్రారంభించడం ద్వారా డబ్బులు ఆ ఖాతాలో జమ చేయించుకున్నాడు’’ అని ఈడీ ఆరోపించింది.
Read More
Next Story