కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్దమైన ఒక్కలిగ, లింగాయత్ లు
x

కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్దమైన ఒక్కలిగ, లింగాయత్ లు

కులగణనను తీవ్ర వ్యతిరేకిస్తున్న ఈ రెండు ఆధిపత్య వర్గాలు


కర్ణాటకలోని రెండు అత్యంత ప్రభావవంతమైన కులాలైన ఒక్కలిగలు, లింగాయతులు కలిసి కూటమిలా ఏర్పాటు అయ్యేందుకు సంకేతాలు ఇస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గంలో సమర్పించిన కులగణన వివరాలను వ్యతిరేకించడానికి వారు సిద్దమవుతున్నారు.

ఈ వర్గాలతో పాటు కుల గణనను వ్యతిరేకిస్తున్న బ్రాహ్మణులు, ఇతర సమూహాలు కూడా రాష్ట్రవ్యాప్త కర్ణాటక బంద్ నిర్వహించాలని యోచిస్తున్నాయి. ముఖ్యంగా సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నివేదికను ఉపసంహరించుకోకపోతే, ప్రభుత్వ మనుగడ సాగించదని ఒక్కలిగ కమ్యూనిటీ అసోసియేషన్ హెచ్చరించింది.
అత్యవసర సమావేశం..
ఒక్కలిగ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు, సభ్యులు బెంగళూర్ లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం తరువాత అసోసియేషన్ అధ్యక్షుడు కెంచప్ప గౌడ మీడియాతో మాట్లాడారు.
కాంతరాజ్ కమిషన్ నివేదికను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చించడానికి కార్యానిర్వాహాక కమిటీ సభ్యులు సమావేశామయ్యారని చెప్పారు.
ఈ నివేదికను పూర్తిగా ఏకపక్షమైనదతో పాటు పక్షపాతంతో కూడినదని అని అభివర్ణించారు. దీనిని తయారు చేసిన దశాబ్దం తరువాత విడుదల చేశారని ఎత్తిచూపారు.
‘‘రాష్ట్రంలో కేవలం 60 లక్షల మంది ఒక్కలిగలు మాత్రమే ఉన్నారని నివేదిక పేర్కొంది.‘‘ కర్ణాటక లోని 224 నియోజకవర్గాలలో కేవలం 61 లక్షల మంది మాత్రమే ఉండటం నిజంగా సాధ్యమేనా? మా కమ్యూనిటీని ఆరో స్థానంలోకి నెట్టేశారు.
మునుపటి చిన్నప్పరెడ్డి కమిషన్ చాలా ఎక్కువ సంఖ్యలను నివేదించింది’’ ఈ సంఖ్యల తారుమారు కేవలం రిజర్వేషన్ ప్రయోజనాలను సర్ధుబాటు చేయడమే లక్ష్యంగా ఉందని ఆయన ఆరోపించారు.
ఒక్కలిగ, వీరశైవ- లింగాయత్ లతో సహ అన్యాయానికి గురైన ఇతర వర్గాలు కర్ణాటక అంతటా ఐక్య నిరసనను ప్రారంభిస్తాయని, లింగాయత్ వీరశైవ, బ్రాహ్మణ సంఘాల నాయకులు తమ దళాలలో చేరాలని వారిని సంప్రదించారని కూడా ఆయన పంచుకున్నారు.
వీరు కొత్త పారదర్శక జనాభా గణనను పిలుపునివ్వండి. ఈ నివేదికను మేము వ్యతిరేకిస్తున్నామని గౌడ అన్నారు. తాజా సమీక్ష అవసరమని సూచించారు.
‘‘చట్టబద్దంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా గణన నిర్వహించాలి. రాష్ట్రం కాదు.. కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి. అది తప్పనిసరిగా జరిగితే పారదర్శకతను నిర్ధారించుకోవడానికి జియో ట్యాగింగ్ టెక్నాలజీతో నిర్వహించాలి’’ అని ఆయన పునరుద్ఘాటించారు.
ఒక్కలిగ కమ్యూనిటీకి చెందిన మత పెద్దలతో అసోసియేషన్ సమావేశం అవుతుందని, ఈ కమ్యూనిటీ నుంచి ప్రయోజనం పొందిన ఒక్కలిగ ఎమ్మెల్యేలు, మంత్రులందరూ ఆందోళనలో పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు.
‘‘మేము ఖాళీగా కూర్చోము. మేము కొత్త సర్వేను డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రాన్ని స్తంభింపజేసే నిరసనను ప్రారంభించడానికి సిద్దంగా ఉన్నాము. వీరశైవ- లింగాయత్ సమాజాన్ని కూడా ఉద్యమాన్ని ఆహ్వనిస్తున్నాము. మేము వారితో చర్చలు జరుపుతున్నాము’’ అని ఆయన వెల్లడించారు.
స్వతంత్ర సర్వే..
రాష్ట్రంలోని ఒక్కలిగల వాస్తవ సంఖ్యను నిర్ణయించడానికి తమ బృందం స్వతంత్ర సర్వే నిర్వహిస్తుందని ఒక్కలిగ అసోసియేషన్ డైరెక్టర్ నెల్లిగెరే బాబు ప్రకటించారు. ‘‘దీనికోసం మేము కొత్త సాప్ట్ వేర్ ను సిద్దం చేస్తున్నాము. ఎంత ఖర్చయినా సరే మేము దానిని నిర్వహిస్తాము’’ అని ఆయన అన్నారు.
డీకే శివకుమార్ మద్దతు..
చాలా ముఖ్యమైన చర్చలలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒక్కలిగ, అసోసియేషన్ సభ్యులను కలిసి, తాను కూడా కులాన్ని వ్యతిరేకిస్తున్నాని చెప్పినట్లు తెలుస్తోంది.
అసోసియేషన్ నాయకుడు జయముత్తు మాట్లాడుతూ..‘‘తాను ఒక్కలిగ అసోసియేషన్ కు అండగా నిలుస్తున్నాను’’ అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కుల గణనను అమలు చేయకూడదని జయముత్తు అన్నారు.
ఇంకా అమలు చేయబడితే ఈ ప్రభుత్వం కొనసాగదని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఈ రోజు సాయంత్రం ఆరుగంటలకు డీకేఎస్ ఒక్కలిగ మంత్రులు, ఎమ్మెల్యేలతో అధికారికంగా సమావేశం నిర్వహించనున్నారు.
Read More
Next Story