
డెలివరీ బాయ్ చిత్రం
‘గిగ్’ వర్కర్ల బిల్లును ఆమోదించిన కర్ణాటక ప్రభుత్వం
భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరిస్తానని రాహుల్ గాంధీ హమీ
కర్ణాటక ప్రభుత్వం గిగ్ కార్మికులను రక్షించడానికి కర్ణాటక ప్లాట్ ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ బిల్లును ఆమోదించడం ద్వారా మరో ముందడుగు వేసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా గిగ్ వర్కర్ల సంక్షేమానికి తన మద్దతును ప్రకటించారు.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్, ఐటీ/బీటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఈ విషయంపై చర్చించడానికి ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు.
ఈ చర్చల తరువాత సిద్ధరామయ్య గిగ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పటి నుంచి ప్రభుత్వం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తో సహ ఇతర కంపెనీలలో పనిచేస్తున్న కార్మికుల అవసరాలు తీర్చడం ప్రారంభించింది.
కార్మిక శాఖా మంత్రి సంతోష్ లాడ్ ఈ ముసాయిదా బిల్లును మంత్రివర్గంలో ప్రవేశపెట్టారు. దీనిని ఆర్డినెన్స్ ద్వారా అమలులోకి తెచ్చారు. ఈ బిల్లును ఇఫ్పుడు అధికారికంగా శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు.
గవర్నర్ ఆమోదంతో ఇది చట్టంగా మారనుంది. గిగ్ వర్కర్లపై చర్చల సందర్భంగా రాహుల్ గాంధీ లేవనెత్తిన సమస్యలు, సవాళ్లు ఈ నిబంధనలలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
కంపెనీల నుంచి 5 శాతం సెస్సు...
‘‘రాజస్థాన్ తీసుకొచ్చిన చట్టం లా కాకుండా మేము విస్తృతంగా అధ్యయనం చేశాము, 30 సార్లకు పైగా వారితో సంప్రదింపులు జరిపాము’’ అని అధికారులు తెలిపారు. గిగ్ కార్మికుల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తారు. కంపెనీల నుంచి 5 శాతం సెస్సు వసూలు చేస్తారు.
రాష్ట్ర సంక్షేమ పథకాలను అమలు చేయడానికి వీటికి అదనపు నిధులు కేటాయిస్తుంది. ఉద్యోగులు, యజమానులు, పరిశ్రమలు లేదా వేదికలపై భారం మోపడం దీని ఉద్దేశ్యం కాదు. గిగ్ రంగంలోని కార్మికులకు భద్రతకు అందించడం దీని ఉద్దేశ్యం.
భారత్ లో కొత్తగా..
డిజిటల్ ప్లాట్ ఫాంలో పనిచేసే వారిని గిగ్ వర్కర్లు అంటారు. విదేశాలలో ఇప్పటికే ఇటువంటి చట్టాలు అమలులో ఉన్నాయి. ఈ కామర్స్, సేవా ప్లాట్ ఫాంలు వేగంగా విస్తరిస్తుండటంతో ఈ రంగం కార్మికుల హక్కులను కాపాడటం ఇప్పుడు ప్రభుత్వ బాధ్యత.
నీతి అయోగ్ ప్రకారం.. భారత్ లో 23. 5 మిలియన్ల గిగ్ వర్కర్లు ఉన్నారు. వీరిలో కర్ణాటకలో పనిచేస్తున్న వారి సంఖ్య దాదాపుగా నాలుగు లక్షలుగా ఉంది. వీరిలో ఎక్కువ మంది రద్దీగా ఉండే కలుషితమైన పట్టణ ప్రాంతాలలో పనిచేస్తున్నారు.
అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ బిల్లు ప్రకారం.. రాష్ట్రం రూ. 2 లక్షల వరకూ ఆరోగ్య భీమా కవరేజీని అందిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 10, 560 మంది కార్మికులు గిగ్ ఫాట్ ఫాంల కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
గిగ్ వర్కర్లుగా ఎవరు అర్హులు..
అమెజాన్, ఫ్లిప్ కార్డ్, స్విగ్గీ, జోమాటో, ఓలా, ఉబర్ రైడ్ షేరింగ్, ఆహారం, కిరాణ డెలివరీ, లాజిస్టిక్స్, ఈ మార్కెట్ల ప్లేస్ లు, హెల్త్ కేర్, ట్రావెల్, హస్పిటలిజీ వంటి సంస్థలతో ప్లాట్ ఫాం ఆధారిత సేవలను అందించే వారు గిగ్ వర్కర్ల కిందకు వస్తారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు..
కార్మిక శాఖామంత్రి అధ్యక్షతన గిగ్ వర్కర్స్ వెల్పేర్ బోర్డు ఏర్పాటు చేస్తారు. అదనపు చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపాల్ సెక్రటరీ, సెక్రటరీ లేదా జాయింట్ సెక్రటరీ స్థాయి కంటే తక్కువ కానీ సీనియర్ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖకు చెందిన సీనియర్ అధికారులతో పాటు సభ్యులుగా వ్యవహరిస్తారు.
ప్రభుత్వం నియమించిన సీఈఓ బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ నామినేట్ చేసిన గిగ్ వర్కర్ల నలుగురు ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు.
స్విగ్గీ డెలీవరీ బాయ్ జీ. గణేష్ ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. దీనిని సామాజిక భద్రత, సంక్షేమానికి కీలక ముందుడుగా అభివర్ణించారు. అయితే తమ పని గంటలన తగ్గించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
‘‘ప్రస్తుతం మేము ఉదయం నుంచి రాత్రి వరకూ ఓ వేళ అంటూ పనిచేస్తున్నాం. ఓ టైమ్ అంటూ ఉంటే కుటుంబాలతో సమయం గడపవచ్చు. మా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు’’ అని చెప్పారు.
రాహుల్ గాంధీ ఏం అన్నారంటే..
గిగ్ కార్మికుల సమస్యలపై రాహుల్ గాంధీ ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చట్టాన్ని రూపొందించాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు.
ఇది ప్రతి రాష్ట్రం పట్ల కాంగ్రెస్ పార్టీ దార్శనికతను ప్రతిబింబిస్తుందని అన్నారు. ‘‘ రేటింగ్ నహీ, హక్ చాహియే. ఇన్సాన్ హై హమ్, గులాం నహీ’’ అన్నారు.
‘‘భారత్ జోడో యాత్ర సందర్భంగా గిగ్ వర్కర్లు చెప్పిన మాటలు నా మనసులో నాటుకున్నాయి. వారికి హక్కులు, గౌరవం, రక్షణను నిర్దారించడం ద్వారా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకంగా ముందడుగు వేసింది.
ఇది మా దార్శనికత. మేము ప్రతి రాష్ట్రానికి, దేశ వ్యాప్తంగా తీసుకు వెళ్తాము. ఈ కార్మికులు మనకు ఆహరాన్నీ తీసుకువస్తారు. నిత్యావసరాలను అందిస్తారు. వేడీ, చలి, వర్షంలో మనకి కావాల్సినవి అందిస్తారు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Next Story