మైసూర్: రాజవంశం వర్సెస్ సిద్దరామయ్య
మైసూర్ ఎంపీ సీట్ పై సీఎం సిద్ధరామయ్య ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఈ స్థానంపై బీజేపీ రాజకుటుంబాన్ని రంగంలోకి దింపింది. కాంగ్రెస్ మాత్రం..
కర్నాటకలో మైసూర్ లోక్ సభ స్థానం పై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీఎం సిద్దరామయ్య స్వయంగా ఇక్కడకు వచ్చి పార్టీ ప్రణాళికలను పర్యవేక్షించారు. ఇక్కడ పోటీ.. సీఎం కు, రాజకుటుంబానికి మధ్య పోరుగా కనిపిస్తోంది.
మార్చి 24 నుంచి నాలుగు రోజుల పాటు, సిద్ధరామయ్య తన సొంత జిల్లా అయినా మైసూరులో విడిది చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నికల సన్నాహాలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్థానంలో మాజీ మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్‌ను రంగంలోకి దింపింది.
'కామన్ మ్యాన్ వర్సెస్ రాజా '
కాంగ్రెస్ కర్నాటక అధికార ప్రతినిధి ఎం. లక్ష్మణ ఇక్కడ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. కొంతమంది నాయకులు దీనిని కామన్ మ్యాన్ వర్సెస్ రాజుగా అంచనా వేస్తున్నారు. మైసూరు లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్టీ ఆఫీస్ బేరర్‌లతో సిద్ధరామయ్య పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. సిద్ధరామయ్య మైసూరు జిల్లాలో వరుణ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మైసూరు యుద్ధం
'మైసూర్ యుద్ధం' అంత తేలికైనది కాదు -- ఇది ' రాయల్ యుద్ధం', గా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఇక్కడ సిఎంతో పాటు మైసూరు రాజకుటుంబానికి మంచి పలుకుబడి ఉంది. ఇక్కడ రాజు తన హోదాకి అనుగుణంగా ప్రచారం చేశారు. ఆయన ప్రత్యర్థి లక్ష్మణుడు మైసూరు ప్రాంతంలో ఆధిపత్యం వహించే వొక్కలిగ వర్గానికి చెందినవాడు. సిద్ధరామయ్య వొక్కలిగ వ్యతిరేకి అని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ తరచూ ఆరోపిస్తున్నందున కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వడం ద్వారా బిజెపికి తగిన సమాధానం ఇచ్చిందని ఆయన అన్నారు.
వొక్కలిగ కార్డు
వొక్కలిగకు చెందిన ప్రతాప్ సింహాకు బిజెపి టిక్కెట్ నిరాకరించిందని, పాత రాజకుటుంబం నుంచి వడియార్‌కు ప్రాధాన్యత ఇస్తోందని కాంగ్రెస్ తన ప్రచారాన్ని ప్రారంభించింది. తాము ఒక్కలిగ సామాజిక వర్గానికి మద్దతునిస్తుమనే అంశాన్ని కాంగ్రెస్ ఆ వర్గంలోకి తీసుకెళ్తోంది.
'కామన్ మ్యాన్ వర్సెస్ రాజా' అనే కాంగ్రెస్ నినాదంపై, వడియార్ స్పందించారు. ప్రజాస్వామ్య భారతదేశంలో ఎవరూ రాజులు కాదని, చట్టం దృష్టిలో అందరూ సమానులేనని అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో అన్ని సీట్లను తాను ప్రతిష్మాత్మకంగా తీసుకున్నానని సీఎం సిద్ధరామయ్య అంటున్నారు. అన్ని అంశాలను సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే ఇటీవల పార్టీ ఆఫీస్ బేరర్‌లతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ, వడియార్‌పై ఎటువంటి కించపరిచే లేదా పరువు నష్టం కలిగించే పదజాలం ఉపయోగించవద్దని ముఖ్యమంత్రి 'స్పష్టమైన ఆదేశాలు' ఇచ్చారని, తెలిసింది.
మైసూరు లోక్‌సభ నియోజకవర్గం మైసూరు, కొడగు రెండు జిల్లాలలో విస్తరించి ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు, జేడీ(ఎస్) రెండు, బీజేపీ ఒక సీటు గెలుచుకుంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, ఆ పార్టీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి కూడా విజయం సాధించారు. కూటమిలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, జేడీ(ఎస్)లు ఒక్కో సీటు గెలుచుకున్నాయి.
ఈసారి, నియోజకవర్గంలో గణనీయమైన ఓట్లను కలిగి ఉన్న జెడి(ఎస్) బిజెపితో పొత్తు పెట్టుకుంది, ఈ చర్య వడియార్‌కు రాజకీయ అరంగేట్రంలో చిన్న స్థాయిలో ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
Next Story