‘అలా మాట్లాడాను..అవసరమైతే రాజీనామా చేస్తా..’
గవర్నర్ వ్యవహార శైలిని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తప్పుబడుతున్నారు. వ్యక్తులను బట్టి నడుచుకుంటున్నారని ఆరోపించారు.
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకేటాయింపుల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే గవర్నర్ వ్యవహార శైలి ఒక్కో నాయకుడితో ఒక రకంగా ఉంటోందని సిద్ధరామయ్య అంటున్నారు. తన విషయంలో చాలా వేగంగా స్పందించిన గవర్నర్..కేంద్ర మంత్రి కుమారస్వామి విషయంలో ఆ స్పీడ్ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.
వాటికి నేను భయపడను..సిద్ధరామయ్యకు కుమారస్వామి కౌంటర్..అక్రమ మైనింగ్ లీజు కేసులో కుమారస్వామిపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు అనుమతించాలని లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం సోమవారం గవర్నర్‌ను కోరింది. 2007లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టాన్ని ఉల్లంఘించి ప్రైవేట్ సంస్థకు మైనింగ్ లీజు మంజూరు చేశారన్న ఆరోపణలపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించాలని దర్యాప్తు సంస్ధ గత ఏడాది నవంబర్‌లో గవర్నర్‌ను కోరింది.
గవర్నర్ వ్యవహార శైలిని తప్పుబడుతున్న సీఎం ..
గవర్నర్ వ్యవహార శైలిని సిద్ధరామయ్య తప్పుబడుతున్నారు. గవర్నర్ తనపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. కుమారస్వామిని ప్రాసిక్యూట్ చేయాలన్న లోకాయుక్త సిఫార్సు 2023 నవంబర్ నుంచి గెహ్లాట్ వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తుచేశారు.
“గవర్నర్‌ను కించపరిచేలా మాట్లాడిన మీలా(సిద్దరామయ్య) కాకుండా అవసరమైతే నేను ఇష్టపూర్వకంగా రాజీనామా చేస్తాను. గవర్నర్‌పై అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక మంత్రులు సిగ్గుపడాలి. 2018లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాపై ఉన్న కేసులను నేను మాఫీ చేయించుకోగలను అని మీరు (సిద్ధరామయ్య) అనుకోలేదా? ఇప్పుడు అధికార కాంగ్రెస్ నాపై మరో కేసు తెరిచేందుకు సిద్ధమైంది. దానికి నేను భయపడను’’ అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు కుమారస్వామి.