కరూర్ తొక్కిసలాట: టీవీకే చీఫ్ విజయ్ కు సీబీఐ నోటీసులు
x
విజయ్

కరూర్ తొక్కిసలాట: టీవీకే చీఫ్ విజయ్ కు సీబీఐ నోటీసులు

జనవరి 12న ఢిల్లీకి రావాలని సూచన


కరూర్ తొక్కిసలాటకు సంబంధించి జనవరి 12న ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయంలో విచారనకు హజరుకు కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమిళ నటుడు, టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ కు సమన్లు జారీ చేసింది.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన పార్టీ ర్యాలీలో విజయ్ ను చూడటానికి వేలాది మంది గుమిగూడిన సమయంలో గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.

భారీగా రద్దీ, సంస్థాగతమైన లోపాలు ఈ విషాదానికి కారణమయ్యాయని చెబుతున్నారు. అక్టోబర్ సుప్రీంకోర్టు ఆదేశాన్ని అనుసరించి, సీబీఐ దర్యాప్తును చేపట్టింది. నిష్పాక్షికంగా దర్యాప్తును ముగ్గురు ప్యానెల్ పర్యవేక్షిస్తుంది.

గత నెలలో ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ సహ పలువురు సీనియర్ టీవీకే నాయకులకు ఢిల్లీలో ప్రశ్నించారు.

బ్లేమ్ గేమ్..
ఈ విషాదం తీవ్ర చర్చకు దారితీసింది. అధికార డీఎంకే, టీవీకే నిర్వహణ లోపానికి కారణమని ఆరోపించగా, ప్రతిపక్ష పార్టీలు జనసమూహ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ లోపాలను విమర్శించాయి. ఈ సంఘటనకు పరిపాలనా వైఫల్యాలు, పోలీస్ లోపాలే కారణమని టీవీకే వాదన.
దాని వాదనలకు మద్దతు ఇచ్చే వీడియో ఆధారాలను సీబీఐకి సమర్ఫించింది. అయితే రాజకీయ ప్రేరణతో కూడిన ఆరోపణలు వచ్చాయి. సీబీఐకి చెన్నైలో ఒక క్రియాత్మక కార్యాలయం ఉన్నప్పటికీ ఢిల్లీలో ప్రశ్నించడం పై కొంతమంది టీవీకే అధికారులు, విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమన్ల సమయాన్ని కూడా ఎత్తి చూపుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉండవచ్చని వారు సూచించారు. టీవీకే ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమితో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించడంతో వారు దీనిని లింక్ చేస్తున్నారు.
కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు..
మరో వైపు దర్యాప్తు కోర్టు పర్యవేక్షణలో జరుగుతుందని విజయ్ రాకలో జాప్యం, తగినంత సౌకర్యాలు లేకపోవడం వంటి నిర్లక్ష్యంపై దృష్టి సారించిందని దర్యాప్తుకు దగ్గరగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి.
విజయ్ పూర్తి సహకారాన్ని ప్రతిజ్ఞ చేశాడు. బాధితులకు న్యాయం చేయవలసిన అవసరాన్ని టీవీకే నాయకులు చెప్పారు. ‘‘విజయ్ ఢిల్లీకి వెళ్లి స్వయంగా హజరు అయ్యే అవకాశం లేదని నేను నమ్ముతున్నాను’’ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ పేర్కొన్నారు.
‘‘ ఈ విషయాన్ని వ్యూహాత్మకంగా సంప్రదించే అవకాశం టీవీకేకు ఉంది’’ అని టీవీకే దీనిని బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ చర్యగా మార్చుకుంటే దాని నుంచి రాజకీయ ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అయితే విజయ్ బీజేపీ నాయకత్వాన్ని వ్యతిరేకించాలనుకుంటున్నారా లేదా అనేది అనిశ్చితంగా ఉంది’’.
Read More
Next Story