రేణుకాస్వామి హత్య కేసు నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..
x

రేణుకాస్వామి హత్య కేసు నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు..

రేణుకాస్వామి హత్య కేసులో నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు. నిందితులకు ఆగస్టు 28 వరకు కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


రేణుకాస్వామి హత్య కేసులో నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించారు. నిందితులు కన్నడ నటుడు దర్శన్‌ తూగుదీపతో పాటు అతని స్నేహితురాలు పవిత్ర గౌడ, మరికొంతమందికి ఆగస్టు 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి వారి జ్యుడీషియల్ కస్టడీ ఈ రోజు (ఆగస్టు 14)తో ముగిసింది. అయితే కామాక్షిపాళ్య పోలీసులు విచారణను మరింత సమయం కావాలని కోరడంతో కస్టడీని కోర్టు పొడిగించారు.

పోలీసుల కథనం మేరకు.. పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని దర్శన్ అభిమాని 33 ఏళ్ల రేణుకాస్వామి దర్శన్ హత్య చేశాడు. రేణుకాస్వామి మృతదేహం జూన్ 9న ఇక్కడి సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న మురుగునీటి కాలువ దగ్గర కనిపించడంతో పోలీసులు కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ హత్యకు సహకరించిన చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘంలో ఒకరైన రాఘవేంద్ర రేణుకస్వామిని ఆర్‌ఆర్ నగర్‌లోని ఓ షెడ్డుకు తీసుకొచ్చాడు. అక్కడే రేణుకస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు.

Read More
Next Story