
మైనర్ బాలికకు బలవంతంగా మసీద్ లో పెళ్లి
పెళ్లి హజరైన వక్ఫ్ బోర్డు సభ్యుడు
కర్నాటకలో వక్ఫ్ బోర్డు సభ్యుడు అనిపాల్యలోని ఒక మసీద్ లో 16 ఏళ్ల బాలికకు బలవంతంగా జరిగిన వివాహం వేడుకలలో పాల్గొన్నందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
ఈ మైనర్ వివాహం సెప్టెంబర్ 26న జరిగినట్లు తేలింది. ప్రభుత్వం అధికారి ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 29న అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో బాల్య వివాహా నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడిందని బాలిక తల్లిదండ్రులు బలవంతంగా వివాహం చేశారని విచారణలో తేలింది.
‘‘మూడో పక్షం నుంచి మాకు ఫిర్యాదు అందింది. మేము చైల్డ్ వేల్పేర్ కమిటీకి సూచించాము. వారి నివేదిక తరువాత మేము కేసు నమోదు చేసాము. చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాము’’ అని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
న్యాయవాదీ హుస్సేన్ ఓవైస్, డీజీ అండ్ ఐజీపీ ఎంఏ సలీం, బెంగళూర్ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ లకు ప్రత్యేక ఫిర్యాదు రాశారు. అక్రమ వివాహం కేసును హైలైట్ చేశారు. ఫిర్యాదులో సుజాత్ అలీ, హసన్ రజా, వక్ఫ్ బోర్డు సభ్యుడు మీర్ కైమ్ వివాహాన్ని నిర్వహించిన వేడుకలో ఉన్నారు.