జనవరి 31న ‘కులగణన’ విడుదల చేస్తాం: సీఎం సిద్ధరామయ్య
x
కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య

జనవరి 31న ‘కులగణన’ విడుదల చేస్తాం: సీఎం సిద్ధరామయ్య

ఉత్తరాదిలో విఫలమైన కుల గణన నినాదం.. దక్షిణాదిన మాత్రం తమకు ఓట్లను రాలుస్తుందని కన్నడ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.


కులం కార్డుతో ఓబీసీ, ఇతర మైనారిటీ వర్గాలను తమ వైపుకు లాక్కుకునేందుకు ఈ చర్య అవసరమవుతుందని, అలాగే ప్రత్యర్థికి అండగా ఉన్న కొన్ని సామాజిక వర్గాలను దూరం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది.

కర్నాటకలో కులగణన లెక్కలను ఈ నెల చివర అంటే జనవరి 31న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు. ఆదివారం( జనవరి 28) సెంట్రల్ కర్నాటకలోని చిత్రదుర్గ్ లో జరిగిన ఓబీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నివేదికను బయటపెట్టడమే కాకుండా కమిషన్ ఇచ్చిన నివేదికను ఆమోదిస్తామని ప్రకటించారు.

కర్నాటకలో కులాల వారీగా సామాజిక- విద్యా ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి కర్నాటక వెనకబడిన తరగతుల కమిషన్ ను కాంతారాజ్ అధ్యక్షతన గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అంటే 2015 లో నియమించారు. ఇందుకోసం దాదాపు రూ. 170 కోట్లు ఖర్చు చేసింది. 2019 లో కమిషన్ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

అయితే అప్పటి బీజేపీ ప్రభుత్వం దీనిని ఆమోదించడానికి నిరాకరించింది. అప్పటికే కాంతారాజ్ కమిషన్ గడువు ముగిసింది. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని బయటకు తీసింది. గత 40 రోజులుగా 1.60 లక్షల మంది సిబ్బందిని నియమించి కమిషన్ నివేదికను క్రోడికరిస్తున్నారని ప్రస్తుత అధ్యక్షుడు జయప్రకాశ్ హెగ్దే వెల్లడించారు.

" నా పదవీ కాలం జనవరి 31 తో ముగుస్తుంది. దీనిపై విపరీతమైన రాజకీయ ఒత్తిడి ఉంది. అయితే తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తాను " అని ఆయన ఫెడరల్ తో అన్నారు. ప్రస్తుతం నివేదిక ప్రతులు ప్రింటింగ్ జరుగుతున్నాయని చెప్పారు. అనేక సిఫార్సులు అందులో పొందుపరిచినట్లు ఆయన వివరించారు. ఇదీ మంత్రివర్గంలో చర్చించి, అసెంబ్లీలో సమర్పించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వానికి ఉందని జయప్రకాశ్ హెగ్దే అన్నారు.

అయితే సిద్ద రామయ్య సర్కార్ ప్రస్తుతం చేస్తున్న కులగణనను కర్నాటకలోని ఆధిపత్య వర్గాలైన ఒక్కలిగ, లింగాయత్ లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కులగణను ఆమోదించేది లేదని ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా తమ బలాన్ని ప్రదర్శిస్తూ ఈ మధ్య దావణగిరే లో వీరశైవ లింగాయత్ మహాసభ నిర్వహించారు.

ఈ సమావేశానికి కౌంటర్ గా నిన్న చిత్రదుర్గ్ లో వెనకబడిన తరగతుల వారు, దళితులు, మైనారీటిలతో కలిసి అణగారిన వర్గాల సభ నిర్వహించారు. ఈ సభలో వివిధ వర్గాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం కమిషన్ నివేదికను ఏమార్పులు లేకుండా ఆమోదించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో వివిధ వర్గాలకు అవసరమైన మేర రిజర్వేషన్లు ఇవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని కోరుతోందని, ప్రస్తుతం ఈ కమిషన్ నివేదికతో మా కోరికలన్నీ నెరవెరుతాయని ఓబీసీ నాయకులు అంటున్నారు.

కాంగ్రెస్ ఓబీసీ నాయకుడు ఫెడరల్ తో మాట్లాడుతూ " ఆదివారం నాటి చిత్రదుర్గ సదస్సు ఆధిపత్య లింగాయత్, ఒక్కలిగ వర్గానికి బలమైన సందేశం పంపడమే లక్ష్యంగా ఉంది. అహిండా( AHINDA ) అంటే అల్పసంఖ్యాక మైనారిటీలు, హిందూలిదవారు( ఓబీసీలు), దళితులు, షెడ్యూల్డ్ తెగలవారు ఇలా అందరూ సిద్ద రామయ్య సర్కార్ కు అండగా ఉన్నారు. వారంతా కులగణన చేయాలని కోరుతున్నారు." అని చెప్పారు.

అలాగే ఎస్సీ వర్గాల్లో అంతర్గత కోటా ను అనుమతించాలని కోరుతూ కూడా సిద్దరామయ్య సర్కార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఎస్సీల అంతర్గత కోటా అంశంపై సాంఘిక సంక్షేమ మంత్రి హెచ్ సీ మహదేవప్ప మాట్లాడుతూ " ఆర్ఠికల్ 341(3)ని చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. లేకపోతే రిజర్వేషన్ పరిమితులను దాటడం రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యం కాదు. ఈ అంశంలో పార్లమెంటే సుప్రీం" అని ఆయన అన్నారు.

అలాగే 12 శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త బసవేశ్వరుడిని సైతం రాష్ట్ర సాంస్కృతిక చిహ్నంగా గుర్తించాలని కేంద్రాని కోరాలనే ఎత్తుగడ కాంగ్రెస్ వేస్తోంది. దీనివల్ల బీజేపీకి ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్ లను చీల్చడం ద్వారా తాము లాభపడతామని కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ. ఈ నిర్ణయాన్ని వివిధ లింగాయత్ మఠాధిపతులు సైతం సమర్ధించారు.

ఇదే అంశంపై బసవ మృత్యుంజయ స్వామి మాట్లాడుతూ " గతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బసవన్న ఫొటోను సిద్దరామయ్య సర్కార్ ఉపయోగించాలని జారీ చేసిన ఆర్డర్ కంటే ఇదీ ఇంకా ఉన్నతమైంది. ఆయన చరిత్ర సృష్టించారు" అని ప్రశసించారు. గతంలో లింగాయత్ లను ప్రత్యేక మతంగా చూడాలని కూడా కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. అయితే దీనిని వారు వ్యతిరేకించారు. తమను హిందూమతంగా నుంచి విడదీయడానికి ఈ ఎత్తుగడ అని ఆరోపించారు. ప్రస్తుతం అయోధ్య రామమందిర ప్రారంభం కావడం, కాంగ్రెస్ నుంచి ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ఎన్నికల ఎత్తుగడలను వేసింది. అందులో భాగంగా కులగణనను ముందుకు తెచ్చింది.

Read More
Next Story