
ఐఏఎఫ్ అధికారిపై చర్యలొద్దు: కర్ణాటక హైకోర్టు
ఈ నెల 21న కన్నడ మాట్లాడలేదని దాడి చేశారని ఆరోపించిన ఐఏఎఫ్ అధికారి, అలాంటిదేమీ లేదన్న పోలీసులు
రోడ్డు ఘర్షణపై ఐఏఎఫ్ అధికారి శిలాదిత్య బోస్ పై బలవంతపు చర్యలొద్దని కర్ణాటక హైకోర్టు బెంగళూర్ పోలీసులను ఆదేశించింది. ఈ నెల 21న ఓల్డ్ మద్రాస్ రోడ్డు సమీపంలోని జరిగిన రోడ్డు ఘర్షణపై కాల్ సెంటర్ ఉద్యోగి వికాస్ కుమార్ ఐఏఎఫ్ అధికారిపై ఫిర్యాదు చేశారు.
‘‘పోలీసులు ఎటువంటి బలవంతపు చర్య తీసుకోకూడదు. చట్టబద్దమైన విధానాన్ని పాటించకుండా పిటిషనర్ కు సమన్లు జారీ చేయకూడదు. పిటిషనర్ అయిన బోస్ కూడా దర్యాప్తు కు సహకరించాలి. ఈ కోర్టు అనుమతి లేకుండా చార్జీషీట్ సమర్పించకూడదు.’’ అని న్యాయమూర్తి గురువారం తన ఉత్తర్వూలో పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్ పై సవాల్..
బీఎన్ఎస్ సెక్షన్ 109(హత్యాయత్నాం), 115(2) (గాయపరచడం) 304 స్నాచింగ్, 324 (దుర్వినియోగం), 352 (ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నగర కోర్టు ముందుకు తీసుకొచ్చారు. వీటిని బోస్ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
మొదట్లో కన్నడ భాషలో మాట్లాడనందుకు తనపై దాడి జరిగిందని ఐఏఎఫ్ అధికారి సోషల్ మీడియాలో రక్తం కారుతున్న వీడియోలతో ఆరోపణలు గుప్పించాడు. అయితే సీసీటీవీ ఫుటేజీ తరువాత అతను హింసను ప్రేరేపించాడని పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నడ అనుకూల సంఘాలు కాల్ సెంటర్ ఉద్యోగికి మద్దతుగా నిలిచి అతన్ని అరెస్ట్ చేయాలని కోరాయి.
కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని బెంగళూర్ నగర పోలీసులను ఆదేశించారు. ‘‘ఈ ఘటనలో పాల్గొన్న వ్యక్తుల హోదాతో సంబంధం లేకుండా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ కమిషనర్ ను ఆదేశిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. బాధితులకు న్యాయం జరగడానికి ప్రభుత్వం కట్టబడి ఉంది’’ అని ఆయన ఏప్రిల్ 22న ఎక్స్ లో సుదీర్ఘంగా పోస్ట్ చేశారు.
సంఘటన గురించి..
ఏప్రిల్ 21న ఉదయం ఐఏఎఫ్ అధికారి భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమిత దత్తా నడుపుతున్న కారు, 27 ఏళ్ల వికాస్ కుమార్ మెటార్ సైకిల్ తో వచ్చి రోడ్ ప్రమాదానికి కారణమయ్యాడు. స్క్వాడ్రన్ లీడర్ దత్తా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు బెంగళూర్ పోలీసులు ఆమె భర్త పైనే దాడి కేసు నమోదు చేసి సాయంత్రం కుమార్ ను అరెస్ట్ చేశారు. తనకు కన్నడ రాకపోవడంతో నే దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే కుమార్ పై ప్రతి ఫిర్యాదు అందింది. దీనిపై సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కుమార్ తనతో గొడవకు దిగవద్దని హెచ్చరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. స్థానిక పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ప్రకారం రోడ్డుపై జరిగిన ఘర్షణగా తేల్చి కుమార్ ను ఐఏఎఫ్ అధికారిని రోడ్డుపై కొట్టినట్లు తేల్చారు.
Next Story