తన ప్రపోజ్ లను తిరస్కరించినందుకు..
నేహ హిరేమత్(23) హుబ్బలిలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె సీనియర్, కాలేజీ పూర్వ విద్యార్థి ఫయాజ్ ఖోండునాయక్ చేసిన ప్రపోజల్ ను ఆమె తిరస్కరించింది. ఉన్మాదిగా మారిన ఫయాజ్ ఏడు సార్లు కత్తితో పొడిచి నేహాను క్రూరంగా హత్య చేశాడు. ఒక పోలీసు అధికారి ప్రకారం, ఫయాజ్, నేహ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే ఆమె అతన్ని కొన్ని రోజులుగా దూరం పెడుతోంది.
రాజకీయ దుమారం..
కాంగ్రెస్ దీనిని ఒక సంఘటనగా చిత్రీకరిస్తుండగా, ఈ హత్య రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని విషయాన్ని నిరూపిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటన వెనక లవ్ జిహాద్ ఉందని కేంద్రమంత్రి, ధార్వాడ్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి ప్రహ్లద్ జోషి అనుమానం వ్యక్తం చేశారు. కర్ణాటకలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించిన ఆయన, మైనారిటీలను బుజ్జగించే రాజకీయాలను ఆపాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. అయితే లవ్ జిహాద్ కోణాన్ని హోంమంత్రి జి పరమేశ్వర ఖండించారు.
అమ్మాయి తండ్రి ప్రకారం..
నిందితులు తన కూతురిని ట్రాప్ చేసేందుకు ప్లాన్ చేశారని కాంగ్రెస్ కార్పొరేటర్, యువతి తండ్రి నిరంజన్ హిరేమత్ ఆరోపించారు. ఈ ముఠా చాలా కాలంగా కుట్ర పన్నుతోందని.. ఆమెను హత్యచేయాలని లేదా ఉరితీయాలని ప్లాన్ చేశారనీ అన్నారు. అయితే వారి బెదిరింపులను తన కూతురు లెక్కచేయలేదని ధైర్యంగా ఉండడంతో ఇప్పుడు హత్యకు గురైందని అన్నారు.
‘‘నా కూతురికి ఏమైందో రాష్ట్రం, దేశం మొత్తం చూసింది.. వాళ్లు పర్సనల్ అని చెబితే ఇందులో పర్సనల్ ఏముంది.. వాళ్లిద్దరూ నా బంధువులా? అతను ప్రశ్నించాడు.
శివకుమార్ సమర్థన
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో హిందూ యవతులకు రక్షణ లేదంటూ ఘూటుగా విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. కర్ణాటకలో శాంతిభద్రతలు బాగున్నాయని శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని పేర్కొంటూ కర్ణాటకలో గవర్నర్ పాలన విధించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది.
‘బీజేపీ మమ్మల్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తోంది.. కర్ణాటకలో శాంతిభద్రతలు బాగానే క్షీణించాయనే నెపంతో.. గవర్నర్ పాలన విధించబోతున్నామని ఓటర్లకు చెప్పాలని చూస్తున్నారని’ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.
విద్యార్థుల నిరసనలు
బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న విద్యార్థి కార్యకర్తలు హుబ్బళ్లిలోని పోలీస్‌స్టేషన్ ఎదుట నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మరికొన్ని చోట్ల ఇలాంటి నిరసనలు వెల్లువెత్తాయి.