కేరళలోని వయనాడ్ జిల్లాకు చేరుకున్న రాహుల్, ప్రియాంక
x

కేరళలోని వయనాడ్ జిల్లాకు చేరుకున్న రాహుల్, ప్రియాంక

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి, కాంగ్రెస్ అధినేత ప్రియాంక గాంధీ గురువారం ఉదయం కేరళకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించే అవకాశం ఉంది.


లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి, కాంగ్రెస్ అధినేత ప్రియాంక గాంధీ గురువారం ఉదయం కేరళకు చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కారణంగా వాయనాడ్‌ జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల, అట్టమాల, నూల్‌పుజా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడడంతో వందల సంఖ్యలో మహిళలు, గత మూడు రోజులుగా ఎన్‌డిఆర్‌ఎఫ్, సాయుధ బలగాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఎన్‌డిఆర్‌ఎఫ్, సాయుధ బలగాలు, ఇతర ఏజెన్సీలు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం తెలిపారు.

వాయనాడ్ జిల్లాలోని ముండక్కై, చూరల్‌మల ప్రాంతాల్లోని దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయని సీఎం అన్నారు. "ఈ ప్రాంతాలు పూర్తిగా నాశనమయ్యాయి. విపత్తు ప్రాంతాల నుండి వీలైనంత ఎక్కువ మందిని రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు. ఇప్పటిదాకా 276 మంది చనిపోయారు. 191 మంది గల్లంతయినట్లు సమాచారం.

పొంగిపొర్లుతున్న నదులపై చిన్న, తాత్కాలిక వంతెనలను సహాయక బృందాలు నిర్మించాయి. ఎక్సవేటర్ల సాయంతో శిధిలాలు, బండరాళ్లను తొలగిస్తున్నారు. బెయిలీ వంతెన నిర్మాణం గురువారం మధ్యాహ్నానికి పూర్తవుతుంది. “రెండు రోజుల రెస్క్యూ ఆపరేషన్‌లో 1,592 మందిని రక్షించారు. సహాయక బృందాలు తక్కువ సమయంలో ఎక్కువ మందిని కాపాడగలిగారని విజయన్ విలేకరుల సమావేశంలో అన్నారు.

Read More
Next Story