దక్షిణాది రాష్ట్రాలలో ఏనుగుల ఎన్నంటే!
x

దక్షిణాది రాష్ట్రాలలో ఏనుగుల ఎన్నంటే!

దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగుల సంఖ్యను లెక్కించడానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రతి ప్రాంతంలో కొత్త పద్దతులు వినియోగిస్తున్నారు.


దక్షిణాది రాష్ట్రాల్లో ఏనుగుల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఏనుగుల సంతతిని అంచనా వేయడానికి మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఈ కసరత్తు జరిగింది . రాష్ట్రంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలోనీ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణ, మానవ-జంతు సంఘర్షణలను అర్థం చేసుకోవడానికి, నియంత్రించడానికి వ్యూహాలను రూపొందించడానికి ఈ లెక్కింపు తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అటవీశాఖ సిబ్బంది అందరికీ శిక్షణ ఇచ్చి , మూడు రోజుల అంచనా వేయడానికి 3 విభిన్న పద్ధతులు ఉపయోగిస్తున్నారు.
మొదటి రోజు బ్లాక్‌ కౌంట్‌ పద్ధతిని ఉపయోగించారని, దీనిలో ఏనుగులను ప్రత్యక్షంగా చూసేందుకు 15కిలోమీటర్ల జిగ్‌జాగ్‌ ట్రాక్‌ను పర్యవేక్షిస్తారు. రెండో రోజు లైన్‌ ట్రాన్సెక్ట్‌ పద్ధతిలో పేడ వంటి పరోక్ష సాక్ష్యాధారాల కోసం 2కిలోమీటర్ల దూరాన్ని పరిశీలిస్తారు. చివరి రోజున వాటర్‌ హౌల్‌ పద్ధతిని ఉపయోగిస్తారన్నారు. దీనిలో ఫీల్డ్‌ సిబ్బంది ఏనుగులను ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 గంటల వరకు చూసే అవకాశం ఉన్న వాటర్‌హౌల్స్‌ను పర్యవేక్షిస్తారు. ఏనుగులను బంధించడానికి కెమెరా ట్రాప్‌లను కూడా ఉపయోగిస్తారు . ఏనుగులు కదిలే మార్గాలు, ఏనుగుల జనాభా వర్గీకరణ, ఏనుగుల సంతతి ప్రక్రియను, ఏనుగు కారిడార్‌లను రూపొందించ డానికి ఆవాసాలను అర్థం చేసుకోవడానికి ఈ మూడు పద్ధతులు ఉపయోగపడతాయి.

ఏనుగులు జనావాసాల్లోకి వస్తున్న తీరును, పంటల ధ్వంసం, ఈ ఏనుగుల వల్ల మనుషులకు వస్తున్న సమస్యల తీవ్రతను అంచనా వేయడానికి ఈ లెక్కింపు కార్యక్రమం తోడ్పడుతుంది. తదనుగుణంగా నివారణ చర్యలు చేపట్టడం, ఏనుగుల సంతతిని కాపాడడానికి తీసుకోవాల్సిన విధి విధానాలను రూపొందించడానికి సహాయ పడుతుంది. చిత్తూరు ఫారెస్ట్ డివిజన్ లో 110 ఏనుగులు ఉన్నట్టు గుర్తించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో 30 వరకు ఏనుగులు ఉన్నట్టు గుర్తించారు.

Read More
Next Story