కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు హైకోర్టులో ఊరట
x

కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు హైకోర్టులో ఊరట

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు కోర్టులో ఊరట లభించింది. ఇంకా హైకోర్టు ఆయనకు ఏమని సూచించింది?


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ లీడర్ బిఎస్ యడ్యూరప్పకు కోర్టులో ఊరట లభించింది. పోక్సో కేసులో ఆయనకు అరెస్ట్ వారెంట్‌ జారీ అయ్యింది. అయితే కర్ణాటక హైకోర్టు శుక్రవారం దానిపై స్టే విధించింది. ఆయనను అరెస్టు చేయవద్దని పోలీసులకు సూచించింది.

కేసును కొట్టివేసి, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని యడ్యూరప్ప ఇప్పటికే కోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ ఆదేశాల మేరకు జూన్ 17న విచారణాధికారి ఎదుట హాజరు కావాలని యడ్యూరప్పకు హైకోర్టు సూచించింది.

యడియూరప్పపై ఎందుకు ఫోక్సో కేసు..

తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో బీజేపీ సీనియర్ లీడర్ యడియూరప్ప (81)పై సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మహిళ, ఆమె కూతురు ఒక మోసం కేసుకు సంబంధించి సాయం కోసం ఫిబ్రవరి 2న యడ్యూరప్పను కలిశారు. ఆ సమయంలో తన కుమార్తెను లైంగిక వేధింపులకు గురైందని పోలీసులకు చెప్పడంతో యడియూరప్పపై పోలీసులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012 (పోక్సో) సెక్షన్ 8, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354A కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసు దర్యాప్తును కర్ణాటక ప్రభుత్వం క్షుణ్ణంగా, నిష్పక్షపాతంగా విచారించేలా నేర పరిశోధన విభాగం (సిఐడి)కి బదిలీ చేసింది. కేసు నమోదై దాదాపు మూడు నెలలు గడిచినా.. CID నిందితుడిని విచారించకపోగా, ఘటన స్థలం నుండి CCTV ఫుటేజీని సేకరించలేదని, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని బాధితురాలి సోదరుడు హైకోర్టును ఆశ్రయించాడు.

ఈ పరిణామం తర్వాత యడ్యూరప్ప కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అదనంగా, విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసు అందుకున్న తర్వాత అతను బెయిల్ కోరుతూ మరో దరఖాస్తును దాఖలు చేశాడు. బాధితురాలి తల్లి కూడా ఇటీవల ఆసుప్రతిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

Read More
Next Story