రష్యన్ మహిళను తిరిగి పంపడానికి కర్ణాటక హైకోర్టు ఆదేశాలు
x
గోకర్ణలోని గుహలో నివసిస్తున్న రష్యన్ జాతీయురాలు

రష్యన్ మహిళను తిరిగి పంపడానికి కర్ణాటక హైకోర్టు ఆదేశాలు

కొద్ది రోజుల క్రితం గోకర్ణలోని గుహలో ఇద్దరు ఆడ పిల్లలతో నివాసం ఉన్న నీనా కుటినా


కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం, గోకర్ణ కొండ గుహలో నివసిస్తున్న రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలను వారి దేశానికి తిరిగి పంపడానికి కర్ణాటక హైకోర్టు అనుమతి ఇచ్చింది.

గుహలో నివసించిన మహిళ నీనా కుటీనా కోరికలను పరిగణలోకి తీసుకున్న తరువాత జస్టిస్ బీఎం శ్యామ్ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై లో ఉత్తర కన్నడ జిల్లాలోని తీర ప్రాంత పట్టణమైన రామతీర్థ కొండ సమీపంలోని ఒక గుహ వెలుపల బట్టలు ఆరవేసినట్లు పెట్రోలింగ్ పోలీసులు గమనించారు. ఆ జోన్ లో ట్రెక్కింగ్ కు అనుమతి లేకున్నా, మనుషులు నివాసం ఉండటంపై వారు పరిశోధన చేశారు.

తరువాత పోలీసులు గుహలోకి ప్రవేశించగా, ఒక బాలిక తమ దగ్గరకు వచ్చింది. పోలీసులను చూసి బాలిక లోపలికి పరిగెత్తింది. దర్యాప్తులో నీనా(40) తన ఇద్దరు కుమార్తెలతో ఇక్కడ నివసిస్తున్నట్లు గమనించారు. వారి వయస్సు వరుసగా ఆరు, నాలుగు సంవత్సరాలు.
గుహలో కూతురికి పెయిటింగ్ నేర్పుతున్న..
చాలా చీకటిగా ఉన్న గుహ లోపల నీనా చిన్న దీపం మసక వెలుతురులో తన కూతురికి పెయింటింగ్ నేర్పిస్తూ కనిపించింది. ఆ దృశ్యం పోలీసులను ఆశ్చర్యపరిచింది.
ఇక్కడ ఎందుకు నివసిస్తున్నావని పోలీసులు ఆమెను ప్రశ్నించగా.. నీనా సమాధానమిస్తూ.. ఇక్కడ తాను ఆధ్యాత్మికత కోసం గుహలో నివసిస్తున్నాని చెప్పింది.
గుహలో ఎలాంటి ప్రాథమిక సౌకర్యాలు లేనట్లు పోలీసులు గుర్తించారు. నీనా 2017 లో వ్యాపార వీసాపై భారత్ కు వచ్చింది. గడువు ముగిసిన తరువాత కూడా ఇక్కడే ఉండిపోయింది. ఆమె చిన్న కుమార్తె భారత్ లోనే జన్మించింది. ఆమె మాజీ భాగస్వామి ష్లోమో గోల్డ్ స్టెయిన్.. ఇజ్రాయెల్ జాతీయుడు.
ఇద్దరి పిల్లల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన గోల్డ్ స్టెయిన్.. వారిని తన కస్టడీకి కోరాడు. 2024 లో అక్టోబర్ లో భారత్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తన 21 ఏళ్ల కుమారుడు మరణించడంతో నీనా తీవ్రంగా కుంగిపోయారని అన్నారు. నీనా తో సహ ఇద్దరు కుమార్తెలు అదృశ్యమయ్యారని గత ఏడాది డిసెంబర్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిర్భంధ కేంద్రానికి..
పోలీసులు నీనాతో సహ ఆమె ఇద్దరు పిల్లలను రక్షించి, తుమకూరులోని విదేశీయుల నిర్భంధ కేంద్రానికి పంపారు. అదే సమయంలో గోల్డ్ స్టెయిన్ పిల్లలను రష్యాకు తిరిగి పంపడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించాడు.
ఆయన వాదన ప్రకారం.. వారి సంక్షేమం, హక్కులను పరిగణలోకి తీసుకోవాలని వాదించాడు. కోర్టు మొదట్లో స్వదేశానికి పంపడాన్ని నిలిపివేసింది. కానీ పిల్లల ప్రయోజనం దృష్ట్యా తల్లి వాదలను పరిగణలోకి తీసుకుని ఆమె దరఖాస్తును ఆమోదించింది.
మాస్కో అమకు రష్యన్ పౌరసత్వం, అత్యవసర ప్రయాణ పత్రాలను మంజూరు చేయడంతో ఈ కేసు ఒక మలుపు తిరిగింది. తన దేశానికి తిరిగి రావాలనే నీనా కోరికలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని మైనర్లకు అవసరమైన ప్రయాణ పత్రాలను అందించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
విదేశీ పర్యాటకులు ధ్యానం చేయడం, వివిధ కారణాల వల్ల గుహలలో తాత్కాలికంగా బస చేయడం, వీసాలు గడువు ముగిసిన తరువాత హోటల్ నిబంధనలు, లేదా ఆర్థిక సమస్యలను తప్పించుకోవడం గోకర్ణలో కొత్తకాదు. అయితే ఇప్పుడు నీనా కేసు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది.
Read More
Next Story