
కేరళ సీఎస్ఆర్ స్కాం: బాధితుల నుంచి రూ. 281 కోట్లు వసూలు
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నామన్న కేరళ సీఎం
సీఎస్ఆర్ నిధులు ఉపయోగించి సగం ధరకే స్కూటర్లు ఇస్తామని హమీ ఇచ్చిన మోసగాళ్లు 48,386 మంది నుంచి రూ. 281. 43 కోట్లు వసూలు చేశారని కేరళ సీఎం చెప్పారు.
కానీ సీఎస్ఆర్ ఫండ్ కుంభకోణంలో నమోదైన 386 కేసులలో దర్యాప్తు ప్రారంభించారని 16, 348 మందికి మంది వాహనాలు అందాయని పేర్కొన్నారు.
సీఎస్ఆర్ కుంభకోణంపై దర్యాప్తు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు విజయన్ సమాధానమిస్తూ.. మార్చి 12న ఈ కుంభకోణానికి సంబంధించి పోలీసులు 1343 కేసులు నమోదు చేశారని చెప్పారు.
వీటిలో 665 కేసులను ఎర్నాకుళంలోని క్రైమ్ బ్రాంచ్ సూపరిడెంటెండెట్ కు అప్పగించామని, ఆయన ఏడీజీపీ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేస్తున్నారని తెలిపారు.
సీఎస్ఎర్ నిధులను ఉపయోగించి సగం ధరకే ద్విచక్రవాహానాలు, ల్యాప్ టాప్ ఇస్తామని మోసపూరిత హమీ ఇచ్చి వేలాదిమందిని మోసం చేసిన కేసును ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ ఈ విషయం చెప్పారు.
ప్రధాన నిందితుల నుంచి అనేక కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఆనంద్ కృష్ణన్, రవి పన్నక్కల్, బషీర్ పీపీ, రియాస్, మహ్మద్ షఫీ, కేఎన్ ఆనంద్ కుమార్ అనే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దర్యాప్తు ప్రారంభించిన కేసుల డేటా ప్రకారం.. సగం ధరకే స్కూటర్లు ఇస్తామని హమీ ఇచ్చి 48 వేల మంది నుంచి 281 కోట్లు వసూలు చేశారని చెప్పారు. ల్యాప్ టాప్ ఇస్తామని చెప్పి 36 వేల మందికి రూ. 9.22 కోట్ల వసూలు చేస్తారు. అలాగే కుట్టు మిషన్ల కోసం రూ. 23.24 కోట్లు వసూలు చేస్తారు.
ప్రధాన నిందితుడు, అతని కంపెనీలు 23 బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తున్నాయని, కోర్టు ఆదేశాల ప్రకారం వాటిని జప్తు చేయడానికి చర్యలు ప్రారంభించామని సీఎం విజయన్ తెలిపారు.
ఈ మోసానికి సామాజిక- ఆర్థిక- పర్యావరణ అభివృద్ది సంఘం ఎన్జీఏ కాన్పెడరేషన్, వివిధ విత్తన సంఘాలు, సమాఖ్యల ద్వారా కుట్ర పన్నారని ఇవన్నీ ఆనంద్ కుమార్ చైర్మన్ గా ఆనంద్ కృష్ణన్ సమన్వయకర్తగా ఏర్పడ్డాయని సీఎం చెప్పారు.
Next Story