డ్రగ్స్ నెట్వర్క్ భగ్నం చేసిన పోలీసులు
x
డ్రగ్స్ కేసులో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసిన ఆఫ్రికా దేశాలకు చెందిన డ్రగ్ స్మగ్లర్లు

డ్రగ్స్ నెట్వర్క్ భగ్నం చేసిన పోలీసులు

ముగ్గురు విదేశీయులు సహ, పదిమంది తమిళనాడు వాసుల అరెస్ట్


మహాలింగం పొన్నుస్వామి

తమిళనాడులోని తిరువళ్లూర్ దొరికిన చిన్న తీగను పోలీసులు లాగితే ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న అతిపెద్ద డ్రగ్ రాకెట్ బయటపడింది. నైజీరియా, కాంగో, సెనెగల్ కు చెందిన విదేశీయులతో సహ దాదాపు డజన్ కు పైగా అనుమానితులను పోలీసులు ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ ఈశాన్య రాష్ట్రాలలో జరిగిన ఈ ఆపరేషన్ లో డిజిటల్ యాప్ లు ద్వారా మెథాంఫేటమిన్, గంజాయి, కొకైన్ లను అక్రమంగా రవాణా చేసే నెట్ వర్క్ ను పోలీసులు విచ్ఛిన్నం చేశారు.
అక్టోబర్ 14న..
అక్టోబర్ 14న తిరువళ్లూర్ లోని మనవలనగర్ లో 55 గ్రాముల మెథాంఫెటమైన్ తో షేక్ మునీర్, జావీద్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీసులు పట్టుకున్నారు. వీరిని విచారించినప్పుడు కీలక విషయాలు, డ్రగ్ నెట్వర్క్ సమాచారం పోలీసులకు అందింది.
మనవాలనగర్ పోలీస్ స్టేషన్ లో (క్రైమ్ నంబర్ 195/2025) నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోఫిక్ సబ్ స్టాన్సెన్(ఎన్డీపీఎస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరి సమాచారాన్ని బయటకు తీసినప్పుడు నిత్యం ముంబై ప్రయాణం చేస్తున్నట్లు గుర్తించారు. ఆ తరువాత బెంగళూర్, చెన్నై నగరాలకు చేరుకుని సింథటిక్ డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలుసుకున్నారు.
దర్యాప్తులో లోతుగా వెళ్తున్నప్పుడూ అక్టోబర్ 23న శిబిరాజ్(22) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి డ్యాన్స్ స్టూడియో యజమాని, ఇన్ ప్లూయన్సర్ అయిన శిబిరాజ్ దగ్గర దాదాపు 54 గ్రాములు డ్రగ్స్ దొరికాయి. దీనిపై పోలీసులు క్రైమ్ నంబర్ 201/2025 నమోదు చేసి నిందితుడిని జ్యూడిషీయల్ కస్టడీకి తరలించారు.
పదిమంది తమిళులు..
ఈ కేసును ఛేదించడానికి రాణిపేట, వెల్లూర్, తిరువణ్ణామలై జిల్లాల ఇన్ స్పెక్టర్లతో పాటు దాదాపు 15 మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో ఈ ముఠా మొత్తం నెట్వర్క్ ను పోలీసులు గుర్తించారు.
ఢిల్లీకి చెందిన ఒక కింగ్ పిన్ వాట్సాప్ ద్వారా ప్రత్యేకంగా అమ్మకాలు నిర్వహిస్తున్నాడని తెలుసుకున్నారు. కొనుగోలుదారులు పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మిజోరాంలలోని ఖాతాలకు నిధులు పంపించేవారు. చెన్నై, బెంగళూర్ లోని జీపీఎస్ కో ఆర్డినేటర్లు అక్కడి నుంచి సమాచారం అందుకుని వారికి డ్రగ్స్ ను సప్లై చేసేవారు.
ఈ నెట్వర్క్ కు డబ్బు పంపిన 10 మంది తమిళనాడు వాసుల ఆధారాలను పోలీసులు సేకరించారు. వీరిలో అందరి దగ్గర మాదక ద్రవ్యాలు దొరికాయి. ఇందులో మరో ఇద్దరు విదేశీయులు సైతం ఉన్నారు. నైజీరియాకు చెందిన మైఖేల్ నామ్డి(43), కాంగోకు చెందిన కఫితా యానిక్(36) కీలక వ్యక్తులు.
వీరిని దర్యాప్తు బృందాలు ఢిల్లీకి తీసుకెళ్లి విచారించాయి. అక్కడ పది రోజుల వేట తరువాత నోయిడాలో దాక్కున్న కింగ్ పిన్ ను గుర్తించారు. ఢిల్లీ పోలీసుల సహాయంతో నవంబర్ ఆరు న అపార్ట్ మెంట్ పై దాడి చేసి, సెనెగల్ జాతీయుడైనా వాగ్నే కుమారుడు బెండే(43) ను అరెస్ట్ చేశాను. నిందితుడి నుంచి తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలలోని సరఫరా గొలుసులపై ఉన్న డేటాను వెలికి తీశారు.
ఢిల్లీ కేంద్రంగా..
నార్త్ జోన్ ఐజీ అస్రా గార్గ్ ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ‘‘ఈ కేసులలో ప్రధాన నిందితుడు ఢిల్లీలో ఉన్నాడు. ఇంటర్నెట్ నుంచి ప్రత్యేకంగా తన ముఠా నెట్వర్క్ ను నడిపించాడు’’ అని తేలింది.
ఢిల్లీ పోలీసుల సహాయంతో సెనెగల్ కు చెందిన బెండే వాగ్నే అనే కింగ్ పిన్ ను తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో నెట్వర్క్ ను భగ్నం చేయగలిగామని చెప్పారు.
ఈశాన్య నుంచి మాదక ద్రవ్యాలు..
బెండే ఈశాన్య సరిహద్దు ప్రాంతాల నుంచి నకిలీ ఐడీ కార్డులు, బహుళ సిమ్ లు వస్త్ర దుకాణాల వంటి వ్యాపారాలను ఉపయోగించి డ్రగ్స్ ను సరఫరా చేసేవారు. ప్రస్తుతం అతడిని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తిరువళ్లూర్ కు తరలించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
‘‘బెండె సహచరుడు ఒకరు ఈశాన్య రాష్ట్రాల నుంచి నిషిద్ద వస్తువులు తీసుకువచ్చి ముంబై, బెంగళూర్, చెన్నై వంటి నగరాలకు సరఫరా చేసినట్లు విచారణలో తేలింది’’ అని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అక్రమ లావాదేవీలను గుర్తించకుండా ఉండటానికి నకిలీ గుర్తింపు కార్డులు, వస్త్ర దుకాణాల వ్యాపారాలను ఓ కవచంగా ముఠా వాడుకుంది.
ఆన్ లైన్ లో కస్టమర్లకు గాలం..
విదేశాలలో ఉన్న బెండే స్నేహితులు ఇతర మాదక ద్రవ్యాల నేరస్థులు ఆన్ లైన్ లో కస్టమర్లను ఆకర్షించడంలో బిజీగా ఉన్నారని తేలింది. మాదక ద్రవ్యాల డీలర్లు, స్టాష్ హ్యాండర్లు, బ్యాంక్ ఖాతా ఆపరేటర్లు అంతర్ రాష్ట్ర క్యారియర్ లతో సహ అదనపు ఫెసిలిటేటర్లను తెలుసుకోవడానికి విచారణ కొనసాగుతోంది.


Read More
Next Story