కర్ణాటక సీఎం మార్పుపై స్పందించిన ఖర్గే
x
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

కర్ణాటక సీఎం మార్పుపై స్పందించిన ఖర్గే

తుది నిర్ణయం హై కమాండ్ దేనన్న ఏఐసీసీ అధ్యక్షుడు


కర్ణాటక లో ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు చెలరేగుతుండటంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదివారం స్పందించారు. ఈ అంశంపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

తాను చెప్పడానికి ఏమీ లేదన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూర్ లో కలిసిన ఒకరోజు తరువాత ఈ ప్రకటన వెలువడింది. ఆదివారం వీరిద్దరి మధ్య సమావేశం ఒక గంటకు పైగా కొనసాగింది.

‘‘జరిగిన పరిణామాల గురించి నేను ఏమి చెప్పలేను. కాబట్టి మీరు(మీడియా) ఇక్కడ నిలబడి సమయాన్ని వృథా చేసుకోవద్దు. నేను చాలా బాధపడుతున్నాను. ఏదైనా నిర్ణయం హై కమాండ్ దాన్ని నిర్ణయిస్తుంది. మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని ఖర్గే తన నివాసం వెలుపల ఉన్న విలేకరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

అధికార పంపిణీ..
నవంబర్ 20న కాంగ్రెస్ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలంలో సగం మార్క్ ను చేరుకున్న తరువాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి గురించి ఊహాగానాల తరువాత అధికార పార్టీలో పోరు తీవ్రమైంది.
నవంబర్ 22న ఖర్గేతో సమావేశం తరువాత సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడారు. తన ముఖ్యమంత్రి పదవీకాలంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
వారం కంటే తక్కువ సమయంలో ఖర్గేతో ఆయన రెండోసారి సమావేశం అయ్యారు. నాయకత్వ మార్పు చుట్టూ ఉన్న సంచలనాన్ని ఆయన ఊహగానాలు, మీడియా సృష్టిగా అభివర్ణించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శివకుమార్ మద్దతు ఇచ్చే కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ ఆఫీస్ బేరర్లను కలిశాక, ఖర్గేతో ఆయన సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖర్గేను కలవడానికి శాసనసభ్యులు ఢిల్లీకి వెళ్తున్న విషయం తనకు తెలియదని శివకుమార్ అన్నారు.
సీఎం పదవిలో మార్పు లేదు..
నవంబర్ 23న సిద్ధరామయ్య విధేయులైన మంత్రులు హెచ్ సీ మహదేవప్ప, కే. వేంకటేశ్ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఆయన నివాసంలో కలిశారు. సమావేశం తరువాత వారు విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి మార్పుకు ఇప్పుడు తగిన పరిస్థితి లేదన్నారు. అలాంటిది తలెత్తితే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని మహాదేవప్ప అన్నారు. ఖర్గేతో జరిగిన సమావేశం మర్యాదపూర్వకమైనదని పార్టీ నిర్మాణం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయని పేర్కొన్నారు.
నాయకత్వ మార్పుపై చర్చ గురించి ఖర్గేతో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ గురించి కూడా విలేకరులు ప్రశ్నించారు. వాటి గురించి ఎలాంటి చర్చ లేదన్నారు. పార్టీలో నాయకత్వ మార్పు అనే ప్రశ్న లేదని అన్నారు.
ముఖ్యమంత్రి మార్పుపై ఎమ్మెల్యేల సంతకాల సేకరణ కార్యక్రమం జరిగిందనే ప్రచారాన్ని కూడా మహాదేవప్పు తోసిపుచ్చారు. ‘‘ఇప్పటి వరకూ మమ్మల్ని ఎవరూ పిలవలేదు’’ అన్నారు.
కాంగ్రెస్ తన పూర్తి పదవీకాలాన్ని చేస్తుంది.. తిరిగి 2028 లో అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి మార్పు ఉండదు. సిద్ధరామయ్యే అధికారంలో ఉంటారని ఆయన అన్నారు.
మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణ
ఇతర పార్టీల సమాచారం ప్రకారం.. సిద్ధరామయ్య తన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ఒత్తిడి చేస్తుండగా, శివకుమార్ పార్టీ నాయకత్వ మార్పుపై ముందుగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపితే ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేస్తారని శివకుమార్ పదవీదక్కే అవకాశం లేదని పార్టీ అంతర్గత వర్గాల మాట.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తరువాత సీఎం పదవికోసం సిద్ధరామయ్య, డీకే పోటీ పడ్డారు. అయితే కాంగ్రెస్ డీకేను ఒప్పించి, సిద్ధరామయ్యకు సీఎం పదవిని అప్పగించింది.
రోటేషనల్ సీఎం ఫార్మూలా ఆధారంగా రాజీ కుదిరిందని ఆ సమయంలో కొన్ని ఊహగానాలు వచ్చాయి. దీని ప్రకారం శివకుమార్ రెండున్నర సంవత్సరాల తరువాత సీఎం అవుతారు. కానీ పార్టీ మాత్రం దీనిని అధికారికంగా ధృవీకరించలేదు.
Read More
Next Story