మా ఎమ్మెల్యేలకి రూ. 50 కోట్లు ఆఫర్ చేశారు: కర్నాటక సీఎం
x
కర్నాటక ముఖ్యమంత్రి సీఎం సిద్దరామయ్య

మా ఎమ్మెల్యేలకి రూ. 50 కోట్లు ఆఫర్ చేశారు: కర్నాటక సీఎం

కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ద రామయ్య ఆరోపించారు.


కర్నాటక సర్కార్ ను కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ‘ఆపరేషన్ కమలం’లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఒక్కొక్కరి రూ. 50 కోట్ల ఆఫర్ చేస్తూ, ఎన్నికల్లో పోటీ చేస్తే జరిగే ఖర్చును మొత్తం భరిస్తామని ఆఫర్ చేస్తున్నారని సీఎం విమర్శించారు. ఇలా కర్నాటకలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని సిద్దరామయ్య ఆరోపించారు.

"అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టిన ధనవంతులు ప్రతిపక్ష పార్టీల్లోనే ఉన్నారా? బీజేపీలో ఎవరూ లేరా? వారే (బీజేపీ) అవినీతి పితామహులు, అవినీతి పేరుతో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నారు. " అని సిద్ధరామయ్య అన్నారు. ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన, గతంలో కర్ణాటకలో కూడా బీజేపీ ‘ఆపరేషన్ కమలం’కు పాల్పడిందని ఆరోపించారు.
"బిజెపి వాళ్లు ప్రత్యర్థి పార్టీల వాళ్లను రాజీనామాలు చేయండని ఇంతకుముందు చెప్పారు, తరువాత ఉప ఎన్నికలలో కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేశారు, రాజీనామా చేసిన వారికి కోట్ల రూపాయల డబ్బు ఇచ్చారు. ఈ రోజు కూడా బీజేపీ నాయకులు ఇదే ప్రయత్నంలో ఉన్నారు. కర్ణాటకలో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి, దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. మా ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్లు ఆఫర్ చేశారు, వారిని రాజీనామా చేయమని కోరారు, ”అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన వారికి కూడా సాయం అందిస్తామని కూడా బీజేపీ హమీ ఇచ్చిందని “రూ. 50 కోట్లు తీసుకుని రాజీనామా చేయండి, మీ ఎన్నికల ఖర్చులకు కూడా డబ్బు ఇస్తాం” అని ముఖ్యమంత్రి అన్నారు. "ఏం డబ్బు వాగ్దానం చేస్తున్నారు? నల్లధనం కాదా? అవినీతి సొమ్ము కాదా?" ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ సూత్రాలను బీజేపీ నాశనం చేస్తోందని సిద్ధరామయ్య ఆరోపించారు.
Read More
Next Story