కేరళ: కాంగ్రెస్, వామపక్షాలకు డేంజర్ బెల్స్.. బీజేపీ ఓటు శాతం..
x

కేరళ: కాంగ్రెస్, వామపక్షాలకు డేంజర్ బెల్స్.. బీజేపీ ఓటు శాతం..

దేవభూమి కేరళలో చాలాకాలంగా బీజేపీకి చట్ట సభల నుంచి ప్రాతినిధ్యం దక్కలేదు. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపు 20 నియోజకవర్గాల్లో ఎంతశాతం ఓటింగ్..


దేవభూమిగా ప్రసిద్ధి చెందిన కేరళ లో దశాబ్ధాలుగా దేవుడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు చోటే దక్కలేదు. సాంప్రదాయకంగా ఎల్డీఎఫ్, యుడీఎఫ్ లు కేరళను బలమైన కోటగా మలుచుకున్నాయి. ఒకరు అధికారంలోకి వస్తే మరోకరు ప్రతిపక్షంలో ఉన్నారు. దశాబ్ధాలుగా ఇదే ఒరవడి కొనసాగింది. కానీ ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఈ డైనమిక్స్ మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నికల్లో తన ఓట్ల శాతాన్ని పెంచుకుంది. ఎక్కువ సీట్లు గెలవనప్పటికీ కొన్నిస్థానాల్లో బలమైన పోటీని ఇచ్చిందని స్పష్టమైంది. రాష్ట్ర ఓటర్లలో మార్పు స్పష్టమైందని ఈ ఫలితాల వల్ల ఓ అంచనాకు రావచ్చు.

కేరళలో బీజేపీ ఓట్ల శాతం పెరుగుతోంది
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఓట్ల శాతం 19.23 శాతానికి (బీజేపీకి 16.68 శాతం, బీడీజేఎస్‌కు 2.55 శాతం) పెరగడంతోపాటు, 20 నియోజకవర్గాల్లో పది స్థానాల్లో 20 శాతం ఓటింగ్ శాతాన్ని తన ఖాతాలో వేసుకుంది. రాష్ట్రంలో బీజేపీ సాధించిన ఏకైక సీటు అయిన త్రిసూర్‌లో 37.8 శాతం ఓట్లను సాధించగలిగింది. ఇక్కడ సురేష్ గోపి రాష్ట్రంలో తొలిసారిగా విజయం సాధించారు.
అలాగే రాజీవ్ చంద్రశేఖర్ కూడా తిరువనంతపురంలో గణనీయమైన ఓట్లు సాధించారు. ఆయన 35.52 శాతం ఓట్లను సాధించి రెండో స్థానంలో నిలిచారు. కేంద్ర మంత్రి వి మురళీధరన్ అట్టింగల్‌లో మూడవ స్థానంలో నిలిచినప్పటికీ, ఆయన కూడా 31. 64 శాతం ఓట్లు సంపాదించుకున్నారు.
మిగిలిన అభ్యర్థులు పోలైన ఓట్లలో శోభా సురేంద్రన్‌కి 28.3 శాతం, అనిల్‌ ఆంటోనీకి 25.29 శాతం ఓట్లు , అలప్పుజా, పతనంతిట్టలో బీజేపీ అభ్యర్థులు 25 శాతం ఓట్ల షేర్‌ మార్కును అధిగమించారు. మరో ఐదు నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థులకు మొత్తం ఓట్లలో దాదాపు 20 శాతం ఓట్లు వచ్చాయి. (పాలక్కాడ్‌లో 24.31 శాతం, కొట్టాయంలో 19.74 శాతం, కాసర్‌గోడ్‌లో 19.73 శాతం, అలత్తూరులో 18.97 శాతం, కొల్లాంలో 17.83 శాతం).
ప్రధాన మైలురాయి
మూడు నియోజకవర్గాల్లో 30 శాతం ఓట్ల మార్కును దాటడం కేరళలో బీజేపీకి ఆనందం కలిగించే అంశం. కొన్ని స్థానాల్లో తప్పిస్తే మెజారిటీ స్థానాల్లో భవిష్యత్ లో బీజేపీ ఇదే ట్రెండ్ ను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికల సంఘం డేటాను పరిశీలిస్తే ఎల్డీఎఫ్ ఎక్కువగా ఈ ఎన్నికల్లో ప్రభావితం అయినట్లు తెలుస్తోంది. ఈ పార్టీ ఓట్లలో చాలా భాగం బీజేపీకి బదిలీ అయినట్లు తెలుస్తోంది. కొంత నిశితంగా పరిశీలిస్తే కాంగ్రెస్ ఓట్ బేస్ కూడా కొంత వరకూ తగ్గినట్లు తెలుస్తోంది.
అయితే ఈసారి మైనారిటీల నుంచి వచ్చిన గణనీయమైన మద్దతు ఆ నష్టాన్ని చాలా వరకూ భర్తీ చేస్తోంది. చారిత్రాత్మకంగా అతి తక్కువ ఉనికిని కలిగి ఉన్న రాష్ట్రంలో బిజెపికి పెరుగుతున్న ఆదరణ లేదా మద్దతును ఇది సూచిస్తుంది.
అసెంబ్లీ సెగ్మెంట్లలో..
ఆసక్తికరంగా, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఓట్ల శాతం ఆధారంగా, ప్రస్తుతం ఎమ్మెల్యేలు లేని రాష్ట్రంలోని 140 అసెంబ్లీ సెగ్మెంట్లలో 11 స్థానాల్లో ఎన్‌డిఎ ఆధిక్యంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలోని నెమోమ్, వట్టియూర్కావు, కజక్కూట్టం, అలాగే అట్టింగల్‌లోని అట్టింగల్, కట్టక్కడ, ప్రస్తుతం ఎల్‌డిఎఫ్ ఎమ్మెల్యేలున్న త్రిసూర్ నియోజకవర్గంలోని మనలూర్, నట్టిక, ఒల్లూరు, ఇరింజలక్కుడ, పుత్తుక్కడ్‌లలో ఎన్‌డిఎ అభ్యర్థులు మొదటి స్థానంలో నిలిచారు.
అలాగే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. 2024 లోక్‌సభ ఎన్నికల ట్రెండ్‌ల ప్రకారం 110 అసెంబ్లీ సెగ్మెంట్లలో UDF ఆధిక్యంలో ఉండగా, LDF 19 సెగ్మెంట్లలో ఆధిక్యంలో ఉంది. తులనాత్మకంగా, 2019 లో, UDF 123 సెగ్మెంట్లలో ఆధిక్యంలో ఉంది.
ఉప్పెనకు కారణం
ప్రభావవంతమైన ప్రచారం.. BJP గ్రౌండ్-లెవల్ పని ఆ పార్టీ క్రమంగా పుంజుకోవడానికి కారణమైందని ఒక అంచనా. బిజెపి వైఖరి, ఓటర్ల నిర్దిష్ట స్థానిక సమస్యలు కూడా తోడయ్యాయి. ముఖ్యంగా త్రిసూర్‌లో, సిపిఐ(ఎం) నాయకులు ప్రమేయం ఉన్న కరువనూరు సహకార బ్యాంకు మోసానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో సురేష్ గోపి ప్రజల పక్షాన పోరాడారు.
సురేష్ గోపి 2019-20 నుంచి ముందస్తు ప్రణాళికతో వ్యవహరించారు. తనకు తోడుగా నిఫుణులు, సమర్ధవంతమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను సమీకరించుకున్నారు. వారు కేంద్ర ప్రభుత్వ పథకాలు, గోపి చేపట్టిన సేవా కార్యక్రమాలను తీసుకుని నియోజకవర్గం మొత్తం ప్రచారం చేశారు.
"యుడిఎఫ్ ఓట్లలో పడిన కోత ఈసారి సురేష్ గోపికి గెలుపు కారణంగా చెప్పగలం, కాని వాస్తవం ఏమిటంటే, ముఖ్యంగా నాటిక, గురువాయూరు, పుతుక్కాడ్ వంటి సెగ్మెంట్లలో మేము కూడా కొంత ప్రాబల్యాన్ని కోల్పోయాము" అని సిపిఎం నాయకుడు కెవి అబ్దుల్ఖాదర్ అన్నారు. ఈయన గురువాయూరు మాజీ ఎమ్మెల్యే. మిగిలిన నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో యుడిఎఫ్ ఓట్లు భారీగా చీలిపోవడంతో కె మురళీధరన్ మూడో స్థానంలో నిలిచారు.
కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, వి మురళీధరన్ విషయానికొస్తే, వారు తిరువనంతపురం జిల్లాలో తమ దృష్టిని కేంద్రీ కరించారని చెప్పవచ్చు. ప్రజల్లో నిరంతరం ఉంటూ కేంద్ర సాయంగా చేస్తున్న ప్రాజెక్టులను వివరించారు. ముఖ్యంగా తిరువనంతపురం, అట్టింగల్ నియోజకవర్గాలలో ప్రచారం ఉధృతంగా చేశారు. ఆసక్తికరంగా, ఈ మంత్రులిద్దరూ తిరువనంతపురం స్థానికులు కాదు, ఉత్తర కేరళకు చెందినవారు. వారి రాజకీయ వ్యూహంలో భాగంగా ఇక్కడకు వచ్చారు.
“ఈ మంత్రులు కనీసం మూడు సంవత్సరాలు చురుకుగా పని చేశారు. వారు ఈ నియోజకవర్గాల్లో రెగ్యూలర్ గా ప్రచారం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా స్థానిక సంస్థలు,వ్యక్తులతో సంభాషించారు ” అని ఒక I&B అధికారి తెలిపారు.
అలప్పుజాలో శోభా సురేంద్ర ఎదుగుదల మరొక ఆందోళనకరమైన అంశం, ఎందుకంటే ఆమె సంపాదించిన ఓట్ బేస్ వామపక్షాలు, కాంగ్రెస్‌లకు హిందూ ఓట్ బేస్ క్షీణించడంతో నేరుగా సంబంధం ఉందనే చెప్పవచ్చు.
కెసి వేణుగోపాల్ ఈసారి మైనారిటీ ఓట్లను విజయవంతంగా ఆకర్షించారు, సిపిఎంకు చెందిన సిట్టింగ్ ఎంపి ఎఎం ఆరిఫ్‌ను సమర్థవంతంగా ఓడించారు. వీటికి తోడు, స్థానిక సీపీఐ(ఎం)లోని వర్గపోరు ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓట్లు పెరగడానికి దోహదపడుతోంది.
ఛిన్నాభిన్నమైన రాజకీయాలు..
బిజెపి ఓట్ల శాతం పెరగడం వల్ల ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్ వంటి సాంప్రదాయ రాజకీయ ముందు ముందు చాలా కష్టమైన అంశం కావచ్చు. ఇది కేరళలో మరింత విచ్ఛిన్నమైన రాజకీయాలకు దారితీయవచ్చు. ఇదే ధోరణి కొనసాగితే, కేరళలో ముక్కోణపు పోటీ ఉంటుందనేది సుస్పష్టం. ఇది జరగకుండా ఉండాలంటే పార్టీలన్నీ తమ విధానాలను పూర్తిగా సమీక్షించుకోవాలి. ఓటర్లను ఆకర్షించడానికి సరికొత్త విధానాలు రూపొందించాలి. దీనికి తగిన వ్యూహాలు అవసరం.
మొత్తంమీద, బిజెపి సీట్ల సంఖ్య భారీ విజయాన్ని ప్రతిబింబించనప్పటికీ, ఓట్ల శాతం పెరగడం కేరళలో మారుతున్న రాజకీయానికి స్పష్టమైన సూచిక. రానున్న ఎన్నికల్లో ఇది ఏ విధంగా మారుతుందో, ఇతర పార్టీలు ఎలాంటి వ్యూహాలు పన్నుతాయన్నది ఆసక్తికరంగా మారింది.
Read More
Next Story