ఏఐఏడీఎంకే పళనిస్వామికి కౌంటర్ ఇచ్చిన ‘మురసోలి’
x
చెన్నై తేనాంపేటలోని అమ్మ క్యాంటీన్లో భోజనం నాణ్యతను పరిశీలిస్తున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్

ఏఐఏడీఎంకే పళనిస్వామికి కౌంటర్ ఇచ్చిన ‘మురసోలి’

అమ్మ క్యాంటీన్లలో భోజన నాణ్యతను పరిశీలించిన సీఎం స్టాలిన్‌పై ఏఐఏడీఎంకే పళనిస్వామి విమర్శలు గుప్పించారు. ఇంతకు ఆయన ఏమన్నారు? కౌంటర్ ఎలా ఇచ్చారు?


ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఇటీవల చెన్నైలో ఒక అమ్మ క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించారు. మరుసటి రోజు ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఆయనపై ఆరోపణలు గుప్పించారు. అమ్మ క్యాంటీన్‌ను సీఎం స్టాలిన్‌ తనిఖీ చేయడం కేవలం డ్రామా అని పేర్కొన్నారు. ఆహారంలో నాణ్యత తగ్గిందని, సిబ్బంది సంఖ్య కూడా మూడింట ఒక వంతు తగ్గించేశారని మాజీ సీఎం పళనిస్వామి ఆరోపించారు. ఒక్క చెన్నైలోనే ఏఐఏడీఎంకే హయాంలో (2011-21) 407 అమ్మ క్యాంటీన్లు ఉండేవని, వాటి సంఖ్యను పెంచడానికి బదులు 9 క్యాంటీన్లను (చెన్నైలో) ఎందుకు మూసివేశారని అని ప్రతిపక్ష నేత ప్రశ్నించారు.

పళనిస్వామి చేసిన ఆరోపణలకు డిఎంకే అధికారిక తమిళ పత్రిక 'మురసోలి' తన సంపాదకీయంలో కౌంటర్ ఇచ్చింది. అన్నాడీఎంకే హయాంలో దశలవారీగా మూతపడిన అమ్మ క్యాంటీన్ల గురించి మాట్లాడే హక్కు పళనిస్వామికి ఉందా? అని ప్రశ్నించింది. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి (2017-21) కంటే డీఎంకే హయాంలో క్యాంటీన్లు బాగా నడిచాయని సంపాదకీయంలో రాసుకొచ్చారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు..అమ్మ క్యాంటీన్ల నిర్వహణలో నష్టాలపై సిఎం అధ్యయనం చేస్తున్నారని, నష్టాల కారణంగా కొన్ని క్యాంటీన్లు మూసేస్తున్నామని అప్పటి ఆర్థిక కార్యదర్శి చెప్పారని, తన హయాంలో నష్టాలను సాకుగా చూపి దశలవారీగా అమ్మ క్యాంటీన్‌లను మూసివేయించిన పళనిస్వామికి అమ్మ క్యాంటీన్ల గురించే మాట్లాడే నైతిక హక్కు లేదని పేర్కొంది.

మూడేళ్లలో రూ. 450 కోట్లు..

అమ్మ క్యాంటీన్లు (తమిళంలో అమ్మ ఉనవగం) 2013లో దివంగత ముఖ్యమంత్రి జె జయలలిత ప్రారంభించారు. ఏఐఏడీఎంకే పాలనలో (2011-21) ఈ పథకం ఎంతో ప్రజాదరణ పొందింది. మే 7, 2021న స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే అధికారం పగ్గాలు చేపట్టింది. జూలై 19న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన తర్వాత స్టాలిన్ ఇలా అన్నారు "గత మూడేళ్లలో రూ. 450 కోట్లకు పైగా ఖర్చు చేసి మా ప్రభుత్వం రోజుకు సుమారు లక్ష మంది ఆకలి తీరుస్తుంది. చెన్నైలోని క్యాంటీన్ల కోసం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ద్వారా ₹450 కోట్లకు పైగా (2021 మే నుండి ఇప్పటి వరకు) ఖర్చు చేస్తున్నట్లు’’ సీఎం పేర్కొన్నారు.

తమిళనాడు అంతటా రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీల మద్దతుతో అమ్మ క్యాంటీన్లను నిర్వహిస్తున్నారు. ఇడ్లీ ధర రూ. 1 (ఒకటి), పెరుగు అన్నం రూ. 3 (ప్లేట్‌) ఇతర ఆహార పదార్థాలు ఒక్కో ప్లేట్ ధర రూ5.లుగా నిర్ణయించారు.

Read More
Next Story