భాషా సమానత్వాన్ని కోరడం దురభిమానం కాదు: స్టాలిన్
x

భాషా సమానత్వాన్ని కోరడం దురభిమానం కాదు: స్టాలిన్

తమిళం కోసం మోదీ చేసినంత కూడా స్టాలిన్ చేయలేదని అన్నామలై విమర్శలు


తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. హిందీని వద్దన్నందుకు తమపై జాతి వ్యతిరేకులని ముద్రవేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీది మూఢత్వం..
‘‘కొంతమంది ప్రత్యేక హక్కులు అలవాటు పడిన తరువాత సమానత్వం అణచివేతలా అనిపిస్తుంది’’ అని అన్నారు. తమిళనాడులో తమిళులకు సరైన స్థానాన్ని కోరితే మత దురభిమానులు మమల్నీ దేశ వ్యతిరేకులుగా పిలుస్తున్నారని ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నాథూరామ్ గాడ్సేను ఆరాధించే వారికి తమ పార్టీ దేశభక్తిని ప్రశ్నించలేరని డీఎంకే చీఫ్ అన్నారు.
‘‘గాడ్సే భావజాలాన్ని కీర్తించే వ్యక్తులే చైనా దురాక్రమణ, బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, కార్గిల్ యుద్దాల సమయంలో అత్యధిక మొత్తం నిధులు అందించిన డీఎంకే, దాని ప్రభుత్వ దేశభక్తిని ప్రశ్నించే ధైర్యం చేస్తున్నారని విమర్శించారు. అయితే వారి సైద్దాంతిక పితామహుడు ‘బాపు’ను హత్య చేశాడని ఆయన అన్నారు.
భాషా సమానత్వాన్ని కోరుకోవడం దురభిమానం కాదు..
భాషా సమానత్వం కోసం ఒక రాష్ట్రం డిమాండ్ చేయడం దురభిమానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కీలకమైన చట్టాలను హిందీలో పేర్కొనడం, ఎన్ఈపీ అమలు చేయనందుకు తమిళనాడు నిధులను నిరాకరిస్తున్నదని ముఖ్యమంత్రి విమర్శించారు.
‘‘140 కోట్ల మంది పౌరులను పరిపాలించే మూడు క్రిమినల్ చట్టాలను తమిళులు ఉచ్చరించలేని, చదవలేని భాషలో పెడుతోంది. దేశానికి అత్యధికంగా సాయమందిస్తున్న రాష్ట్రాన్ని చౌవినిజం రెండవ తరగతి పౌరులుగా పరిగణిస్తోంది. ఎన్ఈపీ అనే విషాన్ని మింగడానికి నిరాకరించినందుకు దాని న్యాయమైన వాటాను నిరాకరిస్తోంది’’ అని ఆయన తన పోస్టులో చెప్పారు.
హిందీలో మతోన్మాదులపై విరుచుకుపడండి..
‘‘ఏదైన బలవంతంగా విధించడం వల్ల శత్రుత్వం పెరుగుతుంది. శత్రుత్వం ఐక్యతకు ముప్పు కలిగిస్తుంది.’’ నిజమయిన జాతీ వ్యతిరేకులు హిందీవాదులని అన్నారు. కానీ మన(తమిళనాడు) ప్రతిఘటనను మాత్రం వారు దేశ వ్యతిరేకులు, ప్రతిఘటనగా గా చూస్తారని అన్నారు. రాష్ట్ర, బీజేపీ చీఫ్ కే. అన్నామలై, ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించిన తరువాత ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.
స్టాలిన్ కపటుడు..
రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు సరిహద్దులు దాటి మన తమిళ భాషను ప్రచారం చేయడంలో మీరు ఏం విజయాలు సాధించారు. డీఎంకే అలా చేయకుండా ఎవరైనా అడ్డుకున్నారా? ఇంతకుముందు ఏఐడీఎంకే పాలన ప్రారంభించిన తమిళ అభివృద్ది కేంద్రం కోసం మీరు ఏం కార్యక్రమాలు చేశారు.
తమిళం ఎప్పుడూ కూడా మన రాష్ట్ర సరిహద్దులోనే ఉండాలని కోరుకుంటున్నారని, తమిళం వ్యాప్తిలో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న సగం చర్యల్లో కూడా స్టాలిన్ తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘తమిళం కంటే సంస్కృతానికి నిధుల కేటాయింపు పెరగడం గురించి ఒక కపటుడు మాత్రమే అడుగుతాడు. దాని వెనక ఉన్న హేతుబద్దత బాగా తెలుసు. 2006-14 మధ్య సంస్కృతం, తమిళం అభివృద్దికి కేంద్రం ప్రభుత్వం చేసిన కేటాయింపులు సంస్కృత భాషకు రూ. 675 కోట్లు, తమిళానికి రూ. 75.05 కోట్లు కేటాయించారు. ’’ అని తన పోస్టులో పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్నది డీఎంకే అని అన్నామలై పరోక్షంగా స్టాలిన్ కు చురకలు అంటించారు.
డీలిమిటేషన్ వరుస..
మార్చి 5న అంటే బుధవారం సీఎం అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం కూడా వివాదాస్పదమైన అంశం పై జరిగింది. 2026 నుంచి 30 సంవత్సారాలకు పాటు పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనకు 1971 జనాభా లెక్కల ఆధారంగా ఉండాలని స్టాలిన్ ప్రతిపాదించారు.
సంబంధిత డిమాండ్ల కోసం ఒత్తిడి తీసుకురావడానికి అన్ని దక్షిణాది రాష్ట్రాలను కలిగి ఉన్న జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పాటు మద్దతు ఇచ్చారు. పార్లమెంట్ లో సీట్ల సంఖ్య పెరిగితే 1971 లో జనాభా లెక్కల ఆధారంగా తగిన రాజ్యాంగ సవరణ చేయాలని స్టాలిన్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతూ అన్నారు.
Read More
Next Story