ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీ..
x

ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీ..

బెంగళూరు గృహ యజమానులపై రూ. 600 కోట్ల అదనపు భారం..


Click the Play button to hear this message in audio format

బెంగళూరు మహా నగర పాలక సంస్థ మరో బాదుడుకు సిద్ధమవుతోంది. ఇంటింటి చెత్త సేకరణకు యూజర్ చార్జీలను వసూలు చేయనుంది. దీంతో ప్రజలపై ఏడాదికి రూ.600 కోట్ల ఆదనపు భారం పడనుంది. వాస్తవానికి గత నవంబరు నుంచే వసూలు చేయాలని BBMP అధికారులు (Bruhat Bengaluru Mahanagara Palik) భావించారు. తర్వలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ ప్రతిపాదనపై నగరంలోని పౌర హక్కుల నేతలు స్పందించారు. BSWML (Bengaluru Solid Waste Management Ltd), BBMP లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. 2022లో ఏర్పాటయిన BSWML రోజుకు 6,000 టన్నుల చెత్తను సేకరిస్తోంది. ఖర్చులు పెరుగుతూ పోవడంతో సంస్థ నిర్వహణకు ఏడాదికి రూ. 550 కోట్లు ఖర్చవుతోంది.

‘సాధారణ ప్రజలపై అదనపు ప్రభావం..’

చెత్త పన్ను విధింపుపై వివిధ రాజకీయ పార్టీల నేతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ప్రజలు వివిధ రకాల పన్నులు చెల్లిస్తున్నారని, చెత్త పన్ను వారికి అదనపు భారమవుతుందని పేర్కొన్నారు. పెరిగిన ఇంధన ధరలు, పెరిగిపోయిన ఇళ్ల అద్దెలతో సతమతమవుతోన్న సాధారణ కుటుంబానికి ఇది మరో ఆర్థిక భారమని చెబుతున్నారు.

‘మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది’

"యూజర్ చార్జీలతో లండన్ లేదా పారిస్ తరహాలో సౌకర్యాలు కల్పించాలని ఉపముఖ్యమంత్రి భావించి ఉండవచ్చు. కానీ బెంగళూరువాసులు చెల్లించే స్థితిలో ఉన్నారా? ఇది మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందే,"

- అనిల్ నచప్ప, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) బెంగళూరు ప్రతినిధి

‘‘యూజర్ చార్జీ వసూలు అన్యాయం’’

"యూజర్ చార్జీ వసూలుకు మా పార్టీ పూర్తిగా వ్యతిరేకం. ప్రజలు ఇప్పటికే చాలా రకాల పన్నులు చెల్లిస్తున్నారు. కానీ ఆ డబ్బంతా ఏమవుతుందో, ఎక్కడ ఖర్చుచేస్తున్నారో బయటపెట్టడం లేదు. అసలు ఎంత వసూలు చేయాలనే దానిపై స్పష్టత లేదు.’’

- శ్రీకాంత్ నరసింహన్, బెంగళూరు నవనిర్మాణ పార్టీ (BNP) వ్యవస్థాపకుడు


‘కంపోస్టింగ్ యూనిట్లు పెట్టాలి’

"BBMP, BSWML తమ దగ్గరున్న నిధులను సరిగా వినియోగించలేదు. పరిపాలనా వ్యవహారాలకు, గ్రామాల్లో మౌళిక వసతులకు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం బయోగ్యాస్ ప్లాంట్లు నిర్మించాలి. డ్రై వెస్ట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. వార్డు స్థాయిలో కంపోస్టింగ్ యూనిట్లు పెట్టాలి.’’

- సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పర్ట్

Read More
Next Story