ఏపీలో రోడ్డు ప్రమాదానికి గునైన బస్‌

బ్లాక్‌స్పాట్స్‌ అలైన్‌మెంట్‌ మార్చాలి


బ్లాక్‌స్పాట్స్‌ అలైన్‌మెంట్‌ మార్చాలి

బ్రెసిలియా ఒప్పదం బుట్ట దాఖలు
మెయింటెనెన్స్‌ నిత్యం ఉండాలి
కాలం చెల్లిన బస్‌లు ఆపివేయాలి
మనిషి ప్రాణానికి విలువివ్వని ప్రభుత్వాలు
(జి.పి. వెంకటేశ్వర్లు)
భారత దేశంలో ప్రయాణికుల ప్రాణాలకు భద్రత లేదు. భయాన్ని పోగొట్టే కార్యాచరణ ప్రభుత్వాలు చేయడం లేదు. దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా సంవత్సరానికి 1.25 లక్షల మంది దుర్మరణం పాలవుతున్నారు. ఇందుకు కారకులు పాలకులేనని రవాణారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ బస్‌స్టేషన్‌లో ఇటీవల ప్లాట్‌ఫారంపైకి ఏసీ బస్‌ దూసుకెళ్లి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. అదేరోజు కడప బస్‌స్టేషన్‌లో బ్రేక్‌ ఫెయిల్‌ అయి బైక్‌పై కూర్చుని ఉన్న ఇద్దరు యుకులను బస్‌ ఢీకొట్టింది. గాయాలతో వారు తప్పించుకున్నారు. ఆరోజునే అనంతపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆర్టీసీ బస్సు డివైడర్‌పైకి దూసుకుపోవడంతో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. విశాఖ నగరంలో చిన్న పిల్లలు మృత్యువాత పడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ ప్రమాదాలు జరిగి ప్రయాణికులు దుర్మరణం పాలవుతున్నారు.
మెయింటెనెన్స్‌లో నిర్లక్ష్యం
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బస్‌లతో పాటు చాలా కాలంనాటి పాత బస్‌లు కూడా ఆర్టీసీ డిపోల్లో ఉన్నాయి. ఈ బస్‌లకు మెయింటెనెన్స్‌ సరిగా లేదని పలు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. బస్‌ల్లో ఎన్నో రకాల ట్రబుల్స్‌ ఉంటాయని, మెయింటెనెన్స్‌కు కూడా డబ్బులు లేకుంటే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు.
బ్రెసిలియా కన్వెన్షన్‌ మాటేమిటి?
బ్రెజిల్‌లో 2013లో రోడ్డు ప్రమాదాలపై బ్రెసిలియా కన్వెన్షన్‌లో పలు దేశాల అధినేతలు చర్చించారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాలు లేని దేశాలుగా ఉండాలని కొన్ని దేశాలు శపథం చేశాయి. ఆ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేశాయి. అందులో భారతదేశం కూడా ఉంది. ఏమైంది.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రమాదాన్నైగా గుర్తించి ఆపగలిగారా? ఎక్కడ లోపం ఉంది? ఎవరు కారకులు అనేది ప్రజలు గుర్తించాలని రోడ్డు, రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటిలో జరిగిన కాన్ఫరెన్స్‌కు నేటి కేంద్ర మంత్రి గడ్గరీ కూడా హాజరయ్యారు.
విదేశాల్లో మనిషి ప్రాణానికి ఉన్న విలువ భారత దేశంలో లేదు
కొన్ని దేశాల్లో రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన కుటుంబాల వారిని శాశ్వత ప్రాతిపదికన ఆదుకుంటున్నారు. ఉదాహరణకు బ్రిటన్‌లో రోడ్డు ప్రమాదానికి గురై ఎవరైనా మరణిస్తే ప్రధాన మంత్రి ఆకుటుంబం వద్దకు వెళ్ళి వారిని పరామర్శించడంతో పాటు కావాల్సిన సౌకర్యాలు ఆకుటుంబానికి కల్పిస్తారు. జర్మనీలో జీవిత కాలం ఆ కుటుంబాన్ని ప్రభుత్వం పోషిస్తుంది. అమెరికాలో అయితే యాక్సిడెంట్‌ చేసిన వ్యక్తి లైసెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేస్తుంది. బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వడమే కాకుండా ఆదుకుంటారు. దురదృష్ట వశాత్తు భారతదేశంలో ఆ పద్ధతులు అమలు కావడం లేదు.
బ్లైండ్‌ స్పాట్స్‌ ఎందుకు మారటం లేదు?
రహదారుల్లో బ్లైండ్‌ స్పాట్స్‌ను ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ బ్లైండ్‌ స్పాట్స్‌ సుమారు 465 వరకు ఉన్నాయి. ఈ స్పాట్స్‌లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు డిజైన్‌లో మార్పు వస్తే తప్ప ప్రమాదాలు ఆగే అవకాశం లేదు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో బ్లైండ్‌ స్పాట్స్‌ అధికంగా ఉన్నాయి. గుడ్‌ స్ట్రక్చరల్‌ డిజైన్‌ ఆఫ్‌ ది రోడ్డు (ఎౌౌఛీ ట్టటuఛ్టిuట్చ∙ఛ్ఛీటజీజn ౌజ ్టజ్ఛి ట్చౌఛీ) ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదాలకు నివారణ ఉంటుందనేది నిపుణుల అభిప్రాయం.
అలర్ట్‌ మెకానిజం వల్ల ఉపయోగం ఏమిటి?
ఆర్టీసీలోనూ, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లోనూ అమితమైన వేగంతో వెళుతుంటే ఎక్కువ వేగంతో వెళుతున్నారని అలర్ట్‌ చేసే మెకానిజం ఉంది. వాహనానికి మినిమం వేగం నిర్థారించిన తరువాత కూడా వాహనాలు నడిపే వారు అంతకంటే వేగంగా వెళుతున్నారు. దాని వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని ఒక పరిశీలనలో వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ, ఆర్టీసీ మాజీ ఎండీ నండూరి సాంబశివరావును ఫెడరల్‌ ప్రతినిధి రోడ్డు ప్రమాదాలపై మాట్లాడాల్సిందిగా కోరగా బ్లాక్‌స్పాట్స్‌ ఉన్న రోడ్లను పున ర్నిర్మించకుంటే ఈ ప్రమాదాలు ఆగవన్నారు. పాలకులకు చిత్తశుద్ధి ఉండాలన్నారు. నిబంధనలు అతిక్రమించి డ్రైవింగ్‌ చేసే వారి వాహనాన్ని ఆపి కనీసం రెండు గంటలు పక్కన ఉంచితే వారి ఆలోచన మారే అవకాశం ఉందన్నారు. లేదంటే బండిని పక్కనబెట్టి నడిచిపోవాలని ఆదేశించాలన్నారు. ఫైన్‌లు వేయడం వల్ల ఉపయోగం లేన్నారు.






Next Story