మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. ఇది మనకు అవసరమా?
దేశంలోని కొంతమంది సంపన్నులు విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడంపై ప్రధాని మోదీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
దేశంలోని విలువైన మారక ద్రవ్యం డెస్టినేషన్ వల్ల విదేశాలకు తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లిళ్ల సీజన్ వల్ల దేశంలో దాదాపు రూ . 5 లక్షల కోట్ల విలువైన వ్యాపారం జరగుతుందని కొన్ని ప్రముఖ వాణిజ్య సంస్థలు అంచనావేస్తున్నాయని చెప్పారు. ఆదివారం ఆయన మన్ కీ బాత్ లో ప్రసంగించారు.
స్థానికంగా వివాహలు జరిగితే పెళ్లిళ్ల షాపింగ్ దేశంలోనే చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. దీనివల్ల స్థానికంగా తయారయ్యే వస్తువులు, ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని తద్వారా పేదలకు మేలు జరగుతుందని ప్రధాని సూచించారు.
నిరుపేదలు కూడా తమ పిల్లలకు వోకల్ ఫర్ లోకల్ గురించి గొప్పగా చెబుతున్నారు. మీ పిల్లల పెళ్లి గురించి కూడా వారు గొప్పగా చెబుతారు. పెళ్లిలలో స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వండి. దీని గురించి నా కుటుంబ సభ్యులకు తప్ప ఇంక ఎవరికీ చెప్పాలని దేశ ప్రజలకు వివరించారు. దేశంలోకి 140 కోట్ల మంది ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నాయని తమ పాలన గురించి చెప్పారు.
దేశంలో వివిధ పండగల వల్ల వచ్చే ఆదాయం ఎంతంటే..
దేశంలో పండుగల సీజన్ వల్ల దాదాపు రూ. 32 బిలియన్ల విలువైన వ్యాపార లావాదేవీలు జరగుతాయని 2022 నాటి ఆర్థిక గణాంకాలను చూస్తే తెలుస్తుంది. దీనిలో వినాయక చవితి సందర్భంగా దాదాపు రూ. 45 వేల కోట్ల నుంచి రూ. 50 వేల కోట్ల వరకూ వ్యాపారం జరగుతుందని అంచనా. తరువాత ముఖ్యమైనా పండగ అయినా దీపావళి సందర్భంగా రూ. 1.50 లక్షల కోట్లు, అందులో ఒక్క ధన్ తేరాస్ రోజునే రూ. 50 వేల కోట్ల మేర బిజినెస్ జరగుతుంది.
అంతకు ముందు దేశంలో తయారైన వస్తువులకు బదులు చైనా ఇతర దేశాల నుంచి వస్తువులు పండుగల సందర్భంగా దిగుమతి చేసుకునేవారు. అయితే గల్వాన్ ఘటన తరువాత దేశంలోకి చైనా వస్తువులకు ప్రవేశం అనధికారికంగా నిషేధించారు. ఇలా చేయడం వల్ల 2022 దీపావళి సందర్భంగా దాదాపు రూ. 50 వేల కోట్ల నష్టం చైనాకు ఒక్క టపాకాయల విభాగంలో సంభవించింది. అది ఈ ఏడు ఇంకా పెరిగి దాదాపు లక్ష కోట్లుకు చేరినట్లు కొన్ని వాణిజ్య సంస్థలు తెలియజేస్తున్నాయి. ఆ మేరకు దేశానికి లక్ష కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది.