బీజేపీ ఉత్తరాది పార్టీ అనే ప్రచారాన్ని తిప్పికొడతాం: ఆర్ఎస్ఎస్
x
RSS

బీజేపీ ఉత్తరాది పార్టీ అనే ప్రచారాన్ని తిప్పికొడతాం: ఆర్ఎస్ఎస్

బీజేపీ కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమైందని, దక్షిణాన దాని ఉనికి పోయిందనే ప్రచారం చాలారోజులుగా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే పనిని ఆర్ఎస్ఎస్ చేస్తోంది.


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల నుంచి తగినంత మద్దతు లభించేందకు తన వంతు ప్రయత్నాలు ప్రారంభించినున్నట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు ఫెడరల్ ప్రతినిధికి చెప్పాయి.

కొంతమంది వ్యక్తులు కర్నాటకలో బీజేపీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి పనికట్టకుని మరీ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని పదే పదే ఈ ప్రచారాన్ని చేస్తున్నారని అందుకే తాము కల్పించుకున్నట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ మధ్య మూడు ఉత్తరాది రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేసిన తరువాత ఈ ప్రచారం మరింతజోరుగా సాగుతున్నట్లు కాషాయదళం గుర్తించింది. దక్షిణాది ఉన్న హిందూ సంస్థలు, మద్దతుదారులు, ప్రజలను అయోమయంలో పడేసే దురుద్దేశంతోనే ఇలాంటి విద్వేష ప్రచారాలకు దిగినట్లు నాగ్ పూర్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

"మా దృష్టిలో ఇండియా మాత్రమే ఉంది. అది హిమాలయాల దగ్గర నుంచి రామసేతు వరకూ విస్తరించి ఉంది. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అనే బేధాలు లేవు, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రజలను విభజించడానికి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి" అని ఆర్ఎస్ఎస్ ప్రతినిధి ఒకరు ఫెడరల్ తో చెప్పారు.

దక్షిణ భారతంలో కేవలం కర్నాటకలో మాత్రమే బీజేపీ ఇప్పటివరకూ అధికారం దక్కించుకోగలిగింది. అయితే ఆరు నెలల క్రితం తన అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో చిన్న రాష్ట్రమైన హిమాచల్ లో మాత్రమే అధికార పీఠంలో ఉంది. దక్షిణాదిలో కర్నాటక, ఈ మధ్య తెలంగాణలో అధికారపీఠమెక్కింది. ఈ రాజకీయ సమీకరణాల తరువాత ఉత్తర- దక్షిణం ప్రచారాలు ఉధృతం అయ్యాయి.

ఆర్ఎస్ఎస్ ప్రచారాలు

ఉత్తర- దక్షిణ ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ఆర్ఎస్ఎస్ నడుంబిగించింది. మేధావులు సాయంతో సెమినార్లు, చర్చలు నిర్వహిస్తూ సామాన్య ప్రజలకు భాగస్వాములు చేయాలని సంకల్పించింది.

"ఉత్తరం లేకుండా దక్షిణం అసంపూర్ణం, దక్షిణం లేకుండా ఉత్తరం అసంపూర్ణం.. ఇదే అంశాన్ని ప్రజలు మాట్లాడేలా చేయాలన్నదే మాలక్ష్యం. ఇందుకోసం మేధావుల సాయం తీసుకుంటామని ఆర్ఎస్ఎస్ నాయకుడొకరు చెప్పారు."

సార్వత్రిక ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉంది. కొన్ని దక్షిణాదిన ఉన్న రాజకీయ పార్టీలతో బీజేపీ పొత్తులకు ప్రయత్నించే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తులు తెగతెంపులు చేసుకున్న తరువాత ఇతర భావసారూప్య పార్టీలతో పొత్తులు కుదుర్చుకునే అవకాశం కనిపిస్తోంది.

"ప్రతి రాజకీయ పార్టీ తన సామాజిక, రాజకీయ పునాదిని విస్తరించుకోవడానికి ప్రయత్నించే హక్కు ఉంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున్న తమిళనాడులో మళ్లీ పొత్తులు చిగురించే అవకాశం ఉంది అని బీజేపీ నాయకుడొకరు చెప్పారు"

కర్నాటకలో జనతాదళ్ సెక్యూలర్ తో చేతులు కలపాలనే ఆలోచనలో బీజేపీ నాయకత్వానికి ఉంది. అలాగే తెలంగాణలో మిత్రపక్షాలు ఉన్నాయి. కేరళలో మాత్రం సొంతబలంపైనే ఎదగాలని లెక్కలు వేస్తున్నారు.

దక్షిణ భారతంలో గత దశాబ్దకాలంగా తన పనితీరును బీజేపీ మెరుగుపరుచుకోగలిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లోని 130 లోక్ సభ సీట్లకు గాను, 17 స్థానాలు గెలుచుకోగలిగింది. 2019 లో 19 ఎంపీలను గెలుచుకుంది.

అలాగే ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో సైతం 8 మంది ఎమ్మెల్యేలు, 14 శాతం ఓట్లను గెలచుకుంది. అయితే దక్షిణాదిన కర్నాటకలో తప్ప ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేకపోయింది. ఈ గణాంకాలు బీజేపీకి దక్షిణాదిన గణనీయమైన ఉనికిలేవనే విషయాన్ని సైతం తెలియజేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

"2019లో తమిళనాడు, కేరళలో బీజేపీ ఒక్కసీటు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. హిందూత్వ రాజకీయాలు బీజేపీని దక్షిణాదిన గెలిపించలేవని తెలుస్తోంది. ఇప్పటికి దక్షిణాది బీజేపీకీ సవాల్ గా నిలిచిందని పంజాబ్ యూనివర్శిటీ రాజనీతి ఫ్రొఫెసర్ అశుతోష్ కుమార్ చెప్పారు".

Read More
Next Story