ఈ విపత్తుల గండం నుంచి బయటపడేదేలా? 2019 ని గుర్తు చేసుకున్న వయనాడ్
వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది ప్రజలు మృతి చెందారు. అయితే 2019లో ఇలాగే కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని తెలిసి కొంతమంది స్థానికులను..
వయనాడ్ ప్రజలను ఇప్పుడు ఒకటే ప్రశ్న వేధిస్తోంది. కొండచరియలు విరిగినప్పటికీ ప్రాణాలు కాపాడుకోవడం కుదరదా? మరణాలను నివారించడం సాధ్యం కాదా? అని తమలో తామే తర్కించుకుంటున్నారు.
వయనాడ్‌లోని కొండచరియల పునరావాస ప్రయత్నాలను కవర్ చేయడానికి అక్కడికి ఫెడరల్ బృందం వెళ్లింది. మెప్పాడి పంచాయతీ మాజీ ప్రెసిడెంట్ KK సహద్ వంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ.. చూరల్‌మల ప్రాంతంలోని చాలామంది వ్యక్తులు అక్కడి నుంచి ఖాళీ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తే మృతుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
2019 కొండచరియలు విరిగిపడిన సమయంలో...
సహద్ ఆగస్టు 7, 2019న జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. మెప్పాడి పంచాయతీ అధ్యక్షుడిగా సమయంలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నట్లు ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. సహద్, అధికారులను అప్రమత్తం చేయడమే కాకుండా, వార్డు సభ్యులు వాలంటీర్లతో ఒక చిన్న బృందాన్ని సేకరించి సహాయక చర్యలకు పూనుకున్నారు. అక్కడి నుంచి 350 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
"మేము ప్రజలను అప్రమత్తం చేయడం ప్రారంభించి, సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లమని వారిని కోరినప్పుడు, ప్రతిఘటన వచ్చింది. చాలామంది తమ ఇళ్లను వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. కొందరు మాతో వాదించారు, సహాయం కోసం పోలీసులను పిలవాలని ఒత్తిడి చేశారు. కొంతమంది స్థానికులను సమీపంలోని శిబిరానికి కుర్చీలపై తీసుకెళ్లవలసి వచ్చింది, ”అని సహద్ ది ఫెడరల్‌తో అన్నారు.
“కొందరు మా అభ్యర్థనలను పట్టించుకోలేదు, మరికొందరు వస్తువులను తిరిగి పొందేందుకు తిరిగి వెళ్లారు. కానీ మరుసటి రోజు భారీ కొండచరియలు విరిగిపడటంతో 53 ఇళ్లు కొట్టుకుపోగా, 17 మంది చనిపోయారు. మా తరలింపు ప్రయత్నాలు చాలా మంది ప్రాణాలను కాపాడాయని నేను నమ్మకంగా చెప్పగలను; లేకుంటే మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేదని సహద్ అన్నారు.
ముంచుకొస్తున్న విపత్తు..
పుత్తుమల కొండచరియలు విరిగిపడి ఐదు సంవత్సరాల తరువాత అక్కడికి కేవలం 2 కి.మీ దూరంలో ఉన్న వయనాడ్‌లోని ముండక్కై, చూరల్‌మలలో మరింత పెద్ద విషాదం సంభవించింది, సహద్ ఇప్పటికీ సహాయక చర్యలకు చురుగ్గా నాయకత్వం వహిస్తున్నాడు. చూరల్‌మల నివాసితులను ఖాళీ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేసి ఉంటే, అది చాలా మంది ప్రాణాలను రక్షించేదని అతను ది ఫెడరల్‌తో అన్నారు.
ఈసారి కూడా, భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేయడంలో విఫలమైందని ఆరోపించినప్పటికీ, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నట్లు సంకేతాలు ముందే ఉన్నాయని మాత్రం అంగీకరించారు. వాస్తవానికి, పుంఛిరిమట్టం, ముండక్కై వాసులు వరదల విప్తతకు సంసిద్ధంగానే ఉన్నారు. వినాశకరమైన కొండచరియలు విరిగిపడడానికి ఒక రోజు ముందు ప్రాంతీయ టీవీ రిపోర్టర్లు చూరల్‌మలలో ఉన్నారు, ప్రమాదం గురించిన నివేదికలను టెలికాస్ట్ చేశారు.
"కొండపై నుంచి కొన్ని చిన్నపాటి కొండచరియలు విరిగిపడ్డాయి. అలాగే నది నీటి వాసన, రంగులో మార్పు ద్వారా మేము ప్రమాదాన్ని పసిగట్టాము" అని కొండచరియలు విరిగిపడటంతో అదృష్టవశాత్తూ బయటపడి ఇప్పుడు మెప్పాడిలోని సహాయ శిబిరంలో ఉన్న నివాసి దినేషన్ చెప్పారు.
“ఎడతెగని వర్షం కురిసింది. నది ఒడ్డున నివసించే మాలో కొందరు సురక్షితమని భావించిన ప్రదేశాలకు మకాం మార్చారు, కానీ ఇంతటి విపత్తు మేము ఊహించలేనంతగా ఉంది, ”అని దినేశన్ తన నోట్‌లో అభిప్రాయం వ్యక్తం చేశారు.
WhatsApp హెచ్చరికలు పట్టించుకోలేదు..
మెప్పాడి పంచాయతీ పరిస్థితి తీవ్రతను ముందే ఊహించి, వాట్సాప్ గ్రూపుల ద్వారా హెచ్చరిక సందేశాలను పంపింది, కొన్ని ప్రాంతాల నుంచి తరలింపులను కూడా ప్రారంభించింది.
ఈ ప్రాంతాల వాసులు ముదక్కల్ సెంటర్, చూరల్‌మల పట్టణంలోని స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఏదేమైనా, ఈ ప్రాంతాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమైన వాటిలో ఒకటిగా నిలిచాయి. ఇక్కడ నుంచి వెళ్లకుండా ఉన్నవారు తీవ్రంగా నష్టపోయారు.
జూలై 29న వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన హెచ్చరిక సందేశాన్ని ఫెడరల్ యాక్సెస్ చేసింది. అందులో ఇలా ఉంది: “ఈ ఉదయం 8:30 నుంచి మెప్పాడి పుత్తుమలలో 163 మిమీ వర్షం కురిసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, ఈ మొత్తం నిన్నటి 200 మి.మీ కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కావున ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని సమాచారం అందించింది.
ఊహించని విపత్తు
మేప్పాడి పంచాయతీ ప్రెసిడెంట్ కె బాబు మాట్లాడుతూ.. “మేము వివిధ మార్గాల ద్వారా హెచ్చరికలు జారీ చేసాము. ప్రమాదకరమైన ప్రదేశాల నుంచి ప్రజలను తరలించాము. ఈ ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్థానికులు విశ్వసించారు. చూరల్‌మల పట్టణం సురక్షితమైన ప్రదేశంగా పరిగణించబడింది. పుత్తుమల కొండచరియలు విరిగిపడినప్పుడు, ప్రజలను ఈ ప్రాంతానికి తరలించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి మేము మా వంతు కృషి చేసాము. కానీ చాలామంది అక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడలేదు.
2024లో అప్పటిలా లేదు..
“నేను 2019లో ఖాళీ చేయమని పట్టుబట్టినప్పుడు, ప్రజలు నన్ను, పంచాయతీని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ మేము తరలింపును కొనసాగించాము. విపత్తు సంభవించిన తర్వాత మాత్రమే మేము సరిగ్గా వ్యవహరించామని వారు గ్రహించారు,” అని సహద్ చెబుతున్నారు.
ప్రస్తుతం మెప్పాడి సహాయ శిబిరంలో ఉన్న ఎస్టేట్ ఉద్యోగి సురేష్ చెబుతూ.. “పంచాయతీ చూరల్‌మల, ముండక్కైలో వాట్సాప్ హెచ్చరికలు పంపిందని కొందరు అంటున్నారు. కాని నాకు ఏదీ అందలేదు. ఫాలో-అప్ కూడా లేదు ” అన్నారు.
ముండక్కై వార్డు మాజీ సభ్యురాలు షైజా బేబీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈసారి తరలింపు ప్రయత్నం సరిపోలేదు. ఏ ఖర్చు వెచ్చించి అయినా ఆ ప్రాంతం నుంచి ప్రజలను తొలగించి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు.
“నేను ముండక్కైలో నివసిస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం మెప్పాడికి మకాం మార్చాను. నేను శిబిరాలను సందర్శించినప్పుడు, నా పూర్వపు ఇరుగుపొరుగువారు విలపిస్తున్నారు. నన్ను ముండక్కై నుంచి తరలించకపోతే, నేను వారిని రక్షించి ఉండేవాడిని. వారిలో చాలా మంది ఇంకా జీవించి ఉండవచ్చు. వారు 2019లో మా తరలింపు ప్రయత్నాలను ప్రస్తావిస్తున్నారు. నేను విపరీతమైన అపరాధభావాన్ని అనుభవించాను. వారి ఏడుపులు ఇప్పటికీ నా మనస్సులో ప్రతిధ్వనిస్తున్నాయి" అని బేబీ చెప్పారు.
మెప్పాడిలోని ఒక తాత్కాలిక శవాగారంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న షైజా.. ముండక్కై, చూర్రల్‌మల నుంచి 50కి పైగా మృతదేహాలను గుర్తించడంలో కీలకపాత్ర పోషించింది. మాజీ వార్డు మెంబర్‌గా, ఆ తర్వాత ఆశా వర్కర్‌గా ఆమెకు గ్రామంలో దాదాపు అందరికీ తెలుసు. కొండచరియలు విరిగిపడటానికి ఒకరోజు ముందు పుత్తుమల నుంచి 2019 తరలింపులో ముందంజలో ఉన్నారు.
రాజకీయాలు..
మెప్పాడి పంచాయితీ ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని UDFచే పాలించబడుతోంది. అయితే పుత్తుమల భూకుంభకోణం సమయంలో CPI(M) నేతృత్వంలోని LDF అధికారంలో ఉంది.
స్పష్టంగా, రెండు విపత్తుల సమయంలో చేసిన ప్రయత్నాల పోలికను స్థానిక రాజకీయాలు ప్రభావితం చేయవచ్చు. అయినప్పటికీ, చాలా మంది నివాసితులు 2019లో సంసిద్ధత గణనీయంగా మెరుగ్గా ఉందని, ఇళ్లను రక్షించడం దాదాపు అసాధ్యం అయినప్పటికీ చాలా మంది ప్రాణాలు రక్షించబడ్డాయని భావిస్తున్నారు.
ముందక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని కల్పేటకు చెందిన హ్యూమ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ వైల్డ్‌లైఫ్ బయాలజీ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు సామాజిక కార్యకర్త సుమేష్ మంగళస్సేరి తెలిపారు. అయినప్పటికీ సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదు.
“పంచాయతీ మాత్రమే కాదు, జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ కూడా బాధ్యత వహించాలి. మునుపటి కొండచరియలు విరిగిపడిన సమయంలో, వారు 50 మందిని రక్షించడానికి అదే డేటాను ఉపయోగించారు. రెస్క్యూ , రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయిన తర్వాత మేము ఈ అంశాలను చర్చించాలి, ”అని సుమేష్ తెలిపారు.
Next Story