సెంగొట్టయన్ బహిష్కరణతో అన్నాడీఎంకేలో పెరిగిన అంతర్గత కలహాలు
x
సెంగొట్టయన్‌ (ఫైల్)

సెంగొట్టయన్ బహిష్కరణతో అన్నాడీఎంకేలో పెరిగిన అంతర్గత కలహాలు

తొలగించడాన్ని తప్పుబట్టిన AIADMK బహిష్కృత నేతలు..


Click the Play button to hear this message in audio format

AIADMK సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె.ఎ. సెంగొట్టయన్‌(Sengottaiyan)ను శుక్రవారం (అక్టోబర్ 31) పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో అన్నాడీఎంకేలో అంతర్గత కలహాలు మరింత ముదిరాయి. తమిళనాడు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెంగొట్టయన్ బహిష్కరణ.. పార్టీలో ఆధిపత్య పోరాటాన్ని తీవ్రతరం చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) తీసుకున్న ఈ చర్యను ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), టీటీవీ దినకరన్(TTV Dhinakaran) సహా ఇతర బహిష్కృత నేతలు తీవ్రంగా విమర్శించారు. దివంగత జె జయలలిత సన్నిహితురాలు శశికళ(Sasikala) ఈపీఎస్ చర్యను ‘‘స్వీయ-విధ్వంసం"గా అభివర్ణించారు.


'ద్రోహంలో నోబెల్ బహుమతికి అర్హుడు'

గోబిచెట్టిపాళయం ఎమ్మెల్యే, ఐదు దశాబ్దాల రాజకీయానుభవం ఉన్న సెంగొట్టయన్ శుక్రవారం గోబిచెట్టిపాళయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ద్రోహం చేసిన ఈపీఎస్‌ నోబెల్ బహుమతికి అర్హుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొడనాడు హత్య కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ఈపీఎస్‌పై డీఎంకే నేటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. పైగా నన్ను DMK బి-టీం అని ఈపీఎస్ పిలుస్తున్నాడు? వాస్తవానికి ఆయనే DMKకు A-టీం’’ అని మండిపడ్డారు.

‘‘ముందస్తు నోటీసు ఇవ్వకుండా పార్టీ పదవుల నుంచి తప్పించారు. పార్టీ నియమాలను పాటించలేదు. దీనిపై నా తరుపు న్యాయవాది చట్టపర చర్యలు తీసుకుంటారు. త్వరలో నా కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తా. AIADMK కోసం పనిచేస్తూనే ఉంటా.’’ అని చెప్పారు సెంగొట్టయాన్.


‘పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు’

జయలలిత మరణం తర్వాత AIADMK ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన EPS.. "పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు" పాల్పడడంతో సెంగొట్టయన్ బహిష్కరణకు గురయ్యాడని చెప్పారు. సేలంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు.


‘పార్టీ కోసం అహర్నిశలు శ్రమించా..’

1972లో ఎంజిఆర్ పొలిటికల్ జర్నీలో సభ్యుడిగానే కాకుండా కార్యదర్శిగా కూడా పనిచేశానని సింగొట్టయాన్ చెప్పుకొచ్చారు. "నేను 1975లో కోయంబత్తూరులో మొదటి జనరల్ బాడీ సమావేశం జరిగింది. కెఎ కృష్ణసామి, ఆర్‌ఎం వీరప్పన్ నుంచి ప్రశంసలు అందుకున్నాను. జయలలిత హయాంలో నేను పార్టీ కోసం పగలు, రాత్రి కష్టపడ్డా. ఆ విషయాన్ని ఆమె నా పెళ్లిలో కూడా చెప్పారు.


‘ఆ హక్కు ఈపీఎస్‌కు లేదు..’

మధురై నుంచి దినకరన్ ఈపీఎస్‌ను తీవ్రంగా విమర్శించారు. "EPS అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. సెంగొట్టయాన్‌ను DMK "టీం A-" అని ముద్ర వేయడం తగదు. సెంగొట్టయన్‌ను తొలగించే హక్కు ఈపీఎస్‌కు లేదు." అని పేర్కొ్న్నారు.

శశికళ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. "సెంగోట్టయన్‌ను బహిష్కరించడం చాలా బాధాకరం. ఒక కొమ్మపై కూర్చుని మరో కొమ్మను నరికివేయడంగా అభివర్ణించారు.

Read More
Next Story