రామేశ్వరం కెఫె బ్లాస్ట్: మరొ నిందితుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
x

రామేశ్వరం కెఫె బ్లాస్ట్: మరొ నిందితుడిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

భారత ఐటీ రాజధాని బెంగళూర్ లోని రామేశ్వరం కెఫెలో జరిగిన బాంబు పేలుడుపై ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా కీలక నిందితుడికి సహకరించిన వ్యక్తి..


బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు బుధవారం దర్యాప్తు సంస్థ వెల్లడించింది. NIA కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పేలుడుకు పాల్పడిన ప్రధాన నిందితుడికి అరెస్ట్ అయిన వ్యక్తి ప్రధాన సహచరుడు అని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.

ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. అంతకుముందు, NIA ప్రధాన నిందితుడి ఫోటోలు, వీడియోలను విడుదల చేసింది నిందితుడి గురించి సమాచారాన్ని పంచుకోవాలని సాధారణ ప్రజలను కోరింది. సమాచారం అందజేస్తే రూ. 10 లక్షల రివార్డు ఇవ్వడంతో పాటు, సమాచారం అందజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సాధారణ పౌరులు గాయపడ్డారు. ఈ బాంబు పేలుడుకు మంగళూర్, తమిళనాడులో జరిగిన బాంబు పేలుళ్లుకు పోలికలు ఉన్నాయని భావించిన పోలీసులు కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. అలా ఈ కేసును మార్చి 3న NIA స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి వివిధ కోణాల్లో కేసును విచారించింది.


Read More
Next Story