రాహూల్ ‘డీఎన్ఏ’ను పరిశీలించాలి: సీపీఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు
x

రాహూల్ ‘డీఎన్ఏ’ను పరిశీలించాలి: సీపీఎం నేత వివాదాస్పద వ్యాఖ్యలు

రాహూల్ గాంధీపై సీపీఎం నాయకుడు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన డీఎన్ఏను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి


సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అభ్యర్థి పీవీ అన్వర్, రాహూల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాహూల్ గాంధీ డీఎన్ఏను పరిశీలించాలని ఆయన అన్న మాటలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్వర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

ఒక ఎన్నికల సభలో అన్వర్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ అగ్రనాయకుడు ఒకాయనకు గాంధీ అనే ఇంటి పేరుతో పిలవడానికి ఏమాత్రం అర్హత లేదు, ఆయనో నాలుగో తరగతి పౌరుడు అని వ్యాఖ్యానించారు. ఇటీవల ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అన్వర్, నెహ్రూ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలాంటి ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
ఇక్కడ ఎడతనట్టుకరలో ఎల్‌డిఎఫ్‌ స్థానిక కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో అన్వర్ మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ డిఎన్‌ఎను పరిశీలించాలని నా అభిప్రాయం.. అందులో ఎలాంటి వివాదమూ లేదు అని రాజకీయ నాయకుడిగా మారిన ఈ వ్యాపారవేత్త అన్నారు.
ఎన్నికల ప్రచారం లో భాగంగా కేరళలో ప్రచారం నిర్వహించిన రాహూల్ గాంధీ.. పినరయి విజయన్ అనేక కుంభకోణాలు చేసినప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనను ఎందుకు అరెస్ట్ చేయట్లేదో అని అనుమానం వ్యక్తం చేశారు. విజయన్ వైపు దర్యాప్తు సంస్థలు ఎందుకు చూడట్లేదని, పరోక్షంగా బీజేపీతో విజయన్ కుమ్మక్కు అయ్యారనే వ్యాఖ్యాలు చేశారు.
విజయన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు చేసిన ప్రకటనలపై వామపక్ష నేతలు తీవ్రంగా విమర్శించారు. విజయన్‌కు బదులుగా మోదీని, ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశ్నించాలని అన్నారు. రాహుల్‌పై అన్వర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తన ప్రతిస్పందనను కోరినప్పుడు, ఆయన ఎల్‌డిఎఫ్ ఎమ్మెల్యేను సమర్థించారు. కాంగ్రెస్ నాయకుడు విమర్శలకు అతీతమైన వ్యక్తి కాదని అన్నారు. 'రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కచ్చితంగా జవాబు ఉంటుంది. ఆయన విమర్శలకు అతీతమైన వ్యక్తి కాదు' అని విజయన్ కన్నూర్‌లో విలేకరులతో అన్నారు.
రాహుల్ గాంధీపై ఆరోపించిన అవమానకరమైన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్, అన్వర్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో కమిషన్ తక్షణ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ, రాహుల్ గాంధీని, నెహ్రూ కుటుంబాన్ని అవమానించినందుకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని KPCC కార్యనిర్వాహక అధ్యక్షుడు MM హసన్ పోలీసులను కోరారు. అన్వర్ సీఎం చేతిలో కీలుబొమ్మ అని, ఈ వ్యాఖ్యలు చేయడానికి సీఎం విజయన్, అన్వర్ ను ఉపయోగించుకున్నాడని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఏఐసీసీ కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంపై అవమానకర వ్యాఖ్యలు చేసేందుకు సీపీఎం తన ఎమ్మెల్యేలను ప్రొత్సహిస్తోందని మండిపడ్డారు.
Read More
Next Story