కర్ణాటక అధికారపోరు: దావోస్ పర్యటన రద్దు చేసుకున్న డీకే
x
అస్సాం అసెంబ్లీ ఎన్నికల కోసం సమావేశమైన కాంగ్రెస్ నాయకులు

కర్ణాటక అధికారపోరు: దావోస్ పర్యటన రద్దు చేసుకున్న డీకే

వారం లోపల రాహుల్ గాంధీతో రెండుసార్లు సమావేశం అయిన కన్నడ ఉప ముఖ్యమంత్రి, నాయకత్వ మార్పు గురించే అని రాష్ట్రంలో ఊహగానాలు


కర్ణాటక కాంగ్రెస్ లో అధికార పోరాటం మరోసారి మొదలైన వాతావరణం కనిపిస్తోంది. సీఎంల మార్పుపై గత ఏడాది నవంబర్ లో మొదలైన ఎత్తులు, పైఎత్తులు తరువాత డీకే, సిద్ధరామయ్య అల్ఫాహర భేటీతో ముగింపు పలికినట్లు పైకి కనిపించినప్పటికీ లోపల మాత్రం ఇంకా రగులుకుంటున్నట్లే కనిపిస్తోంది.

కర్ణాటక సీఎం పదవిపై ఆశ పెట్టుకున్న కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఈ వారంలో రెండుసార్లు పార్టీ సీనియర్ నాయకుడు, అనధికార కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీని రెండుసార్లు కలిశారు.
ఆయన శనివారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగాల్సిన ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) పర్యటనకు వెళ్లాల్సింది. దానిని ఆయన హఠాత్తుగా రద్దు చేసుకున్నాడు. జనవరి 18న జరగాల్సిన దావోస్ శిఖరాగ్ర సమావేశానికి హజరుకాకూడదనే నిర్ణయం గురించి పార్టీ వర్గాల్లో, రాష్ట్రంలో ఊహగానాలకు తెరలేపింది.
సీఎం, డిప్యూటీ సీఎంతో.. రాహుల్..
గత వారం లో సీఎం సిద్ధరామయ్య, శివకుమార్ లతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. వారి ఇద్దరితో స్వల్పకాలిక సమయాల్లో ఆయన చర్చను ముగించారు. ఇది ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని హైకమాండ్ పరిష్కరిస్తుందనే పుకార్లకు ఆజ్యం పోసింది.
శుక్రవారం మళ్లీ శివకుమార్ వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు. ఈ సమావేశం ఎందుకు జరిగిందనే మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ‘‘నేను ఈ విషయాలను చెప్పలేను, ఇది బహిరంగంగా చర్చించాల్సిన విషయం కాదు. ఇది నాకు, పార్టీ హైకమాండ్ కి, ముఖ్యమంత్రికి ఉన్న విషయం’’ అని మాత్రమే చెప్పారు.
ఇదే రోజు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర నాయకులతో కలిసి అస్సాం రాష్ట్ర నాయకులు, అక్కడి పరిస్థితిపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు.
బీదర్ నుంచి ఢిల్లీ వరకూ..
దావోస్ పర్యటన రద్దు పై శివకుమార్ కార్యాలయం ఓ ప్రకటనలో వివరించింది. ఢిల్లీ, బెంగళూర్ లో హఠాత్తుగా వచ్చిన అధికారిక కార్యక్రమాల వల్ల దావోస్ పర్యటన రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది.
‘‘అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డిప్యూటీ సీఎం ఏఐసీసీ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎంజీఎన్ఆర్జీఎస్ పై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తున్నారు.
ఈ కారణంగా ఆయన దావోస్ పర్యటన రద్దు జరిగింది. జనవరి 22 నుంచి కర్ణాటక అసెంబ్లీ ఐదు రోజుల ప్రత్యేక సెషన్ నిర్వహించనుంది. ’’ అని ఆయన కార్యాలయం జారీ చేసిన ప్రకటన పేర్కొంది.
శనివారం సాయంత్రం శివకుమార్ బీదర్ లో శుక్రవారం మరణించిన మాజీ మంత్రి భీమన్న ఖండ్రే(102) అంత్యక్రియలకు హజరయ్యారు. తరువాత హైదరాబాద్ మీదుగా నేరుగా ఢిల్లీకి వెళ్లారు.
Read More
Next Story