ప్రయాణీకురాలిపై కూలిన రైల్వే మిడిల్ బెర్త్
x
తలకు గాయమైన ప్రయాణికురాలు సూర్య

ప్రయాణీకురాలిపై కూలిన రైల్వే మిడిల్ బెర్త్

కోచ్ లో అందుబాటులోని ప్రథమ చికిత్స పెట్టే, తీవ్ర రక్తస్రావంతో గంటన్నర పాటు వేచి చూసిన బాధితురాలు


రైలు ప్రయాణం.. దూరపు ప్రయాణాలకు అనుకూలమే కాదు.. చవకగా సైతం ఉంటుంది. చాలా సులువుగా అనుకున్న ప్రాంతాలకు చేరుకోవచ్చు. అందుకే సామాన్య జనం ఎక్కువగా రైలు ప్రయాణాలను ఎంచుకుంటారు. అయితే తమిళనాడులోని ఓ కుటుంబానికి మాత్రం రైలు ప్రయాణం చేదు అనుభవాన్ని మిగిల్చింది. వివరాల్లోకి వెళితే..

చెన్నైలో నివాసం ఉంటున్న సూర్య(39) తన కుటుంబంతో కలిసి తన సొంత ఊరు మున్నార్ కు పాలక్కాడ్ ఎక్స్ ప్రెస్ లో బయల్దేరింది. అయితే ఎస్ 5 కోచ్ లో మే 11న రాత్రి 1.30 నిమిషాలకు పైన బెర్త్ లో ఉన్న ప్రయాణికుడు వాష్ రూమ్ కి కిందకి దిగుతున్న సమయంలో బెర్త్ కూలి కింద నిద్రిస్తున్న సూర్య మీద పడింది. అది నేరుగా ప్రయాణికురాలి తలపై పడటంతో తీవ్ర రక్తస్రావం జరిగింది.
ఆమె అరుపులతో లేచిన కంపార్ట్ మెంట్ లోని ప్రయాణికులు సాయం కోసం వచ్చారు. ప్రథమ చికిత్స కోసం టీటీఈని సంప్రదించగా, కోచ్ లో ఎలాంటి ప్రథమ చికిత్స కిట్ అందుబాటులో లేదని సమాచారం ఇచ్చారని సూర్య ఆరోపించింది. రక్తం స్రావం కారుతున్నప్పటికీ సమీపంలోని ఏ స్టేషన్ లోనూ రైలును ఆపలేదని ఆమె చెప్పారు.
చివరకు సేలం స్టేషన్ చేరుకునే వరకూ దాదాపు గంటన్నర పాటు వేచిచూశామని, అక్కడ సూర్యకు వైద్యసాయం అందించినట్లు చెప్పారు. వైద్యులు గాయానికి ప్రథమ చికిత్స చేసి మూడు కుట్లు వేశారు.
కఠినచర్యలు తీసుకోవాలి..
రైల్వే అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని సూర్య డిమాండ్ చేశారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ‘‘రైలులో ప్రథమ చికిత్స పెట్టే కూడా లేదు’’ అని చెప్పారు. కొద్దిసేపటి తరువాత తనకు మోరప్పూర్ స్టేషన్ లోని రైల్వే భద్రత అధికారుల నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, అలాంటి సంఘటనకు సంబంధించి ఎటువంటి రికార్డులు లేవని పేర్కొన్నారు.
రైలులో ఇలాంటి సంఘటన జరగడం ప్రయాణికులను ఆందోళన వ్యక్తం అవుతోంది. సుదూర రైళ్లలో అత్యవసర వైద్య సౌకర్యాల అందకపోవడంపై ప్రశ్నలను లేవనెత్తింది. అత్యవసర ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదని చాలామంది ప్రశ్నిస్తున్నారు.
బెర్త్ సరిగా లాక్ చేయలేదు: రైల్వే అధికారులు..
దక్షిణ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎం. సెంతమిజ్ సెల్వన్ మీడియాతో మాట్లాడారు. వాణిజ్య, వైద్య ప్రోటోకాల్ లకు అనుగుణంగా రైల్వే అధికారులు వెంటనే వైద్య సహాయం ఏర్పాటు చేశారని అన్నారు. ‘‘ ఆ ప్రయాణికురాలు చికిత్స కోసం మొరప్పూర్ స్టేషన్ లో దిగడానికి నిరాకరించారు.
తరువాత సేలం స్టేషన్ లో ఆమెకు అత్యవసర వైద్య సిబ్బంది చికిత్స అందించారు. స్టేషన్ మాస్టర్ ఏర్పాటుచేసిన అంబులెన్స్ లో చికిత్స కోసం మధ్యాహ్నం 3.05 నిమిషాలకు సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు’’ అని అధికారి తెలిపారు.
ఈ దుర్ఘటన సాంకేతిక లోపం వల్ల కాదని మిడిల్ బెర్త్ లాకింగ్ మెకానిజాన్ని ప్రయాణీకుడు సరిగ్గా చేయకపోవడం వల్ల జరిగినట్లు కనిపిస్తోందని చెప్పారు.
కోచ్ ఎస్5 బోగిలో మెకానికల్, ఆర్పీఎఫ్, ట్రాఫిక్ విభాగాల అధికారులు తనిఖీ నిర్వహించారని సెల్వన్ చెప్పారు. ‘‘చెయిన్ బోల్ట్ మెకానిజం చెక్కు చెదరకుండా, సురక్షితంగా ఉన్నట్లు తనిఖీలో వెల్లడైంది.
మిడిల్ బెర్త్ హుక్ ను 2.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తితినే దానిని విడుదల చేస్తుంది. ఇది ప్రామాణిక స్పెసిఫికేషన్లకు అనుగుణంగా ఉంది. కోచ్ మార్చి 16, 2025 లో పూర్తి స్థాయిలో నిర్వహణ చేశాము.
అక్కడ ఎలాంటి సమస్యలు లేవు. రైలు చెన్నైలో బయల్దేరిన సమయంలో ప్రీ డిపార్చర్ తనిఖీ కూడా చేశాం. ఫిట్ నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేశాం’’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

Read More
Next Story