భక్తుల నుంచి ఎలాంటి విరాళాలు స్వీకరించరాదు : కేరళ హైకోర్టు
x

భక్తుల నుంచి ఎలాంటి విరాళాలు స్వీకరించరాదు : కేరళ హైకోర్టు

స్వీకరించిన వాటికి ఆడిట్ చేసి లెక్కలు చెప్పాలని ఆదేశాలు


వార్షిక ఉత్సవం లేదా అలాంటి కార్యక్రమాల కోసం ప్రజల నుంచి విరాళం లేదా స్పాన్సర్ షిప్ వసూలు చేయడానికి ఏ సంస్థ లేదా భక్తుల సమూహానికి అనుమతి లేదని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. ముందుగా ఆలయాల నిర్వాహాకులు ఈ విషయాన్ని నిర్ధారించుకోవాలని ట్రావెన్ కోర్ దేవస్థానాన్ని ఆదేశించింది.

ఒకవేళ ఇలాంటి విరాళాలు సేకరించిన డబ్బుకు సంబంధించి ఆలయ కమిటీ వాటిని సరిగ్గా లెక్కించి, ఆడిట్ చేయాలని న్యాయమూర్తులు అనిల్ కే నరేంద్రన్, మురళీ కృష్ణలతో కూడిన ధర్మాసనం బోర్డును ఆదేశించింది.
కొల్లం జిల్లాలో ఇటీవల జరిగిన ఆలయ ఉత్సవంలో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) జెండాల ప్రదర్శన, సీపీఎం ను కీర్తిస్తూ పాటల ప్రదర్శనను హైలైట్ చేస్తూ న్యాయవాదీ విష్ణు సునీల్ పంథాలం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ విధంగా ఆదేశాలు జారీచేసింది.
ఓ ఆలయం వద్ద వేడుక జరుగుతున్నప్పుడూ రాజకీయ పాటలు పాడుతూ కమ్యూనిస్టు జెండాలను ప్రదర్శించడం సందర్భానుసారంగా జరగడం లేదని, ఇవి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని పిటిషన్ లో ఫిర్యాదుదారు ఆరోపించారు. కోర్టుకు ఆయన వాదనలను అంగీకరించింది. ఇది భక్తుల మనోభావాలను గాయపరుస్తుందని వ్యాఖ్యానించింది.
కొల్లంలోని కడక్కాడ్ ఆలయంలో కనిపించిన కార్యక్రమాన్ని ఇక ముందు కొనసాగించకూడదని బుధవారం తన ఉత్తర్వూలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ట్రావెన్ కోర్ ఆధీనంలో ఉన్న ఆలయంలోని సలహ కమిటీ వార్షిక ఉత్సవం లేదా ఆలయంలో జరిగే ఏదైనా వేడుక నిర్వహణకు సంబంధించిన భక్తుల నుంచి డబ్బు వసూలు చేయడానికి అసిస్టెంట్ కమిషనర్ ముద్రతో కూడిన రశీదులను మాత్రమే ఉపయోగించాలని ధర్మాసనం పేర్కొంది.
‘‘ఇటువంటి డబ్బు స్వీకరణ అనేది దేవుడి పేరుతో జరుగుతుంది. కాబట్టి స్పాన్సర్ షిప్ ద్వారా సేకరించిన డబ్బును చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి’’ అని కోర్టు ఆదేశించింది.
ఆలయం పరిసరాల్లో ముఖ్యంగా వేడుకలు జరుగుతున్నప్పుడూ ఇలాంటి రాజకీయ కార్యక్రమాలు చేయడం భక్తుల మనోభావాలను గాయపరుస్తుందని కాబట్టి ఇతరులకు బాధ కలిగించే కార్యక్రమాలు చేయరాదు అని మరో న్యాయవాదీ జోమీ జోస్ తను దాఖలు చేసిన మరో పిటిషన్ లో పేర్కొన్నారు.
మార్చి 10న కడక్కల్ ఆలయ ఉత్సవం సందర్భంగా గాయకుడు అలోషి ఆడమ్స్ కొన్ని విప్లవాత్మక పాటలను పాడారు. అందులో ఒకటి కేరళను కుదిపేసిన 1994 కూతపరంబ పోలీస్ కాల్పుల ఘటనకు సంబంధించి నుంచి బయటపడిన దివంగత సీపీఎం సభ్యుడు పుత్తుకుడి పుష్పన్ ను ప్రస్తావించారు. పాటల సమయంలో ఆలయం దగ్గర డీవైఎఫ్ఐ, సీపీఎం జెండాలు చిహ్నాలు భారీ స్థాయిలో ప్రదర్శించారు.
Read More
Next Story