సెక్స్ స్కాండల్: బాధితులకు ఆర్థికసాయం అందిస్తామన్న కన్నడ సర్కార్
x

సెక్స్ స్కాండల్: బాధితులకు ఆర్థికసాయం అందిస్తామన్న కన్నడ సర్కార్

జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని కన్నడ సర్కార్ ప్రకటించింది. రేవణ్ణ చేతిలో దాదాపు 500 మంది..


జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులో ఇబ్బంది పడ్డ వారికి కన్నడ సర్కార్ ఆర్థిక సాయం అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. సీఎం సిద్ధరామయ్య సమక్షంలో ఇక్కడ జరిగిన విలేకరులు సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్నాటక ఇంచార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా ఈ విషయాన్నిప్రకటించారు.

నిందితులకు శిక్ష పడేలా చేయాలని రాహూల్ గాంధీ కోరారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. స్వాతంత్యం వచ్చాక ఎన్నడూ జరగని ప్రత్యేక కేసు, వందల సంఖ్యలో బాధితులు ఉన్నారని తేలిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

యువతులను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ మనవడు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్న కొడుకు. కర్నాటకలో పోలింగ్ జరుగుతున్నరోజు వందలాది యువతులపై ప్రజ్వల్ జరిపిన అత్యాచార వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
ఇవన్నీ వెంటనే వైరల్ కావడంతో ప్రభుత్వం హుటాహుటిన స్పందించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్నినియమించింది. అయితే అప్పటికే ప్రజ్వల్ దౌత్య పాస్ పోర్ట్ పై జర్మనీకి వెళ్లాడు. లైంగిక వేధింపులకు గురైన మహిళలు దాదాపు 500 పైబడే ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో ఇది రాజకీయరంగు పులుముకుంది. సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ ప్రధానికి తెలుసని, అయినప్పటికీ జేడీ(ఎస్)తో పొత్తుపెట్టుకుని రేపిస్టుని కాపాడుతున్నారని అన్నారు.
విషయం బయటకు రాగానే ప్రజ్వల్ రేవణ్ణను దౌత్య పాస్పోర్ట్ ను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. విదేశాంగ శాఖ అతడి ప్రయాణాన్ని ఎందుకు అడ్డుకోలేదని విమర్శలు గుప్పించారు. ప్రజ్వల్ ను వెనక్కి తీసుకురావడానికి ఇప్పటికే బ్లూ కార్నర్ నోటీసును జారీ చేశామన్నారు.
Read More
Next Story