కర్ణాటకలో పని గంటలు పెంచుతారా?
x

కర్ణాటకలో పని గంటలు పెంచుతారా?

ఏపీలో ఇప్పటికే అమలు..


Click the Play button to hear this message in audio format

ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగుల పని గంటలను పెంచిన విషయం తెలిసిందే. 10 గంటల పనికి క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా తెలిపింది. ప్రస్తుతం కర్ణాటక(Karnataka)లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పనిగంటల(Working hours)ను పెంచే యోచనలో ఉంది. 10 గంటలకు పెంచే అవకాశం ఉంది. అయితే పని గంటలు పెంచడం ద్వారా యాజమాన్యాలకు మేలు జరుగుతుందే తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని కార్మికులంటున్నారు. శారీరక, మానసిక ఒత్తిడి కూడా పెరిగే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి కర్ణాటక ప్రభుత్వం ఆగస్టు 2024లో 14 గంటల పని విధానాన్ని ప్రతిపాదించింది. అయితే వరుస నిరసనల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. మరోసారి అసెంబ్లీ సమావేశాల్లో పనిగంటలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Read More
Next Story