కమ్యూనిస్టులు ‘ మోదీ స్టైల్’ లో బిల్లులను ఆమోదిస్తున్నారు: కాంగ్రెస్
కేరళలోని లెప్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలోని మోదీలా వ్యవహరిస్తూ బిల్లులను ఆమోదిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
కేరళలోని లెప్ట్ ప్రభుత్వం మోదీ తరహ నియంత మాదిరిగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. విపక్షాలతో ఎటువంటి చర్చలు జరపకుండా అసెంబ్లీలో బిల్లులను ఆమోదిస్తోందని ఆరోపించింది.
కేరళ మునిసిపాలిటీ (రెండవ సవరణ) బిల్లు, 2024, కేరళ పంచాయితీ రాజ్ (రెండవ సవరణ) బిల్లు, 2024 ఆమోదానికి సంబంధించి సోమవారం సభలో ఎటువంటి చర్చలు జరపకుండా ఆమోదించడంపై సభలో ప్రతిపక్ష నేత వీడీ సతీషన్ స్పీకర్ ముందు నిరసన తెలిపారు. జూన్ 10న సభ ఎజెండా ప్రకారం రెండు బిల్లులను సంబంధిత సబ్జెక్ట్ కమిటీలకు పంపాలని సతీశన్ తెలిపారు.
రాష్ట్ర మద్య పాలసీ సవరణకు సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ విపక్షాలు నిరసన తెలియజేస్తున్న సమయంలో సభ లో ఎటువంటి చర్చ లేకుండా ఈ బిల్లులను ఆమోదించారని అన్నారు.
సతీశన్, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల, యుడిఎఫ్ ఎమ్మెల్యే ఎన్ శంసుద్దీన్ మాట్లాడుతూ.. సభలో జరిగింది తప్పు అని, గతంలో ఎన్నడూ ఇలా జరగలేనిదని అన్నారు. సభలో ఇలాంటి చెడు సాంప్రదాయాలకు నాంది పలికారని విమర్శించారు. బిల్లుల ఆమోదాన్ని సస్పెండ్ చేస్తూ స్పీకర్ రూలింగ్ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
"సంఘ్ పరివార్ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లులను ఆమోదించిన విధంగానే" రాష్ట్రంలో బిల్లులను ఆమోదించారని సతీశన్ చెప్పారు. రెండు చట్టాలను సస్పెండ్ చేయాలన్న వారి డిమాండ్‌ను స్పీకర్ ఏఎన్ శ్యాంసీర్ తిరస్కరించడంతో సభను వాకౌట్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వార్డుల విభజనతో సహా విధివిధానాలను అత్యవసరంగా ఆమోదించాలని మంత్రి ఎంబీ రాజేష్ వాదనలను విన్న స్పీకర్ ఏఎన్ శ్యాంసీర్ ప్రతిపక్షాలను అంగీకరించలేదు. ఈ బిల్లు ప్రకారం 2025 లో వార్డులను విభజన చేయాలని అన్నారు. గతంలో కూడా పలు బిల్లులను కమిటీల పరిశీలనకు పంపకుండా, అసెంబ్లీలో చర్చించకుండానే సభలో ప్రవేశపెట్టి ఆమోదించారని స్పీకర్ తెలిపారు.
అదే సమయంలో, ఆర్థిక బిల్లులు మినహా అన్ని బిల్లులను సంబంధిత సబ్జెక్ట్ లేదా సెలెక్ట్ కమిటీలు పరిశీలించిన తర్వాత ఆమోదించడం "అత్యంత అభిలషణీయం" అని షంసీర్ అంగీకరించారు.
Next Story